గోమతి చక్రాలు అంటే ఏమిటి? వాటి గురించి ఆసక్తికర విషయాలు

గోమతిచక్రాలు.. సముద్రంలో సహజసిద్ధంగా లభించే అరుదైన వాటిలో గోమతి చక్రాలు ఒకటి.. అయితే ఈ గోమతిచక్రాలు ఎక్కువగా గుజరాత్ రాష్ట్రం, ద్వారకలోని గోమతి నదిలో లభిస్తాయి. ఈ చక్రాల ఉపయోగం అనంతం అని చెప్పవచ్చు. చంద్రుడు వృషభ రాశిలోని రోహిణి లేదా తులా రాశిలోని స్వాతి నక్షత్రంలో సంచరించే సమయంలో ఇవి రూపు దిద్దుకుంటాయి అని అంటారు.. ఈ రెండు రాశులు శుక్రగ్రహానికి చెందినవి కావటం. ఈ శుక్రుడు లక్ష్మీ దేవికి సోదరుడు కావటం వలన జ్యోతిష్యశాస్త్ర రీత్యా గోమతి చక్రాల ప్రభావం ప్రత్యేకం.. శుక్రుడు లైంగిక సామర్ధ్యానికి, ప్రేమ, దాంపత్య సౌఖ్యం, సౌభాగ్యాలకు, అదృష్టానికి కారకుడు కాబట్టి ఈ గోమతి చక్రాన్ని ధరించిన వారికి శుక్ర అనుగ్రహంలభిస్తుందని చెప్తారు.. ఇంతటి మహిమాన్వితమైన గోమతి చక్రాల గురించి మరెన్నో ఆసక్తికర విషయాలు మనం ఇపుడు తెల్సుకుందాం..

Rahasyavaaniగోమతిచక్రం.. దీనినే నాగ చక్రం అని కూడ అంటారు. శ్రీకృష్ణుని చేతిలోని సుదర్శన చక్రాన్ని పోలి ఉంటుంది కాబట్టి విష్ణు చక్రం అని కూడా అంటారు కొంతమంది… చూడటానికి నత్త గుళ్ళ ని పోలి ఉంటుంది వీటి ఆకారం.. అయితే గోమతిచక్రాలు వెనుక భాగం ఉబ్బెత్తుగాను ముందు భాగం చదరంగాను ఉంటుంది. ఇవి తెలుపు ఎరుపు రంగులలో ఉంటాయి. తెల్ల గా ఉన్న గోమతిచక్రాలు అన్ని పూజా కార్యక్రమాలలో ఉపయోగించటానికి, సకల కార్యసిధ్ధికి, ఆరోగ్య సమస్యలకి, అలాగే ధరించటానికి ఉపయోగపడతాయి.

Gomati Chakramఇక ఎర్రగా ఉన్న గోమతిచక్రాలని వశీకరణానికి, శత్రునాశనానికి, క్షుద్రప్రయోగాలకి, తాంత్రిక ప్రయోగాలకి ఉపయోగిస్తుంటారు.. ఈ గోమతిచక్రాలను గమనించినట్లయితే ఆరు, తొమ్మిది సంఖ్యలు అంతర్లీనంగా దాగి ఉంటాయి.. సంఖ్యాశాస్త్ర పరంగా చూస్తే ఆరు శుక్ర గ్రహానికి, తొమ్మిది కుజ గ్రహానికి ప్రతీకలు.. జాతకంలో కుజ శుక్రులు బలహీనంగా ఉన్నప్పుడు కలిగే దోషాలు ఈ గోమతిచక్ర ధారణవల్ల నివారించబడతాయి….. వీటిని పూజకి ఉపయోగించాలి అనుకుంటే ముందుగాపసుపు నీళ్ళతో శుభ్రపరచి పరిశుబ్రమైన బట్టతో తుడవాలి. గోమతిచక్రాలను శ్రీయంత్రం లేదా అష్ట లక్ష్మీ యంత్రం గాని పీటం మీద గాని ఉంచాలి. ఈ గోమతిచక్రాల పూజ శుక్రవారం రోజు గాని దీపావళి రోజు గాని వరలక్ష్మి వ్రతం రోజు గాని చేసుకుంటే మంచిది.. పూజ చేసిన గోమతిచక్రాలను పూజామందిరంలో గాని బీరువాలో గాని ఉంచి అవసరమైనప్పుడు తిరిగి వాటిని తీసి పూజకు ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ గోమతిచక్రాలను విడిగా పెట్టకూడదు… ఎప్పుడు ఎర్రని బట్టలో గాని, హనుమాన్ సింధూరంలో గాని ఉంచాలి. ఇక ఈ గోమతి చక్రాల ధారణ వలన ఎన్నో అద్భుత ఫలితాలు కలుగుతాయి..

Gomathi Chakkramఒక్క గోమతిచక్రాన్ని త్రాగే నీళ్ళలో ఉంచి ఆ నీటిని త్రాగటం వలన మనిషిలో రోగ నిరోదక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలనుండి విముక్తి కలుగుతుంది. గోమతిచక్రాన్ని లాకెట్ లాగ ధరిస్తే నరదృష్టి భాదల నుండి విముక్తి కలుగుతుంది. బాలారిష్ట దోషాలు కూడ తొలగి పోతాయి… రెండు గోమతిచక్రాలను బీరువాలో గాని పర్సు లో గాని ఉంచితే దనాభివృధ్ధి ఉండి ఎప్పుడు ధనానికి లోటు ఉండదు. రెండు గోమతిచక్రాలను భార్యా భర్తలు నిద్రంచే పరుపు కింద గాని దిండు కింద గాని ఉంచినట్టయితే వారిద్దరి మధ్య ఎటువంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు.

గోమతిచక్రాన్నిమూడు గోమతిచక్రాలను ధరిస్తే జనాకర్షణ, ఇతరుల సహాకారం లభిస్తుంది. అలాగే మన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులను తిరిగి ఇవ్వని వారి పేరు గోమతిచక్రాల మీద వ్రాసి నీటిలో వేయటం గాని వాటిని వెంట పెట్టుకొని డబ్బులు ఇవ్వవలసిన వ్యక్తి దగ్గరకు వెళితే అతను తీసుకున్న డబ్బులను త్వరగా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగాన్ని మంగళవారం రోజు చేస్తే ప్రయోజనం కలుగుతుంది అని అంటారు.. నాలుగు గోమతిచక్రాలు పొడిచేసి పంట భూమిలో చల్లటం వలన పంట బాగా పండుతుందట. గృహా నిర్మాణ సమయంలో గర్భ స్ధానం లో నాలుగు గోమతిచక్రాలు ఉంచినట్లయితే ఆ ఇళ్ళు త్వరితగతిన పూర్తి చేసుకొని ఆ గృహంలో నివసించే వారికి సకల ఐశ్వర్యాలు కలభిస్తాయట.. అలాగే నాలుగు గోమతిచక్రాలను వాహానాలకి కట్టటం వాహన ప్రమాదాలనుండి రక్షింపబడతారట..

గోమతిచక్రాన్నిఎవరైనా తరుచు గర్భస్రావం తో బాధపడుతున్నట్లైతే ఐదు గోమతిచక్రాలు ఆ మహిళ నడుముకు కట్టటం వలన గర్భం నిలుస్తుందట. పుత్ర సంతానం కోసం చూసే వాళ్లు 5 గోమతి చక్రాలను నదిలో విడిస్తే ఫలితం ఉంటుందట… పిల్లలు చదువుకునే పుస్తకాల దగ్గర ఐదు గోమతిచక్రాలు ఉంచటం వలన వారిలో ఏకాగ్రత పెరుగుతుందట.. అలాగే ఆరు గోమతిచక్రాలను అనారోగ్యంతో ఉన్న రోగి మంచానికి కట్టటం వలన ఆరోగ్యం తొందరగా కుదుటపడుతుందట . ఏడు గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇతరులతో సామాజిక సంబందాలు బాగుంటాయి. దంపతుల మధ్య అభిప్రాయబేదాలు ఉన్నవారు 7 గోమతిచక్రాలను నదిలో విడిచిపెడితే వారి కాపురం చక్కబడుతుందట..

గోమతిచక్రాన్నిఎనిమిది గోమతిచక్రాలు అష్టలక్ష్మి స్వరూపంగా పూజిస్తారు. ఇవి ధరిస్తే అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయట.. తొమ్మిది గోమతిచక్రాలు ఇంటిలో ఉండటం వలన ఆద్యాత్మిక చింతన కలుగుతుందట.. పది గోమతిచక్రాలు కార్యాలయంలో ఉంచినట్లయితే.. వారికి గొప్ప గుర్తింపు లభిస్తుందట. పదకొండు గోమతిచక్రాలు లాభ లక్ష్మి స్వరూపంగా పూజిస్తారు.భవన నిర్మాణసమయంలో పునాదిలో పదకొండు గోమతిచక్రాలను ఉంచటం వలన ఎటువంటి వాస్తుదోషాలు, శల్యదోషాలు ఉండవట. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చూసేవారు 13 గోమతిచక్రాలను శివాలయంలో దానం చేస్తే మంచి ఫలితం ఉంటుందట..

27 గోమతిచక్రాలని వ్యాపార సముదాయాలలో ముఖ్య ద్వారానికి కట్టినట్లైతే వ్యాపారాభివృద్ధి కలుగుతుందట.. అలాగే జాతకచక్రంలో నాగదోషం, కాలసర్పదోషం ఉన్నవారు గోమతి చక్రాలకు పూజచేయటం గాని, దానం చేయటం గాని చేస్తే అనుకూల ఫలితాలు లభిస్తాయట..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR