కుజదోషం వల్ల కలిగే విపరీతాల నుంచి బయటపడేసే చండీదేవి పూజ

నవ గ్రహాల్లో అంగారక గ్రహాన్ని జ్యోతిషం ప్రకారం కుజుడుగా పేర్కొంటారు. ఈయనను మంగళుడు అని కూడా అంటారు. జాతకంలో కుజదోషం ఉంటే వివాహానికి ఆటంకాలు ఎదురవుతాయి. ఉష్ణ ప్రకృతి గల కుజుడిని పాప గ్రహంగా చెబుతారు. వివాహం, వైవాహిక జీవితంపై ప్రభావం అధికంగా ఉంటుంది. ఎరుపు, ఇనుములోని శక్తికి అధిపతి కుజుడు.. గ్రహ కూటమిలో ఈయన సైన్యాధ్యక్షుడు. అయితే, వినయంతో నమస్కరించే వారికి కోరికలు తీర్చే కల్పవృక్షం. మంగళవారం కుజుడి ఆరాధనకు అనుకూలమైంది. ఎరుపు మేనిఛాయ, శంఖంలాంటి మెడ, సుందరమైన పాదాలు, పొట్టేలు వాహనం, చేతిలో శులాయుధం కలిగిన కుజుడు నిజంగా మంగళకరుడే.

Kujadosham Poggote Chandidevi Pujaఅయితే కుజదోష నివారణకు ‘మంగళ చండీదేవి” ని పూజించాలి అని ‘బ్రహ్మవైవర్త పురాణం’ చెబుతోంది. కుజదోషం అనే మాట వినపడగానే ఎవరైనా సరే ఉలిక్కి పడుతుంటారు. అందుకు కారణం కుజ దోషం నుంచి బయటపడటం చాలా కష్టమనే విషయం ప్రచారంలో ఉండటమే. పెళ్లి కావలసిన అమ్మాయికి కుజదోషం వుందంటే ఇక ఆ తల్లిదండ్రులుపడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కుజదోష నివారణకుగాను వారు వెళ్లని ప్రదేశం గానీ, చేయని ప్రయత్నంగాని వుండవు.

Kujadosham Poggote Chandidevi Pujaఅయితే కుజదోషం వల్ల కలిగే విపరీతాల నుంచి బయటపడాలంటే ‘మంగళచండీ దేవి’ ని పూజించాలని ‘బ్రహ్మవైవర్త పురాణం’ చెబుతోంది. ఏ కుజగ్రహ దోషం వల్ల నానాఅవస్థలు పడుతున్నారో … ఏ కుజుడి అనుగ్రహం కోసం నానాప్రయత్నాలు చేస్తున్నారో ఆ కుజుడు పూజించే అమ్మవారే ‘మంగళచండీ దేవి’. కుజుడికి మంగళుడు అనే పేరు కూడా వుంది. మంగళవారం రోజున మంగళుడు పూజించిన కారణంగా ఆ తల్లి మంగళ చండీగా ప్రసిద్ధి చెందింది. మంగళుడి ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల ఆయన కూడా తొందరగా అనుగ్రహిస్తాడు. ఇక మంగళుడే కాదు … సాక్షాత్తు పరమశివుడు కూడా ఆమెను ఆరాధించాడు.

Kujadosham Poggote Chandidevi Pujaమంగళవారం రోజున ఉపవాస దీక్ష చేపట్టి, మంగళ చండీని పూజించవలసి వుంటుంది. ఈ విధంగా చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం వెంటనే లభిస్తుంది. సమస్త దోషాలు తొలగిపోయి, శుభాలు చేకూరతాయి. కాబట్టి కుజదోషం వున్నవారు అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల, సత్వరమే సత్ఫలితాలను సాధించి సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు.

శ్రీ మంగళ చండికా స్తోత్రం :

Kujadosham Poggote Chandidevi Pujaధ్యానం : దేవి శోడష వర్మియామ్ సుస్త్ర యవ్వనామ్ బింబోక భీమ్ సుదతీమ్ సుద్దామ్ శరత్ పద్మ నిభాననామ్. శ్వేత సంపక వర్ణామ్ సునీ లోత్భల లోసనామ్ జగతాత్రీమ్ సదాత్రీమ్ చ సర్వేభ్యః సర్వ సంపదామ్. సంసార సాగరే కావే జ్యోతి రూపాం సదాభజే దేవాస్య చ ద్యాన మిత్యవమ్ స్థవానమ్ సృయతామునే.

శ్రీ మహాదేవ ఉవాచ:

Kujadosham Poggote Chandidevi Pujaరక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే. హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే. మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే సతాం మంగళతె దేవీం సర్వేషామ్ మంగళాలయే పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్ మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్ ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR