Home Unknown facts కుమారస్వామి శూలాన్ని పొందిన ఆలయం, మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది?

కుమారస్వామి శూలాన్ని పొందిన ఆలయం, మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది?

0

తమిళనాడు రాష్ట్రంలో కుమారస్వామిని ఎక్కువగా ఆలయాలు ఉంటాయి. దేవతల పరిరక్షణ కోసం అవతరించిన దేవసైనాధ్యక్షుడై అసురులను సంహరించడం వలన తమిళనాడులో త్రిమూర్తుల కంటే ఎక్కువగా ఈ స్వామిని ఆరాధిస్తారు. అయితే తమిళనాడులో ఈ స్వామివెలసిన ఆరు క్షేత్రాలు ఆరు అంశలకు సంకేతంగా చెప్పబడే ఆలయాలు అతిముఖ్యమైనవి. అందులో ఒక ఆలయం ఉన్న ప్రదేశంలోనే కుమారస్వామి శూలాన్ని పొందని పురాణం. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ స్థలపురాణం ఏంటి? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Kumaraswamy Temple

తమిళనాడు రాష్ట్రం, ట్యుటికోరన్ జిల్లా, తిరుచ్చెందురు లోని సముద్రపు అంచనా శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఉంది. ఇది సుబ్రహ్మణ్యస్వామి ఆరు అంశాలలో రెండవ అంశకు సంబంధించిన ఆలయం. అతి పురాతనమైన ఈ ఆలయం ఒక ఎత్తైన కొండపైన ఉంటుంది. ఈ ఆలయ గర్భగృహం అనేది ఒక గుహలో ఉంటుంది.

ఇక పురాణానికి వస్తే, పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధపెడుతుంటే, ఆ బాధలను భరించలేక దేవతలందరు కూడా వెళ్లి శివుడిని ప్రార్ధించగా ఆ రాక్షసుడిని సంహరించే బాధ్యతని శివుడు కుమారస్వామికి అప్పగిస్తాడు. ఆ సమయంలో కుమారస్వామి గొప్ప తపస్సు చేయగా అతని తల్లి పార్వతీదేవి ఆదిశక్తి రూపంలో ప్రత్యేక్షమై తన శక్తిని అంత కలిపి ఒక శూలాన్ని కుమారస్వామికి ప్రసాదిస్తుంది. ఆ తరువాత మిగిలిన అందరు దేవతలు కూడా వారి అంశలకు సంబంధించిన శక్తిని ఆ శూలంలో నింపారట. ఇలా కుమారస్వామి తారకాసురునితో యుద్ధం చేసి అతడిని సంహారించిన ప్రదేశం ఇదేనని పురాణం.

ఇలా ఆ రాక్షసుడిని సంహరించిన తరువాత అతని తమ్ముడు పారిపోతూ ఒక దగ్గర మామిడి చెట్టు వలె మారిపోయాడట. అప్పుడు కుమారస్వామి తన శూలంతో ఆ చెట్టుని రెండుగా చీల్చి అతడిని కూడా సంహరించాడట. అప్పుడు ఆ చెట్టులో నుండి ఒక భాగం నెమలిగాను, మరొక భాగం కోడి రూపం దాల్చగా, కుమారస్వామి ఆ రెండిటిని వాహనాలుగా స్వీకరించాడు. ఇలా ఆ స్వామి ఆయుధమే ఇక్కడ అయన గుర్తుగా పూజలను అందుకుంటుంది.

Exit mobile version