లక్ష్మీ దేవి ఎవరినైనా అనుగ్రహించే ముందు కనిపించే సంకేతాలు ఏంటో తెలుసా ?

లక్ష్మీ దేవి అంటే ధనం … ధనవంతులు కావాలని ప్రతిఒక్కరు కళలు కంటూ ఉంటారు.. లక్ష్మి కొలువై ఉన్న ఇల్లు సిరి సంపదలతో తులతూగుతుంది.. కటిక దారిద్య్రంలో ఉన్నవాళ్లు సైతం లక్ష్మి అనుగ్రహంతో ఐశ్వర్యవంతులవుతారు.. అయితే లక్ష్మీ దేవి ఎవరినైనా అనుగ్రహించే ముందే ఆమె రాకకు సంబందించిన కొన్ని సంకేతాలు మనకి కనిపిస్తాయట.. మరి అవేంటో మనం ఇప్పుడు తెల్సుకుందాం..

Lakshmi Deviప్రతి మనిషి జీవితానికి, జీవనానికి డబ్బు చాలా అవసరం.. ధనం మూలం ఇదం జగత్ అనే సామెత ఉండనే ఉంది.. మరి ధనానికి అధిపతి ఐన లక్ష్మి దేవి కరుణిస్తే కాలం కలిసివస్తుంది అనే చెప్పాలి.. ఇలా లక్ష్మి దేవి కరుణకి పాత్రులయ్యే వారు అమ్మవారి అనుగ్రహాన్ని ముందే గ్రహించవచ్చట.. అలాంటి సంకేతాలతో కోయిల కూత ఒకటి.. కుహు కుహు అనే కోయిల పాట వినటానికి చాలా బావుంటుంది.. కోయిల చేసే ఈ శబ్ధం ధనానికి శుభ సూచికగా చెబుతారు. కోయిల కూసే దిశ ఆధారంగా కూడా శుభాశుభాలు నిర్ణయిస్తారు. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుంచి వినిపించినట్లయితే నష్టం జరుగుతుందని విశ్వాసం. అదే సాయంత్రం పూట ఏ దిక్కునుండి వినిపించినా అది శుభ సూచికమే.. మధ్యాహ్నం పూట కోయిల కూత కూడా శుభంగా భావిస్తారు. ఏదైన పనిమీద బయటికి వెళ్తున్నపుడు కోయిల కూసినట్లైతే అంత శుభమే జరుగుతుందట.. ఇక మామిడి చెట్టు మీద కూర్చోని కోయిల కూస్తే మాత్రం అది ఖచ్చితంగా లక్ష్మీ దేవి రాకకి సంకేతమట.

Koyilaఅలాగే బల్లి పాటు కూడా లక్ష్మి దేవి రాకని సూచిస్తుంది.. చాలామంది బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు.. అయితే బల్లి పాటు వల్ల కలిగే శుభ సూచకాలు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి.. త్వరత్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ ఎదుగుదలకి సూచిస్తుంది.. త్వరలో ఏదోక మార్గంలో మీరు డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవచ్చట… అందుకే బల్లిని సంపదకు చిహ్నంగా చెప్తుంటారు కొంతమంది..

lizardఇక చాలామంది ఇళ్లలో చీమలు బారులు తీరి కనిపిస్తుంటాయి.. లా ఇంట్లో చీమలు ఉంటే చాలా మంచిదట.. ఇలా ఇంట్లో నల్ల చీమలు ఉంటే మాత్రం శుభ సూచకగా భావించవచ్చట… నోటిలో బియ్యం ధాన్యాలు మోస్తున్న చీమలను శుభ చిహ్నంగా చెప్తారు.. ఎందుకంటే అక్షితలు మహాలక్ష్మీకి ఎంతో ప్రియమైనవిగ చెప్తారు.. ఇలా కనుక చీమలు మీ ఇంట్లో కనిపిస్తే మీరిక ధనవంతులు కాబోతున్నారన్నమాట..

Antsపాములు కూడా లక్ష్మి దేవి ఆగమనాన్ని సూచిస్తాయంటారు.. పాములు శుభసూచకమని చాలామందికి తెలియదు.. మీరు ఎప్పుడైనా రెండు ముఖాల పామును చూసినట్లయితే, ఇది చాలా శుభసూచన.. ఆలా రెండు తలల పాము ఎక్కడైనా ఉందని తెల్సిన వెళ్లి చూసినా మంచి జరుగుతుందట.. ఈ పాము రాక లక్ష్మీ ఆగమనానికి సంకేతంగా భావించాలట.

Snakeఇంతే కాదు లక్ష్మి దేవి మనల్ని కరుణించి మన ఇంటికి వచ్చే ముందు మన ఇంటిలో పరిస్థితి మొత్తం మారిపోతుంది.. అప్పటివరకు గొడవలు పడ్డ వారి ఆలోచనలు ఆలోచనలు, వ్యవహారాల్లో సయితం మార్పులు వచ్చి వారు అందరితోనూ కలివిడిగా ఉంటారట.. ఆ ఆనందం వెల్లివిరుస్తుంది.. ఇంట్లో భార్యభర్తల మధ్య అన్యోన్యం పెరుగుతుందట..

Lakshmi deviఇలా ఎవరికైనా జరిగితే ఖచ్చితంగా దాని అర్థం లక్ష్మీ దేవి మిమ్మల్ని ఆశీర్వదించదానికి మీ ఇంటికి వస్తుందనే అనుకోవాలట..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,460,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR