వినాయకుడిని దొంగతనంగా తీసుకెళ్తే సంతానం కలుగుతుందంట

వినాయకుడికి సాధ్యం కానిది లేదు. వినాయకుడంటే అన్నీ. సమస్తం ఆయన ఆధీనంలోనే వుంటాయి. కోరితే ఆయన ఇవ్వలేనిదంటూ ఏదీ లేదని చెబుతారు. అందుకే సంతానం లేని వారు పుత్ర గణపతి వ్రతం చేస్తుంటారు. అయితే ఏదైనా మన నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. చేసే పూజలు, వ్రతాలు దేవుడి మీద నమ్మకం తో చేయాలి.

వినాయకుడిరాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు దేవగణాలు అందరూ కీర్తిస్తారు అక్కడికి వచ్చిన వారంతా పార్వతి దేవిని కూడా గొప్ప గా ప్రసంసిస్తున్నారు వినాయకుడిని పొగుడుతుంటే తల్లిగా ఆమె గర్వంతో పొంగిపోతుంది.. తల్లి అంతే కదా అది గమనించిన లక్ష్మీ దేవికి కూడా ఇలాంటి బిడ్డ నాకు కావలి అనే ఆశ కలిగింది. ఎవ్వరికైనా అది సహజమే కదా.. అదే కోరిక విష్ణు మూర్తిని అడిగింది. ఆ వినాయకుడే నాకు కొడుకుగా కావలి స్వామి అని వినాయకుడు పార్వతి ముద్దుల తనయుడు ఆ బిడ్డే కావాలి అని కోరుతోంది.

వినాయకుడిస్వామి ఆలోచించి నువ్వే వినాయకుడిని ప్రార్ధించు అని సలహా ఇస్తారు.. ఇంక లక్ష్మీ దేవి వెంటనే తపస్సు చేసి అయినా ఆ వినాయకుడిని కుమారుడిగా పొందాలి అని నిర్ణయించుకుని తపస్సు మొదలు పెడుతుంది తల్లి మనస్సు తపిస్తే అది ఆయనకు వినిపించడానికి ఎంత సేపు పరుగున వచ్చి ఆ తల్లి ముందు అమ్మ పిలిచారు అని నినయంగా నమస్కరించి నిల్చుంటాడు. అప్పుడు లక్ష్మీ దేవి ఈ పిలుపు నీ నుండి నాకు శాశ్వతంగా కావాలి నాయనా అని కోరుకుంటుంది..

వినాయకుడిఅంటే తల్లి అని అడుగుతూడు.. నిన్ను పుత్రుడిగా పొంది పార్వతీ దేవి ఎంతో పుణ్యం చేసుకుంది. నాకు నువ్వు కొడుకుగా కావాలి అన్న ఆశకలిగింది నాయనా అంటుంది.. అప్పుడు వినాయకుడు అది నాకు వరం తల్లి అలాగే కానివ్వు అంటాడు.. అంతే ఓప్పుకోవడమే తరువుగా వినాయకుడిని చంటి బిడ్డగా మార్చి చంకలో వేసుకుని వైకుంఠం తీసుకుని వెళ్ళిపోతుంది. పార్వతిదేవికి ఒక్కమాట కూడా చెప్పకుండా తీసుకొని వెళ్ళిపోయినందుకు ఒక విధంగా దొంగతనమే కదా ఇదంతా గమనిస్తున్న పార్వతీ పరమేశ్వరుల ఆమె ముచ్చట కి నవ్వుకుంటున్నారు.

వినాయకుడిఇంక వైకుంఠానికి తీసుకు వచ్చిన వినాయకుడికి పూర్ణనందుడు అని నామ కరణం చేస్తుంది లక్ష్మీ దేవి. పూర్ణం బూరెలు అక్కడే అలవాటు అయ్యింది స్వామికి అక్కడ ఏమో కుడుములు.. ఇలా పూర్ణానందుడుని లాలిస్తూ బుజ్జగిస్తూ ఆనందంగా మురిసపోతుంది ఆ తల్లి. ఇంతలో వినాయకుడు మళ్ళీ యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. దేవతలు కైలాసానికి వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు మీరు వైకుంఠానికి వెళ్లి అడగండి అని అక్కడికి పంపుతారు. అక్కడ విష్ణు మూర్తిని ప్రాధిస్తే లక్ష్మీ దేవిని అడగమని పిలుస్తారు.. ఆ తల్లి నా బిడ్డ పూర్ణానందుడు చాలా చిన్నవాడు యుద్ధాలు అప్పుడే చేయడు నేను పంపను అంటుంది.

వినాయకుడిఅక్కడే ఉన్న బుజ్జి గణపతి కూడా మా అమ్మ ఒప్పుకోక పోతే నేను రాను అని తల్లిబిడ్డలు లోపలికి వెళ్ళిపోతారు.. తర్వాత విష్ణుమూర్తి లక్ష్మీదేవి తో మన కొడుకుగా వెళ్లి రాక్షస సంహారం చేసి వస్తే అది మనకు ఎంత గర్వకారణం యుద్ధానికి పంపు అని ఒప్పిస్తాడు. సరే అని యుద్ధానికి పంపిస్తుంది, వినాయకుడు యుద్ధం చేసి వచ్చిన తర్వాత అందరూ వైకుంఠానికి వచ్చి పూర్ణనందుడిని ప్రశంసిస్తారు. తర్వాత వినాయకుడు లక్ష్మీ దేవితో వినయంగా తల్లి నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణనందుడిగా నీ ముందు ప్రత్యక్షం అవుతాను అని చెప్పి సెలవు తీసుకుని కైలాసం వెళ్ళిపోతాడు..

వినాయకుడిఅందుకే విష్ణు దేవాలయంలో విశ్వక్సేనుడి రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు.. శివాలయంలో, వినాయకుడి గుడిలో తులసి వాడరు. అందుకే సంతానం లేని స్త్రీ లు దంపతులు ఎవ్వరైనా వినాయకుడిని దొంగతనం గా తీసుకుని వెళ్లి సంతానం కోసం ఇలా తెచ్చాను అని క్షమాపణ కోరి రోజు పూజ చేస్తే ఆయన సంతోషంగా అనుగ్రహిస్తాడు అని నమ్మకం. సంతానం ఉండి కూడా మళ్లీ సంతానం కోరి దొంగతనంగా తీసుకుని రాకూడదు.. చవితి రోజు పూజించి నిమర్జన చేయాల్సిన విగ్రహం తీసుకుని రాకూడదు గుడిలో ఎక్కడా తీసుకుని రాకూడదు.. చాలా చిన్న పరిమాణంలో ఉండేది షాప్ లేక ఇంట్లో నో తీసుకుని రావాలి.. ఎక్కడ నుండి దొంగతనం చేస్తారో వారికి కూడా స్వామి అనుగ్రహం దక్కుతుంది.. నష్టం ఏమీ కలగదు అని నమ్ముతారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR