Home Unknown facts శ్రీవారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆదివారాహస్వామి ఆశ్రయం ఇచ్చిన పుణ్యస్థలం

శ్రీవారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆదివారాహస్వామి ఆశ్రయం ఇచ్చిన పుణ్యస్థలం

0

శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఆది వరాహస్వామి అవతారం మూడొవదిగా చెబుతారు. హిరణ్యాక్షుడు అనే రాక్షసుని నుండి భూదేవిని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తాడు. మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం రెండు ప్రాంతాల్లో ఆది వరాహస్వామి విగ్రహాలు దర్శనమిస్తాయి. అందులో ఒకటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండగా, రెండవది ఈ ఆలయం లో ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆది వరాహస్వామితెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లా, కమాన్ పూర్ లో శ్రీ ఆది వరాహస్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం. తిరుమల తిరుపతి లో మొదటి పూజ ఆది వరాహస్వామి అందుకుంటున్నాడు. కలియుగ ప్రారంభంలో శ్రీవారు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి భూమికి దిగి వచ్చినప్పుడు శ్రీ ఆదివారాహస్వామి ఆయనకి ఆశ్రయమిచ్చారని పురాణం కథనం. అందుకు ప్రతిగా తిరుమలను సందర్శించే భక్తులు తొలుత వరాహస్వామిని దర్శించాకే తనని దర్శిస్తారని వరాహస్వామికి వరమిచ్చాడు.

అయితే తిరుమలలో వరాహస్వామి ఆలయం తరువాత మళ్ళీ ఈ ప్రాంతంలో ఒక శిలపై ఆదివారాహస్వామి విగ్రహం వెలసింది. ఈ ప్రాంతంలో ఆది వరాహస్వామి నడిచి వచ్చిన పాదాల ఆనవాళ్లు కూడా ఈ పక్కనే ఉన్న మరో రాతి బండపై మనకి దర్శనమిస్తాయి. ఈయన వరాలు ఇచ్చే స్వామిగా భక్తులు పూజిస్తారు. ఈ స్వామివారి దర్శనం కోసం అనేక ప్రాంతాల నుండి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

అయితే పూర్వం ఒక భక్తుడు తాను కోరుకున్న కోరికలు తీరితే స్వామివారికి మందిరం నిర్మిస్తానని ఆది వరాహస్వామి సందర్శించి మొక్కుకోగా, ఆ భక్తునికి వరాలు ప్రసాదించి కోరిక నెరవేర్చాడు. తన కోరిక నెరవేరడంతో మొక్కిన ప్రకారం ఆ స్వామికి మందిరం నిర్మించడానికి పూనుకోగా ఆ భక్తుని కలలో స్వామివారు ప్రత్యేక్షమై నాకెలాంటి మందిరం గాని, గోపురం గాని నిర్మించవద్దని తానూ ఎల్లవేళలా పంచభూతాల మధ్యనే ఉంటానని చెప్పడంతో భక్తుడు మందిర నిర్మాణాన్ని విరమించుకున్నాడు.

ఈ విధంగా వెలసిన ఆది వరాహస్వామి ని దర్శిస్తే కోరిన కోరికలు తప్పకుండ నెరవేరుతాయని భక్తులలో ప్రగాఢ విశ్వాసం కలిగింది.

Exit mobile version