ఉదయం పాలు కాచే ముందు ఇవి పాటిస్తే లక్ష్మి కటాక్షానికి పాత్రులవుతారు!!

డబ్బు కావాలని ఎవరికి మాత్రం ఉండదు. లక్ష్మీ కటాక్షం కోసం ఎదురుచూసేవాళ్లు ఎంతో మంది ఉంటారు. కూటి కోసం కోటి విద్యలు అన్న చందంగా సంపద కోసం కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఎంత ప్రయత్నించినా.. ఎంత కష్టపడినా అనుకున్న విధంగా సంపద సమకూరదు. ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో శ్రీ మహాలక్ష్మీని ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం లక్ష్మి కటాక్షం కోసం కొన్ని పూజలు చేయాలి. ఫలితంగా లక్ష్మీ దేవి కటాక్షం పొంది సంపద, సంతోషాలు అందుబాటులోకి వస్తాయి. మరి లక్ష్మీ కటాక్షం పొందడం కోసం ఎలాంటి పరిష్కార మార్గాలు ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం…

money makingడబ్బు సంపాదించటానికి మనిషి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు. నిజానికి లక్ష్మి కటాక్షం అంటే డబ్బు ఎక్కువగా ఉండటం మాత్రమే కాదు. మనిషికి డబ్బు ఎంత అవసరమో ఆ డబ్బుని ధర్మ,న్యాయ మార్గంలో సంపాదించటం కూడా అంతే ముఖ్యం.

లేదంటే మనిషికి మనశాంతి కరువు అవుతుంది.
డబ్బును కష్టపడి సంపాదిస్తే కలిగే తృప్తి వేరు.
అంత కస్టపడి సంపాదించిన డబ్బు నిలవకపోతే చాలా సమస్యలు ఎదురు అవుతాయి. ఆ సమస్యల బయట పడాలంటే లక్ష్మి దేవి కృప మన మీద పుష్కలంగా ఉండాలి.

lakshmi moneyలక్ష్మి కటాక్షం ఆడవారి ప్రవర్తన వల్ల సిద్ధిస్తుంది అంటే నిజమే అని చెప్పవచ్చు. స్త్రీలు ఇంటిని శుభ్రం గా ఉంచటం, ఎప్పుడు లక్ష్మి దేవిలా ప్రసన్నంగా కనిపించడం ఇలాంటి వాటి వల్ల ఇంటికి ఎంతో మంచి జరుగుతుంది. ప్రతి రోజు ఉదయం పాలు కాయటంతోనే ఆడవారు రోజుని ప్రారంభం చేస్తారు. అయితే పాలు కాచే సమయంలో ఈ ఒక్క పని చేస్తే సంపాదించిన డబ్బు నిలుస్తుంది.

cow and krishnaలక్ష్మి దేవి పాల సముద్రం నుండి ఉద్భవించటం వల్ల లక్ష్మి దేవికి పాలు అంటే చాలా ఇష్టం. అంతేకాక పాలు ఆవు నుండి రావటం వల్ల లక్ష్మి స్వరూపంగా భావిస్తాం.
అందువల్ల పొద్దున్నే పాలు కాచే ముందు, పొయ్యిని శుభ్రపరచి, పొయ్యి కింద తడిక్లాత్ తో శుభ్రం చేసి ముగ్గు వెయ్యాలి. ఆ తరవాత పొయ్యికి కుంకుమ బొట్టు పెట్టాలి.

boiling milkఅగ్ని దేవునికి నమస్కరించి, ఆ తర్వాత పాలు కాయాలి. ఒకవేళ పాలు పొంగితే అందులో 2 బియ్యపు గింజలను వేయాలి. కాచిన పాలు చల్లారడానికి మూత మాత్రం తీయకూడదు. ఎందుకంటే ఇంటిలో డబ్బు కూడా ఆవిరిలా ఆవిరి అయిపోతుంది . పాలు కాచే ముందు ఈ నియమాలు పాటిస్తే అంతా మంచి జరిగి, లక్ష్మీదేవి కటాక్షం కలిగి, ఆర్ధిక బాధల నుంచి బయట పడవచ్చు. అంతేకాకుండా ఇంటిలో ఎప్పుడు సంతోషం,ప్రశాంతత ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR