దేశంలో ఉన్న అతిపెద్ద చర్చిలు ఎక్కడ ఉన్నాయి?

0
1555

భారతదేశంలో సుమారుగా రెండువేల సంవత్సరాల క్రితం నుండి క్రైస్తవ మతం ఉన్నట్లుగా చెబుతారు. అయితే క్రీస్తు శిష్యులలో ఒకరైన సెయింట్‌ థామస్‌ ఒకటవ శతాబ్దంలో భారతదేశానికి వచ్చి క్రైస్తవ మత ప్రచారం చేసారు. అయితే ముందుగా కేరళ, గోవా లో ఎక్కువమంది క్రైస్తవ మతాన్ని స్వీకరించారని చెబుతారు. ఇక 15 వ శతాబ్దం తరువాత దేశంలో దాదాపుగా అన్ని ప్రాంతాలలో క్రైస్తవ మతం వ్యాపించింది. ఇలా అధిక సంఖ్యలో ప్రజలు క్రైస్తవ మతాన్ని స్వీకరించిన తరువాత వారు ప్రార్థన చేసుకోవడానికి క్రైస్తవులు చర్చీలని నిర్మించారు. మరి దేశంలో ఉన్న అతిపెద్ద చర్చిలు ఎక్కడ ఉన్నాయి? వాటిని ఎవరు నిర్మించారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. మెదక్ కేథడ్రిల్ చర్చి:

Largest Churches In Our Country

అతి పెద్ద చర్చి వాటికన్ కాగా ఆసియా ఖండంలో రెండవ అతిపెద్ద చర్చి కేథడ్రిల్ చర్చి. దీనిని రెండవ వాటికన్ గా పిలుస్తారు. తెలంగాణ రాష్ట్రం, మెదక్ లో ఉన్న ఈ చర్చి కి దేశ విదేశాల నుండి వస్తారు. 1910 లో ఈ చర్చి నిర్మాణం మొదలవ్వగా 1924 లో పూర్తయింది. ఈ చర్చి అంతర్భాగం రోమ్ నిర్మాణ శైలిలో ఉంటుంది. ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉన్న ఈ చర్చికి క్రిస్మస్ సమయంలో కొన్ని లక్షల మంది ఇక్కడికి వస్తారు.

2. బాసిలికా చర్చి:

Largest Churches In Our Country

గోవాలోని పనాజీ దగ్గరలో బాసిలికా చర్చి ఉంది. ఇక్కడ గోవాలో సుప్రసిద్ధ క్రైస్తవ మత గురువు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి ఉంది. అయితే క్రీ.శ. 1695లో ఈ చర్చిని నిర్మించినట్లుగా చెబుతారు. బామ్ జీసస్ అంటే మంచి లేదా బాల ఏసు అని అర్థం. ఇక్కడ ప్రతి పది సంవత్సరాలకి ఒకసారి క్రైస్తవ మత గురువు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ దేహాన్ని భహిరంగ ప్రదర్శన చేస్తుంటారు. ఈ సమయంలో ఇక్కడికి కొన్ని లక్షల మంది వస్తుంటారు.

3. సెయింట్‌ ఫ్రాన్సిస్‌ చర్చి:

Largest Churches In Our Country

కేరళ రాష్ట్రంలో కొచ్చిన్ లో సెయింట్‌ ఫ్రాన్సిస్‌ చర్చి ఉంది. ఇది 16 శతాబ్దంలో నిర్మించినట్లుగా చెబుతారు. ఇక్కడ వాస్కోడిగామా మరణించిన తరువాత అయన మృత దేహాన్ని ముందుగా ఇక్కడ ఉంచి ఆ తరువాత పోర్చుగల్ తరలించారంటా.

4. వల్లర్‌పదం చర్చి:

Largest Churches In Our Countryకేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ లోనే వల్లర్‌పదం చర్చి ఉంది. ఇక్కడే మేరిమాత కొలువై ఉన్నట్లుగా చెబుతారు. అందుకే దేశంలో ఉన్న ప్రముఖ చర్చిలలో ఇది కూడా ఒకటిగా చెబుతారు.

5. సెయింట్‌ థామస్‌ బాసిలికా- చెన్నై:

Largest Churches In Our Country

భారతదేశంలో బ్రిటిష్ వారు మొట్టమొదట గా నిర్మించినది ఇదేనని చెబుతారు. ఇది చెన్నై లోని సముద్రానికి ఎదురుగా ఉంటుంది. అయితే 2006 లో ఈ చర్చిని జాతీయ ప్రార్థన మందిరంగా గుర్తించారు.