ఆవిరి పట్టేటప్పుడు ఈ ఆకును వేయండి! ఈ ఆకును వేయడం వాళ్ళ త్వరగా ఉపశమనం వస్తుంది

వర్షాలు పడుతుంటే అందరూ ఎదుర్కునే సమస్యలు జలుబు, దగ్గు వాటివల్ల వచ్చే జ్వరాలు. వాతావరణం మారినపుడు జలుబు రాకుండా వైద్య శాస్త్రంలో ఇప్పటివరకూ మందు కనుగొనలేదు. నిజానికి జలుబుకి ఎటువంటి మందులు అవసరం లేదు.. కొన్ని రోజులు ఇబ్బంది పెట్టి అదే తగ్గుతుంది.. అయితే ప్రస్తుతం కరోనా సమయం కనుక ఏది సీజనల్ వ్యాధి.. ఏది కరోనా అనేది తెలియక బయపడిపోతున్నారు.

1-Mana-Aarogyam-797అలాంటప్పుడు జలుబు చేస్తే భయం కలగడం, దాన్ని తక్షణమే తగ్గించే ప్రయత్నాలు చేయడంస్వాభావికమే. అందులోనూ జలుబు చేస్తే ఆ మహమ్మారి ప్రశాంతంగా పడుకోనీదు, కూర్చోనీదు, నిలబడనీదు, పని చేసుకోనీదు. కనుక తక్షణ ఉపశమనం కోసం ప్రయత్నిస్తాం. జలుబు నుంచి ఉపశమనం పొందడం కోసం ఎన్నో మాత్రలు వేసుకుంటూ ఉన్నప్పటికీ ఎలాంటి ఫలితం ఉండదు. ఇలాంటి సమయంలోనే జలుబును వివిధ రకాల పద్ధతుల ద్వారా తగ్గించుకోవచ్చు.

జలుబు నుంచి సత్వరం నివారణ ఇచ్చేది ఆవిరి పట్టడం అయితే ఎక్కువమంది పసుపు, విక్స్ వేసుకుని ఆవిరి పడతారు.. కానీ దీనికంటే జలుబు నుంచి మంచి రిలీఫ్ ని ఇచ్చేది పుదీనా ఆవిరి అంటున్నారు ఆరోగ్య నిపుణలు. ముఖ్యంగా జలుబుతో బాధపడేవారు పుదీనా ఆకులతో ఆవిరి పట్టుకుంటే తొందరగా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

5-Mana-Aarogyam-797పుదీన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉండడం చేత పుదీనా ఆకును లేదా పుదీనా నూనెను ఎన్నో రకాల సమస్యలను నివారించడానికి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే జలుబు గొంతు నొప్పి సమస్యతో బాధపడేవారు తొందరగా ఉపశమనం పొందాలంటే పుదీనా ఆకులతో ఆవిరి పట్టుకుంటే చాలు తొందరగా జలుబు నుంచి బయటపడొచ్చు.

ఎన్నో ఔషధ గుణాలు దాగిఉన్న పుదీనా ఆకులను మరుగుతున్న వేడి నీటిలో వేసి ఆవిరి పట్టడం ద్వారా జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ వేడి ఆవిరిని నోటితో పీల్చి ముక్కుతో వదిలేయాలి. ఇలా చేయడం వల్ల ముక్కు, నోరు, గొంతు శుభ్రపడతాయి. గాలి పీల్చడానికి ఇబ్బంది ఉండదు. ఇక పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రకరకాల అలర్జీలనూ, ఆస్తమాను నివరిస్తుంది.

4-Mana-Aarogyam-797ఇలా పుదీనాతో ఆవిరి పట్టడంతో పాటు.. ఆరోజు రాత్రి కేవలం పాలు, విటమిన్ సీ, సిట్రిక్ యాసిడ్ ఉన్న పండ్లను తీసుకుని.. ఘన పదార్ధాలకు దూరంగా ఉంటె మర్నాడు ఉదయానికి జలుబు నుంచి పూర్తిగా ఉపశమనం పొందుతారు. ఈ పుదీనా ఆవిరిని ముక్కుతో పిలిచి నోటితో వదలడం వల్ల జలుబు సమస్యతోపాటు గొంతు ఇన్ఫెక్షన్ నుంచి కూడా తొందరగా ఉపశమనం కల్పిస్తుంది.

పుదీనాలో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీల నుంచి పుదీనా విముక్తిని కల్పిస్తుంది.అలాగే గొంతు ఇన్ఫెక్షన్ జలుబు సమస్యతో బాధపడేవారు పుదీనా టీ చేసుకొని తాగడం వల్ల తొందరగా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

2-Mana-Aarogyam-797

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR