కరోనా సోకిన వారు వాక్సిన్ తీసుకునే విషయంలో ఈ అపోహలు వదలండి

ప్రపంచాన్ని ముప్పు తిప్పలు పెట్టిన కరోనా వైరస్ పై పోరాటంలో బ్రహ్మాస్త్రం వ్యాక్సిన్ ఒక్కటే. అందుకే ఇప్పుడు అందరికీ వ్యాక్సిన్ ఇవ్వడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. వీలైనంత వరకూ కోవిడ్ వ్యాక్సిన్ అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. ఒక పక్క కరోనా కఠినమైన రెండో వేవ్ పై పోరాటం చేస్తూనే మరో వైపు వ్యాక్సినేషన్ కూడా జరుపుతూ వస్తున్నారు.వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల చెడు ప్రభావాలు ఏమైనా ఉంటాయేమో అన్న అనుమానం చాలామందిలో కనిపిస్తోంది. అయితే అలాంటి ప్రభావాలు ఏమీ ఉండవని వ్యాక్సీన్ ని తీసుకోవడం వల్ల కరోనా ముప్పు నుంచి తప్పించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.

వాక్సిన్క‌రోనాను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు టీకా త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. మొద‌టి డోస్ తీసుకున్న నిర్ణీత వ్య‌వ‌ధిలో బూస్ట‌ర్‌ డోసు కూడా వేయించుకోవాలి. అప్పుడే క‌రోనాను ఎదుర్కొనేందుకు కావాల్సిన సామ‌ర్థ్యం వృద్ధి చెందుతుంది. కరోనా వైరస్ కోసం రెండు డోసుల్లో ఈ వ్యాక్సీన్ తీసుకోవడం వల్ల కేవలం కొవిడ్ 19 నుంచి మాత్రమే కాదు.. మరిన్ని ప్రాణాంతకమైన వైరస్ ల నుంచి కూడా మనకు రక్షణ కలుగుతుందని కాబట్టి దీన్ని తీసుకోవడానికి అస్సలు వెనుకాడవద్దని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇక్క‌డిదాకా బాగానే ఉంది. అయితే ఇప్పటికే కరోనా వచ్చి దానికి చికిత్స తీసుకున్న వారు వ్యాక్సీన్ తీసుకోవాలా? వద్దా? అన్నది పెద్ద ప్రశ్న. దీనితో పాటు మన దేశంలో కొన్ని లక్షల మందికి కరోనా సోకినా వారి రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉండడం వల్ల లక్షణాలేవీ లేకుండానే కరోనా తగ్గిపోయినట్లు ఎన్నో అధ్యయనాలు కూడా వెల్లడించాయి.

వాక్సిన్ఇలాంటి వారు వ్యాక్సీన్ తీసుకుంటే వారిలో తిరిగి యాంటీ బాడీలు తయారవుతాయా? అన్నది మరో ప్రశ్న. ఒకవేళ క‌రోనా బారిన ప‌డి కోలుకున్న వారు వ్యాక్సిన్ తీసుకోవాలంటే ఎలా? వాళ్లు కూడా రెండో డోసులు తీసుకోవాలా? ఒక్క డోస్ స‌రిపోదా? ఈ విష‌య‌మై అధ్య‌య‌నం చేసిన వైద్య నిపుణులు.. క‌రోనా నుంచి కోలుకున్న వారికి సింగిల్ డోస్ స‌రిపోతుంద‌ని వెల్ల‌డించారు.ఒక డోసుతోనే వీరు కరోనా తో పాటు మిగిలిన ఆరోగ్య సమస్యలను తట్టుకునేందుకు రోగ నిరోధక శక్తిని సంపాదించుకుంటారని వివిధ పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే ఓ వ్యక్తికి నిజంగా వైరస్ సోకి వారికి కరోనా వచ్చినప్పుడు వారి రోగ నిరోధక శక్తి వ్యవహరించే తీరు వ్యాక్సీన్ వేసినప్పుడు వారి శరీరం వ్యవహరించే తీరు విభిన్నంగా ఉంటాయట. వారికి కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే వారిలో ఎక్కువ యాంటీ బాడీలు తయారయ్యి అవి కొన్ని నెలల వరకూ యాక్టివ్ గా ఉంటాయి.

వాక్సిన్కానీ ఒకవేళ వారికి లక్షణాలు చాలా స్వల్పంగా లేదా అసలు లేకపోవడం వల్ల యాంటీ బాడీలు కూడా చాలా తక్కువగా విడుదలవుతాయి. ఇవి కొన్ని వారాల సమయంలోనే తగ్గిపోతాయి. అదే వ్యాక్సీన్ ఇవ్వడం వల్ల శరీరంలో యాంటీ బాడీలు చాలా ఎక్కువ మోతాదులో తయారవుతాయి. కానీ శరీరంలో వైరస్ యాక్టివ్ గా లేకపోవడం వల్ల అవి అలాగే ఉండిపోతాయి. ఇది కరోనా సోకకుండా కాపాడుతుంది. ఒకవేళ కరోనా వైరస్ శరీరంలోకి అడుగుపెడితే వెంటనే ఈ యాంటీ బాడీలు దాన్ని నాశనం చేసేస్తాయి.

వాక్సిన్కాబట్టి క‌రోనా నుంచి కోలుకున్న వారు ఒక్క డోస్ కచ్చితంగా వేసుకోవాలి. క‌రోనా బారిన ప‌డి కోలుకున్న నెల రోజుల త‌ర్వాత టీకా తీసుకోవ‌చ్చు. క‌రోనా సోకని వారితో పోలిస్తే, గ‌తంలో కొవిడ్‌ సోకిన వారిలో యాంటీబాడీలు మూడింత‌లు ఎక్కువ‌గా వృద్ధి చెందిన‌ట్లు త‌మ అధ్య‌య‌నంలో గ‌మ‌నించిన‌ట్లు పేర్కొన్నారు. ఒక్క డోస్‌తోనే మెమొరీ టీ సెల్స్ గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లు తెలిపారు. కాబ‌ట్టి వీరికి వ్యాక్సిన్ రెండో డోస్ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. ఇక ఇప్పుడు టీకా తీసుకున్నవారు సైతం మాకేం కాదులే అనే ధీమాతొ ఉండవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం టీకాలు తీసుకున్న తర్వాత కూడా కోవిడ్ సంక్రమణకు గురయ్యే అవకాశం ఉంది. అయితే కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సాధారణ సంకేతాల నుండి టీకా తీసుకున్నవారిలో కనిపించే లక్షణాలు భిన్నంగా ఉండవచ్చని వారు చెబుతున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,570,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR