Home Unknown facts Lingam Paina thoka gurthulu kanipinche valishwaraswami aalayam visheshalu

Lingam Paina thoka gurthulu kanipinche valishwaraswami aalayam visheshalu

0

శివుడు వెలసిన ఈ ఆలయం లో శివలింగం కొంచం ఉత్తరం వైపు ఏటవాలుగా ఉంటుంది. అంతేకాకుండా లింగం పైన తోక గుర్తులు అనేవి కనిపిస్తాయి. మరి లింగం పైన ఆలా ఉండటం వెనుక పురాణం ఏంటి? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.Valishwaraswami

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లాలో ఈ ఆలయం ఉంది. ఇక్కడ రాముడు బ్రహ్మహత్యాపాతకం పోవడానికి శివలింగాన్ని ప్రతిష్టించాడని స్థల పురాణం చెబుతుంది. ఇక ఇక్కడ ఆలయం ఏర్పడటానికి, లింగం అలా ఉండటం వెనుక ఒక కథ వెలుగులో ఉంది.

రావణ సంహారంతో రామునినికి బ్రహ్మహత్యాదోషం తగులుతుంది. ఈ దోష పరిహారానికై కాశీ నుండి శివలింగాన్ని తెప్పించాలని కులగురువు వశిష్టుడు సూచించాడు. అప్పుడు రాముడు ఆంజనేయుని పిలిచి కాశీ నుండి శివలింగాన్ని తీసుకొనిరమ్మని పురమాయిస్తాడు. ఆంజనేయుడు శివలింగానికై కాశీకి వెడతాడు. ఆంజనేయుడు తన తిరుగు ప్రయాణంలో రామగిరి చేరుకొంటాడు అప్పుడు ఈ ప్రాంతాన్నికాళింగమధుకరై, తిరుక్కారికరై అని పిలిచేవారు. అక్కడ కాలభైరవస్వామి వాసం చేస్తుంటాడు. కాలభైరవుడు ఆంజనేయుడు శివలింగాన్ని తీసుకొని రావడం చూసి, ఆ లింగం తన ప్రాంతంలో ప్రతిష్ఠ కావాలని ఆశిస్తాడు. తన ఆశ ఫలించడానికి భైరవుడు సూర్యుని, వాయుదేవుని సహకరించమని కోరుతాడు.

సూర్యుడు ఎండ వేడిమిని పెంచగా, వాయుదేవుడు బలమైన వేడిగాలి వీచేలా చేస్తాడు. వాటితో ఆంజనేయునికి దాహం వేస్తుంది. పైగా చెమట పడుతుంది, స్నానం చేయాలని అనిపిస్తుంది. క్రింద చూస్తే పశువుల కాపరి బాలుడి వేషంలో ఉన్న కాలభైరవుడు కనిపిస్తాడు. ఆంజనేయుడు క్రిందికి దిగివచ్చి ఆ ప్రాంతంలో నీటివనరు ఉన్నదా అని ప్రశ్నిస్తాడు, భైరవుడు గంగను ప్రార్థించి సమీపంలో ఒక కొలను ఏర్పడేలా చేస్తాడు. అతడు ఆంజనేయునికి ఆ కొలను చూపించగా అతడు తన చేతిలోని శివలింగాన్ని కాస్సేపు ఉంచుకోమని కోరి దాహం తీర్చుకోవడానికి తీర్థానికి వెడతాడు. భైరవుడు వెంటనే లింగాన్ని నేలపై ఉంచి వెళ్ళిపోతాడు.

ఆంజనేయుడు నీరుత్రాగి తిరిగి వచ్చేసరికి బాలుడు ఉందడు. లింగం నేలపై కూరుకుపోయి ఉంటుంది. అతడు దానిని పైకి ఎత్తడానికి ఎంతో ప్రయత్నిస్తాడు. అయితే వీలుకాదు. తనతోకను లింగం చుట్టూ కట్టి పైకెత్తడానికి కూడా ప్రయత్నిస్తాడు. అదికూడా ఫలితం ఇవ్వలేదు. గత్యంతరం లేకుండా ఆంజనేయుడు మరొక శివలింగం తీసుకొని రావడానికి కాశీకి ప్రయాణం కడతాడు. అప్పుడు వాతావరణ చల్లగా ఉంటుంది. వేడి గాలి స్థానే చల్లని గాలి వీస్తుంది. ఇదేదో చమత్కారమని ఆంజనేయుడు భావిస్తాడు. అతనికి కొఫం వస్తుంది. ఆ కొలను కారణంగా ఇలా జరిగిందని తలచి ఆంజనేయుడు ఆ కొలను ఒక కొండగా మారాలని శపిస్తాడు. శాప ఫలితంగా కొలను కొండ రూపం దాల్చుతుంది.

ఈ కొండపై ఇప్పుడు కార్తికేయుని గుడి ఉన్నది. ఆంజనేయుడు తెచ్చిన శివలింగం కొండ అడుగు భాగంలో ప్రతిష్ఠితమై ఉన్నది. అప్పటి నుండి రాముని కోసం ఆ లింగం వచ్చింది కాబట్టి ఈ ప్రాంతాన్ని రామగిరి అని, తోకతో లింగాన్ని ఎత్తడానికి ప్రయత్నించిన ఆంజనేయుని వాలీశ్వరుడని పిలువసాగారని ఐతిహ్యం. ఇప్పటికీ లింగం ఉత్తరం వైపుగా కొంత ఏటవాలుగా ఉన్నది. లింగం పై తోక గుర్తు కూడా ఉన్నది. రామగిరి వాలీశ్వరుని సందర్శించేవారు తొలుత భైరవేశ్వరుని సందర్శిస్తారు. ఇక్కడ శివరాత్రి సందర్భంగా విశేష పూజలు జరుగుతాయి.

Exit mobile version