గుంటూరు జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయాలు

గుంటూరు జిల్లాలో కొన్ని పురాతన ఆలయాలు అనేవి ఉన్నవి. ఇక్కడ వెలసిన ఈ ప్రాచీన ఆలయాలలో ఎన్నో మహిమలు, విశేషాలు అనేవి దాగి ఉన్నాయి. అయితే ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఆ ఆలయాలు ఏంటి? ఆ ఆలయంలో ఉండే ప్రత్యేకతలు ఏంటి? అక్కడ కొలువై ఉన్న ఆ స్వామివారు, అమ్మవారు ఎవరనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

అమరేశ్వర ఆలయం:

guntur alayaluu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలో కృష్ణానదీ తీరాన గల అమరావతి గ్రామము నందు అమరేశ్వరుని ఆలయం కలదు. ఈ ఆలయములో శివలింగం చాలా పొడవుగా ఉంటుంది. దీనికి ప్రాచుర్యంలో ఉన్న కథనం ప్రకారం ఈ శివలింగం అనేది పెరుగుతూ ఉండేదంటా. అందువలన గుడిని ఎప్పటికప్పుడు గుడిని పెంచవలసి వస్తుండేది. చివరకు విసుగు చెందిన అర్చకులలో ఒకరు స్వామిపై ఒక మేకు కొట్టారు. అప్పటినుండి శివలింగం ఎదుగుదల అనేది ఆగిపోయింది. ఈ కథనానికి నిదర్శనంగా తెల్లని శివలింగం పై ఎర్రని చారికలను కూడా చూపిస్తారు. అవి మేకు కొట్టినప్పుడు కారిన నెత్తుటి చారికలని చెప్పుతారు. ప్రస్తుతం పై అంతస్తులోని శివలింగ భాగాన్ని మాత్రమే భక్తులు దర్శించుకోవటానికి అనుమతిస్తున్నారు. శ్రీ కృష్ణదేవరాయలు ఈ ఆలయములో తులాభారం తూగి తన బరువుతో సరి సమానమైన బంగారాన్ని పేదలకి పంచిపెట్టారని శాసనం లో ఉంది. ఈ ఆలయంలోని 16 అడుగుల స్పటిక లింగాన్ని దర్శించడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు. పరమశివుడు యొక్క 5 పుణ్యక్షేత్రాలను పంచారామాలు అని అంటారు.  అందులో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు.

చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం:

guntur alayaluu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, గుంటూరు జిల్లా, చేబ్రోలు గ్రామం నందు కోనేటిలో చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వరాలయం కలదు. శివుడి శాపకారణంగా బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండటానికి వీలు లేదు. అపుడు వారు శాస్రాలను తిరగేసి బ్రహ్మతో కలిపి శివుడిని ఒకేమూర్తిగా ప్రతిష్ఠిస్తే ఎలాంటి దోషం ఉండదని చెప్పగా, అలా నిర్మితమైనదే ఈ ఆలయం. బ్రహ్మదేవుడు కమలగర్భుడు కనుక ఒక కమలంలో ఓ సృష్టికర్త నాలుగు ముఖాలు ఉండి పైన శివలింగాకృతి వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఆ మూర్తిని కోనేరులో ప్రతిష్టించారు. పురాణాల ప్రకారం బ్రహ్మకు అర్హతలేదు కనుక పరోక్షంగా ఈశ్వరునికి అభిషేకం చేసి అది బ్రహ్మకు చెందేలా రూపొందించబడటం ఈ ఆలయం ప్రత్యేకత.

పానకాల నరసింహస్వామి ఆలయం:

guntur alayaluu

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలో, మంగళగిరి లో శ్రీ పానకాల నరసింహస్వామి ఆలయం ఉన్నది. ఈ గుడిలోని నారాయణునకు పానకం అంటే చాలా ప్రీతి. సరాసరి తన నోటిలో పానకం లో సగం పాలు ఈ స్వామి ప్రసాద చిహ్నంగా భక్తులకి అనుగ్రహిస్తుంటారు. అంతేకాకుండా స్వామి వారు తాగుతున్నప్పుడు “గుట గుట” శబ్దం కూడా వినిపిస్తుంది. ఈ శబ్దం అనేది ఆగితే పానకం వెలికి చిమ్ముతుంది. ఇది ఏదో ఎప్పుడో ఒకసారి జరగటం కాదు ఇక్కడకి వచ్చి పానకం సమర్పించిన ప్రతి భక్తుడికి జరుగుతూనే ఉంటుంది. కృతయుగంలో అమృతం తాగిన విష్ణువు త్రేతాయుగంలో ఆవునేతిని, ద్వాపరయుగంలో ఆవు పాలను తాగి సంతోషించి, ఇప్పుడు కలియుగం నందు భక్తులు సమర్పించే బెల్లం పానకమును తాగుతూ సంతృప్తి చెందుతున్నాడు.

 శ్రీ భావన్నారాయణస్వామి ఆలయం:

guntur alayaluuఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, బాపట్లలో శ్రీ భావన్నారాయణస్వామి ఆలయం ఉంది. అతి ప్రాచీనమైన వైష్ణవ ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయాన్ని సుమారుగా 1400 సంవత్సరాల క్రితం చోళరాజుల నిర్మించినట్లుగా తెలియుచున్నది. ఇక శివుడికి పంచ క్షేత్రాలు ఉన్నట్లుగానే, శ్రీమహావిష్ణువుకు కూడా పంచ భావన్నారాయణ క్షేత్రాలు ఉన్నవి. అందులో బాపట్ల ఆలయం ప్రధానమైనదని చెబుతారు. క్రీ.శ. 594 లో క్రిమి కంఠ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఈ గ్రామంలో ఎనిమిది దిక్కుల్లో వల్లాలమ్మ, కుంచలమ్మ, శంకరమ్మ, శింగరమ్మ, ధనకొండలమ్మ, మూలకారమ్మ, నాగభూషణమ్మ, బొబ్బలమ్మ అనే ఎనిమిది మంది గ్రామ శక్తులను ఎనిమిది దిక్కుల్లో ప్రతిష్టించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వేసవిలో జరిగే బ్రహ్మోత్సవాలకి లక్షల సంఖ్యల్లో భక్తులు వస్తుంటారు. ఇంకా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారా దర్శనం ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతుంది.

నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం : 

guntur alayaluuఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, గుంటూరు జిల్లా, దుర్గి మండలం, అడిగొప్పుల గ్రామంలో నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం ఉన్నది. పేరులో శ్రీ లక్ష్మి అని ఉన్నా,  ఈమెను పార్వతి దేవి అంశగా భావిస్తారు. అయితే శాపానికి గురైన పార్వతి దేవి సుమారు 700 ఏళ్ల క్రిందట గుంటూరుజిల్లా, పల్నాడు ప్రాంతంలోని యాగంటిరామయ్య ఇంట్లో జన్మించిందని చెబుతారు. ఆమెకు శ్రీ లక్ష్మి అని పేరు పెట్టారు. అయితే శాపం కారణంగా చిన్నవయసులోనే పెళ్ళికి ముందే ఆమె కొన్నాళ్లకు గర్భవతి అయింది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు ఆమెని వారి ఇంటివారిని చాల అవమానించారు. దానితో కోపానికి గురైన ఆమె అన్నయ్యలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెకి నిప్పు పెట్టారు. అప్పుడు ఆ అగ్నిలోకి గోశాలలో ఉన్నా కామధేనువు కూడా వచ్చి అగ్నిలోకి దూకి ఆహుతి అయ్యింది. అలా మంటలకు ఆహుతి అయినా శ్రీ లక్ష్మి శిలగా మారిపోయింది. తరువాత ఆమె ఒక 11 ఏళ్ల బాలికను పూని ఆదివారం నన్ను అగ్నికి ఆహుతి చేసారు కనుక ప్రతి ఆదివారం పసుపు, కుంకుమలతో నాకు పూజలు చేయాలి, నన్ను దర్శించుకునే వాళ్ళు అందరు కూడా ఎండలోనే నిలబడాలి, నాకు ఆలయాన్ని నిర్మించవద్దు అని చెప్పిందంటా. ఈవిధంగా శాపానికి గురైన పార్వతిదేవి శ్రీ లక్ష్మి అమ్మవారిగా వెలసి భక్తులకి దర్శనం ఇస్తున్నారు.

అమరలింగేశ్వర ఆలయం: 

guntur alayaluuఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, పిడుగురాళ్ళకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న గుత్తికొండలో దైద అమరలింగేశ్వరుడు కొలువై ఉన్నాడు. ఈ కొండగుహనే గుత్తికొండ బిలం అంటారు. ఇది అంతా కూడా చుట్టూ పర్వతశ్రేణి, మధ్యలో బిల సముదాయం. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన బిలం. ఈ బిలం యొక్క ప్రధాన ద్వారం అడుగుపెడపెట్టి లోపలి వెళుతుండగా చీకటి మల్లయ్య పూజలందుకుంటూ కనిపిస్తాడు. ఇక ఇక్కడ ఉన్న ప్రధాన బిలం నుండి లోపలి వెళితే 101 బిలాలు ఉన్నాయని చెబుతారు. ఇలా ఇంకా కొంచం ముందుకు వెళితే అక్కడ గరళం సేవించే శివుడి విగ్రహాం ఉందని చెబుతారు. ఇక్కడ ఉన్న సొరంగ మార్గం లో దాదాపుగా 400 మీటర్లు ప్రయాణం చేసి శివలింగాన్ని చూడాల్సి ఉంటుంది. ఇలా వెలసిన ఆ స్వామిని దర్శనం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది.

దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయం:

guntur alayaluu

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, నంబూరు సమీపంలో దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంది. తిరుమల తిరుపతి లో వేంకటేశ్వరస్వామి ఏకరూపంలో దర్శనమిస్తే ఈ ఆలయంలో ఒకే విగ్రహంలో స్వామివారు దశావతారాలలో దర్శనం ఇస్తున్నారు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం 11 అడుగులు ఉండగా పీఠంతో కలిపి మొత్తం 12 అడుగులు ఉంటుంది. దశావతార రూపంలో ఉండే ఈ 11 అడుగుల అద్భుత విగ్రహం కాళ్ళ నుండి నడుము వరకు వరాహ, మత్స్య, కూర్మ అవతారలలో ఉండగా మిగిలిన ఏడు అవతారాలు కూడా స్వామివారి విగ్రహంలో చాలా అందంగా భక్తులకి దర్శనమిస్తాయి. ఇలా వేంకటేశ్వరస్వామి విగ్రహం దశావతారాలలో దర్శనమిచ్చే ఏకైక ఆలయం, మొట్టమొదటి ఆలయం ఇదే అవడం విశేషం.

 శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం: 

guntur alayaluuఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లా, సత్తెనపల్లి కి కొంత దూరంలో ఉన్న మల్లాది గ్రామంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయం ఉంది. ఈ ఆలయంలోని స్వామివారు మర్రిచెట్టులో వెలిశాడని ఎంతో మహిమగల వాడని చెబుతారు. తిరుమల నుండి వచ్చిన ఆ శ్రీనివాసుడు ఇక్కడ ఉన్న మర్రిచెట్టు పైన వెలిశాడని స్థల పురాణం చెబుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR