Looking For An Accha Telugu Instagram Page? Then Your Search Will End Here

“తెలుగు వీర లేవరా… దీక్షబూని సాగరా…” నిజానికి ఈ సాహిత్యం దేశ సేవ గురించి ఉద్దేశ్యించి రాయబడింది. కానీ, నేను దీన్ని మరో ఉద్దేశ్యంతో ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. అదేంటంటే, ‘తెలుగు వీర లేవరా’ అనే Instagram account గురించి చెప్పడం. అయితే తెలుగు వాడిని తట్టి లేపడం కూడా దీనిలో దాగి ఉన్న పరమార్థం. దీనిలో తెలుగు భాష, తెలుగు వారు, తెలుగు సాహిత్యం అంటూ అంతా ‘తెలుగు’ వెలుగులు గురించే, తెలుగు నుడికారంలోనే పోస్ట్‌లు పెడతారు. మీరు చూడాలి అసలు, ‘అమ్మ’భాష తెలుగులో ఉన్న కమ్మదనం మరింత కనిపిస్తుంది, ఈ ‘తెలుగు వీర లేవరా’ తెలుగు మీద ప్రేమను అలా స్ఫురింపజేస్తుంది. ఇక ఇది నడిపేది ఒక్కడే…. మహాభారతాన్ని తెలుగులో అనువదించిన కవిత్రయంలో మూడవ వాడు, మిక్కిలి భాగం తర్జుమా చేసిన ఎర్రన పుట్టిన ప్రకాశం జిల్లాలోని మేదరమెట్ల గ్రామానికి చెందిన 23 నిఖాసైన అచ్చతెలుగు కుర్రాడంటే నమ్ముతారా! అతడే ‘ఈమని అనంతశేష సాయి.’ చెప్పే విషయానికి సరిగ్గా సరిపోయే సినిమా memes వాడుతూనే పోస్ట్‌లు పెట్టడం ఇందులో ప్రధాన ఆకర్షణ. సరే మరి, ఇక page యొక్క తెలుగు content కి మచ్చుతునకగా ఉన్న కొన్ని పోస్ట్‌లు చూద్దామా…!

1) అసలు ఇది ఎందుకు ప్రారంభమయ్యింది?

2) తెలుగు మాస్టారు, తరగతి గుర్తొచ్చిన వేళ…

3) సరదా వాక్యాల వెనుక నిగూఢమైన నిజం!

4) తల్లి బాధపడితే మంచిది కాదు బిడ్డ…

5) తెలుగోడి పౌరుషం భాష నుండే మొదలు..!

6) శ్లేషాలంకారంలోని చమక్కులు…

7) వయసు కాదట… పైసలు అట…

8) తెలుగు భాష మాత్రమే కాదు – మన గౌరవం కూడా!

9) మెదడుకు మేత – తెలుగు సామెత మిత్రమా…

10) సామెత అర్థం తెలియాలి సుమా – లేకపోతే అనర్థం!

11) పద్యాలు అర్థమవ్వాలేగానీ, మహాగొప్పగుంటాయి

12) సినిమా పాట శ్రోతలకు మరింత చేరువయ్యేలా…

13) చిన్నప్పటి చందమామ, బాలమిత్ర గుర్తొచ్చే…

14) ఊరు వాడ దాటే…

లాంటివి ఎన్నో ఇంకెన్నో ఉన్నాయి. తెలుగు భాషాభిమానులు, ఆసక్తి ఉన్నవారు ‘తెలుగు వీర లేవరా’ చూడొచ్చు…

“జై శ్రామికుడా”

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR