బ్రహ్మ దేవుని హృదయస్థానం నుండి జన్మించినవాడు భృగు మహర్షి. ఈయనని నవ బ్రహ్మలలో ఒకరిగా చెబుతారు. సప్తఋషులలో ఒకరైన భృగు మహర్షి మొట్టమొదటి జ్యోతిష్య రచయిత. మరి భృగు మహర్షి భార్య ఎవరు? ఈ మహర్షి అగ్ని దేవుడిని ఎందుకు శపించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దక్ష ప్రజాపతి అల్లుడు భృగు మహర్షి. దక్షునిని కుమార్తె పేరు ఖ్యాతి. భృగు మహర్షి, ఖ్యాతిని వివాహం చేసుకోగా వీరికి ధాత, విధాత అనే ఇద్దరు కుమారులు. అయితే భృగు మహర్షి మరొక భార్య పేరు పులోమ. వీరికి శుక్రుడు, చ్యవనుడు అనే ఇద్దరు కుమారులు. వీరిలో చ్యవనుడి కుమారుడు ఋచిక, ఋచిక కుమారుడు జమదగ్ని కాగా జమదగ్ని కుమారుడు పరశురాముడు.
ఇది ఇలా ఉంటె, ఒకరోజు భృగు మహర్షి గర్బవతైన తన భార్య పులోమతో నేను నది స్నానానికి వెళుతున్నాను, నీవు నితయాగ్నిహోత్రానికి కావాల్సినవి చూడు అని చెప్పి వెళ్లగా అప్పుడు పూలమా అగ్ని గుండం వెలిగించి తన పనులు చేసుకుంటుండగా ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఒక రాక్షసుడు ఆమెని కామించి అగ్ని దేవుడిని ఆమె ఎవరు అని ప్రశ్నించగా, ఇప్పుడు ఆ రాక్షసుడికి నిజం చెబితే గర్బవతైన ఆమెకి హాని కలుగుతుంది, అబద్దం చెబితే నాకు అసత్య దోషం అంటుకుంటుందని అలోచించి చివరికి నిజమే చెప్పాలని నిర్ణయించుకొని ఆమె భృగు మహర్షి భార్య అని ఆ రాక్షసుడితో అగ్ని దేవుడు చెబుతాడు.
ఇక ఆమెని కామించిన ఆ రాక్షసుడు తన భుజాలపైన వేసుకొని ఎత్తుకొని వెళుతుండగా ఆమె ఒక మగ పిల్లాడికి జన్మనిస్తుంది. ఆ కుమారుడి పేరే చ్యవన. అయితే శక్తివంతమైన చ్యవనుడు ఆ రాక్షసుడిని కోపంగా చూడగా ఆ మంటలలో ఆ రాక్షసుడు కాలిపోతాడు. ఆ తరువాత పులోమ తన కొడుకుని తీసుకుని తిరిగి ఆశ్రమానికి వెలికి భృగు మాహర్షికి జరిగిన విషయాన్ని చెప్పగా, ని గురించి రాక్షసుడుకి చెప్పినదని ఎవరు అని కోపంగా అడుగగా ఆమె అగ్నిదేవుడ్ని చెబుతుంది. అప్పుడు అగ్నిదేవుడు నేను అబద్దం చెబితే నాకు పాపం చుట్టుకుంటుంది ఆ రాక్షసుడితో నిజం చెప్పానని చెప్పగా దానికి ఆగ్రహించిన భృగు మహర్షి నీవు ఇప్పటినుండి సర్వభక్షకుడివి అవుదుగాక అని శపిస్తాడు. ఇలా శాపానికి గురైన అగ్ని దేవుడు దేవతలకి హవిస్సులు తీసుకెళ్లలేను అని తన మంటలను ఆర్పివేస్తాడు. అప్పుడు హోమాలు, హవిస్సులు లేకపోవడంతో బ్రహ్మ దేవుడు అగ్ని దగ్గరికి వచ్చి, నీవు శాపానికి గురై సర్వభక్షకుడివి అయ్యావు కానీ ని పవిత్రత పోలేదు కనుక నీవు ఎప్పటిలానే దేవతలకు హవిస్సులు అందించవచ్చు ఏమియు కాదని చెబుతాడు.
ఈవిధంగా ఒక రాక్షసుడి కారణంగా భృగుమహర్షి శాపానికి అగ్ని దేవుడు గురయ్యాడని చెబుతారు.