Home Unknown facts అలనాటి కృష్ణుడి జ్ఞాపకాలను గుర్తు చేసే శ్రీకృష్ణుడి ఆలయాలు…!

అలనాటి కృష్ణుడి జ్ఞాపకాలను గుర్తు చేసే శ్రీకృష్ణుడి ఆలయాలు…!

0
హిందూ మతం ప్రపంచంలో వేల సంవత్సరాల క్రితం పుట్టిన ఒక పురాతన మతం. క్రైస్తవ మతం మరియు ఇస్లాం మతం తర్వాత మూడవ అతి పెద్ద మతం ఇది. క్రీస్తు పూర్వం నుండి భారతదేశంలో హిందూ మతం ఉంది. చరిత్రలోకి వెళితే వేదాలు, ఉపనిషత్తులు వంటి అమూల్యమైన సంపదల నుండి హిందూ మతం మనుగడలోకి వచ్చిందని సారాంశం. భారతదేశంలో ఎంతో మంది రాజులు హిందూ మతాన్ని స్వీకరించారు. ముక్కోటి దేవతల ఆరాధన జరుగుతుంది. ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.
ఆ ఆలయాలలో శ్రీకృష్ణుని ఆలయాలకు ప్రత్యేక స్థానం ఉంది. మధురలో చెరసాలలో దేవికి వసుదేవులకు పుట్టి రేపల్లెలో యశోద దగ్గర పెరిగి కన్నయ్యగా అందరి చేత కొలువబడుతున్న విష్ణుమూర్తి దశావతారాలలో తొమ్మిదవ అవతారమే శ్రీకృష్ణ అవతారం.
lord krishna
విష్ణు భగవానుడు దుష్ట శక్తుల సంహారనార్థం దశావతారాలు ఎత్తడనే విషయం మనకు తెలిసినదే.
ఈ క్రమంలోనే శ్రీకృష్ణ అవతారంలో విష్ణుదేవుడు కలియుగంలో దర్శనమిచ్చారు. ఈ క్రమంలోనే శ్రీకృష్ణుడికి పవిత్రమైన ఆలయాలను నిర్మించి భక్తులు పెద్దఎత్తున పూజా కార్యక్రమాలను నిర్వహించేవారు.
ఇప్పటికీ మన దేశంలో కొన్ని శ్రీకృష్ణుడి ఆలయాలు  భక్తులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. మన దేశంలో ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ ఆలయాలు ఎక్కడ ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.
  • ద్వారకాదీశ ఆలయం:

గుజరాత్ పశ్చిమ తీరంలో ఉన్న ద్వారక పవిత్ర పుణ్యస్థలంగా భావించబడుతుంది. ఈ ఆలయ మండపంలో మూడు పెద్ద ఉయ్యాలలు మనకు దర్శనమిస్తాయి. ఇందులో మధ్యలో ఉన్నది బంగారు ఉయ్యాల కాగా మరో రెండు వెండి ఉయ్యాలలు ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో శయ్యా వేడుకలు జరుపుతారు.
  • బృందావన్ ఆలయం:

శ్రీకృష్ణుడు చిన్నతనమంతా బృందావనంలోనే ఆటలాడాడని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో సుందరమైన ఈ ప్రదేశాన్ని సందర్శించిన అక్బర్ ఇలాంటి ఆలయాలను మరికొన్ని నిర్మించాలని ఆదేశించాడు. ఈ క్రమంలోనే మధురలో ఉన్నటువంటి బృందావనం ఎంతో ప్రసిద్ధి చెందింది.
  • జగన్నాథ ఆలయం:

మన దేశంలో ఎంతో ప్రసిద్ది చెందిన శ్రీకృష్ణ ఆలయాలలో జగన్నాథ్ ఆలయం ఒకటి. అహ్మదాబాద్‌ నగరంలోని జమల్‌పూర్ అనే ప్రాంతంలో వెలసి వున్న ఈ ఆలయం ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కృష్ణుడు, విష్ణువు ఆశీర్వాదం పొందాలనుకునే భక్తులు పెద్ద ఎత్తున ఈ జగన్నాథ ఆలయానికి చేరుకుంటారు.

Exit mobile version