శ్రీ వేంకటేశ్వరస్వామి, తొండమాన్ చక్రవర్తి, కుమ్మరి భీముని కథేంటో తెలుసా?

తిరుమల తిరుపతి కలియుగ వైకుంఠం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఆ వెంకన్న స్వామి. ఈ స్వామిని ఏడుకొండలవాడని, గోవింధుడని, బాలాజీ అని, తిరుమలప్ప అని, వెంకటరమణుడని, మలయప్ప అని ఇలా ఎన్నో పేర్లతో ఆప్యాయంగా పిలుచుకుంటారు. మరి శ్రీ వేంకటేశ్వరస్వామి, తొండమాన్ చక్రవర్తి, కుమ్మరి భీముని కథ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

bhimuni kathaశ్రీ వేంకటేశ్వరస్వామి భక్తుడు తొండమానుడు. స్వామివారి ఆజ్ఞతో తిరుమల మందిర నిర్మాణం చేసిన ధన్యజీవి. మహాభక్తుడైన తొండమానవుడు నిత్యం స్వామివారితో సంభాషణలు చేసేవాడు. అయితే ఒకరోజు ఆకాశవాణి, స్వామివారి ప్రతి కైంకర్యం శ్రద్దగా ని చేతులమీదుగా చేపిస్తునావు ఎంతటి పుణ్యం చేసుకున్నావు, ని అంతటి భక్తుడు లేడయ్య అని పలకడంతో ఆ మాటలు విన్న తొండమానుడు అవును నేను బంగారు తులసీదళాలతో పూజ చేస్తున్నాను, ఆకాశవాణి మాటలు నిజమే కదా అని స్వామివారికి నాలాంటి భక్తుడు చాలా అరుదు అని గర్వంతో అనుకున్నాడు. తనలాంటి భక్తుడు లేదు అనే గర్వంతో ఉన్న తొండమానుడుకి తగిన గుణపాఠం చెప్పాలని భావించారు స్వామివారు. అయితే రోజులాగే ఒకరోజు ఉదయం తొండమానుడు స్వామివారి దర్శనానికి రాగ స్వామివారి పాదాల దగ్గర మట్టితో చేసిన తులసి దళాలు కనిపించగా, వేసిన తలుపులు వేసినట్టే ఉన్నవి, నేను స్వామివారిని స్వర్ణకమలాలతో తప్ప వేరే వాటితో పూజించను కదా అని భావించి, స్వామివారిని ప్రార్ధించి ఏంటి ఇదని అడుగగా, అప్పుడు వేంకటేశ్వరస్వామి చిరునవ్వుతో, ఇక్కడికి దగ్గరలోనే భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉన్నాడు. అతడికి నేను అంటే ఎనలేని భక్తి, ఎప్పుడు నన్ను ధ్యానిస్తునే ఉంటాడు. ఆ మహాభక్తుడు ప్రతి రోజు ఉదయం నాకు తులసీదళాలు సమర్పిస్తాడు. అక్కడ అతడు వేసిన దళాలే నీకు ఇక్కడ కనిపిస్తున్నాయని చెప్పడంతో, అంతటి మహాభక్తుడు ఎవరు నన్ను మించిన భక్తుడా అని వెంటనే అతడిని చూడటానికి తొండమానుడు బయలుదేరాడు.

bhimuni kathaఇలా వెళ్లి భీముడిని కలసిన తొండమానుడు, మీరు ఎవరు ఏం చేస్తుంటారు? మీరు అంటే స్వామివారికి ఎందుకు అంత ఇష్టమని అడుగగా, అప్పుడు భీముడు, నేను ఒక కుమ్మరిని, కుండ చేసేముందు స్వామి కుండలు చేసుకునే శక్తిని నాకిచ్చావు, నన్ను అనుగ్రహించవు, ని దయవలన కొన్ని డబ్బులు వచ్చి నా సంసారం నడుస్తుంది. అందుకు కృతజ్ఞతగా ఒక కొయ్యతో శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని చేసి రోజు స్వామివారి పాదాల దగ్గర మట్టితో చేసిన తులసిదళం పెడుతున్నాను. ఏ పని చేసిన స్వామివారిని స్మరిస్తూ నేను ఏమి చేయడంలేదు నీవే నాతో అన్ని చేయిస్తున్నావు స్వామి అని ఆరాధిస్తూ ఉంటానని చెప్పాడట. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారే అక్కడ ప్రత్యేక్షమవ్వగా భీముడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అప్పుడు భీముడు స్వామివారితో అయ్యో నేను ఒక గుడిసెలు నివసించేవాడిని నీకు ఏదైనా పెడదామంటే ఈ పేదవాడి ఇంట్లో మంచి వంటకాలు ఏమి లేవని చింతిస్తుండగా, స్వామివారు నాకు తినడానికి ఎలాంటి కమ్మటి వంటకాలు లేకున్నా పర్వాలేదు, నీవు తింటున్నదే నాకు పెట్టు చాలు అనడంతో, భీముడి భార్య తామాలి మట్టి పాత్రలో అన్నంపెట్టి భయభక్తులతో ఆరగించు స్వామి అని అడుగగా  ఆ దంపతుల మీద ఉన్న ప్రేమతో స్వామివారు దానిని ఆరగించారు. అప్పుడు ఆ దంపతులు వారి జన్మధన్యమైందని స్వామివారి పాదాలమీద పడి స్పష్టంగానమస్కారం చేసారు. స్వామివారి దివ్యపాదస్పర్శతో ఆ దంపతులు దివ్య శరీరాన్ని ధరించారు. ఇక స్వామివారి ఆజ్ఞతో ఆ దంపతులు ఇద్దరు వైకుంఠానికి వెళ్లారు.

bhimuni kathaఇక ఇదంతా తన కళ్ళతో చూసిన తొండమానుడు తనలో ఉన్న అహంకారపూరిత భక్తిని విడిచి పశ్చత్తాపపడ్డాడు. ఈవిధంగా ఆనాడు స్వామివారు సామాన్య భక్తుడికి ఇచ్చిన ఆతిధ్యానికి గుర్తుగా ఇప్పటికీ స్వామివారి ఆనంద నిలయంలో మొదటి గడప దాటి పెట్టే నైవేద్యం ప్రతి రోజూ ఒక కొత్త కుండ చేసి అందులోనే పెరుగు అన్నం పెడతారు. తిరుమల శ్రీవారికి ఎన్ని ప్రసాదాలు నివేదన జరిగిన అవన్నీ కూడా కులశేఖర పడి గడపకి ఇవతలే ఉంచుతారు. కానీ సగం పగలకొట్టిన మట్టి పెంకులోని నైవేద్యం మాత్రమే ఆనందనిలయం లోపాలకి తీసుకు వెల్లబడుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR