గోదావరి నదిని అపవిత్రం అయిపొమ్మని శివుడు ఎందుకు శపించాడు?

శివపార్వతులది నిజమైన ప్రేమగా హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. శివుడు తన శరీరంలో అర్థభాగాన్ని పార్వతికి ఇచ్చి అర్థనారీశ్వరుడు అయ్యాడు. అంతేకాదు దక్షయఙ్ఞంలో ఆహుతైన సతీదేవి కోసం శివుడు ఎంతగా పరితపించిపోయాడో తెలిసిందే. మరణించిన సతి దేహాన్ని భుజాలపై వేసుకుని తిరిగాడు. శివుడిని ఈ ఘటన నుంచి బయటపడేయడానికి శ్రీమహావిష్ణువు తన చక్రంతో సతి శరీరాన్ని ఖండించాడు…

lord shiva carrying satiఈ శరీర భాగాలే అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి. ఇంతటి ప్రేమ ఉంది కనుకనే పార్వతి దేవికి నీళ్లు ఇవ్వని కారణంగా గోదావరి నదిని అపవిత్రం అయిపొమ్మని శపిస్తాడు … అలాంటి పరిస్థితులు రావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం…

Arthanarishvaraపరమేశ్వరుడికి పుణ్యభూమి అయిన కాశీ మహా పుణ్యక్షేత్రం అంటే ఎంతో ఇష్టమని ఆధ్యాత్మిక పండితులు చెబుతుంటారు. కానీ ఆ పరమశివుడికి కాశీ కన్నా ఎంతో ఇష్టమైన ప్రదేశం మరొకటి ఉందని పురాణాలు చెబుతున్నాయి.

varanasi kashiశివుడు ఎంతగానో ఇష్టపడిన ఆ ప్రాంతంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. కాశీ కన్నా పరమేశ్వరుడు ఎక్కువగా ఇష్టపడిన ప్రాంతం ఏది? ఆ ప్రాంత విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

ఒడిస్సా రాష్ట్రంలో బిందుసాగరం అని ఒక కొలను ఉంది.
ఈ ప్రదేశం అంటే పరమశివుడికి ఎంతో ఇష్టం. ఇక్కడ ఉన్నటువంటి ఆలయంలోని కోనేటిలో ప్రతి సంవత్సరం పూరి జగన్నాథ్ విగ్రహాన్ని తీసుకోవచ్చి బిందుసాగరం అనే కొలనులో స్నానం చేయిస్తారు.

పురాణాల ప్రకారం ఈ ప్రదేశం అంటే పరమశివుడికి ఎంతో ఇష్టం అని తెలుసుకున్న పార్వతి దేవి ఆ ప్రాంతాన్ని చూడాలని ఎంతో ఇష్టపడి ఒక గోపిక రూపంలో ఆ ప్రాంతానికి చేరుకుంటుంది.

Bindusagaramగోపిక రూపంలో ఉన్న పార్వతీదేవిని చూడగానే కృత్తి, వాస అనే ఇద్దరు రాక్షసులు ఆమెను మోహించారట. అప్పుడు ఆ రాక్షసులను చూసిన పార్వతీదేవి తనను వారి భుజాల మీద మోసుకెళ్ళమని వారితో చెబుతుంది. ఈ సమయంలోనే వారు పార్వతీదేవి భుజాలపై తీసుకు వెళ్తున్న సమయంలో వారిని అణచి వేస్తుంది.

parvati in warఈ విధంగా రాక్షసులతో పార్వతీదేవి పోరాటం చేయటం వల్ల ఆమెకు ఎంతో దాహం వేస్తుంది. ఈ క్రమంలోనే పార్వతి దేవి దాహాన్ని తీర్చాలని పరమశివుడు ప్రతి నదిని, సరస్సులను ఒక్కొక్క బిందువు రాల్చమని ఆజ్ఞాపించాడు.

godavari riverఆ సమయంలో అన్ని సరస్సులు, నదులు నీటి బిందువులను రాల్చగా కేవలం గోదావరి నది మాత్రం నీటి బిందువులను ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన పరమశివుడు గోదావరి నదిను శపించాడు. ఈ విధంగా పరమేశ్వరుని శాపం వల్ల గోదావరి నది నీళ్లన్నీ ఎంతో అపవిత్రంగా మారుతాయి.

ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న గోదావరి నది శివుడిని పశ్చాత్తాపంతో పూజించి శాపం నుంచి విముక్తి చేయాలని కోరగా పరమేశ్వరుడు గోదావరి నదికి శాప విముక్తి కలిగించాడని స్థల పురాణాలు చెబుతున్నాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR