These 10 Poetic Love Songs Of Anant Sriram Show What A Class Act He Is

0
815

ప్రతి తెలుగు సినిమాలో కచ్చితంగా ఒక ప్రేమ పాట ఉంటుంది, ఎందరో అద్భుతమైన రచయతలు ఎన్నో ఎన్నో మధురమైన ప్రేమ పాటలని మనకి అందించారు. కానీ ఈ కాలంలో ప్రేమ పాటలు రాయడంలో అందరికంటే నేర్పరి అనంత్ శ్రీరామ్. చకోరి అని ప్రియురాలిని సంబోధించిన ఏమిటి హడావిడి యెదల్లోన అని మనలని గిలిగింతలు పెట్టిన అది అనంత్ శ్రీరాంకే చెందింది. మన ప్రేమ కవి సిరా రాల్చిన కొన్ని ప్రేమ కావ్యాలని గుర్తుచేసుకుందామా?

1) ఏమిటి హడావిడి యెదల్లోన – ఊహలు గుసగుసలాడే

ఈ హుషారులో రివర్స్ గేర్ ఏసినా ముందుకే…
ఈ మజాలలో అథెర్స్ ఛీ కొట్టిన లైట్లే…
ఇదే ఇదే రొమాన్స్ పద్ధతి…

2) మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన – కుమారి 21F

మాటలోనా లేదుగా ముద్దు చెప్పే నిజం
చూపులోనా లేదుగా స్పర్శ చెప్పే నిజం
సైగలోనా లేదుగా గిల్లిచేప్పే నిజం
నవ్వుకన్నా నాకిలా నీ పంటి గాటే నిజం
కిందమీద పడి రాసుకున్న పది కాగితాల కవిత
ఎంతకైన అది ఆనదంట ఒక కౌగిలింత ఎదుట
ఓ.. మన మధ్య దారంకైన దారి ఎందుకంటా

3) ఏమి టేమి టేమిటో – అర్జున్ రెడ్డి

నీ రాకతో నా రాతలో
ఒక్క రోజులోనే ఎన్నెన్ని మారాయలా

ఆ నింగినే నా లేఖగా మార్చుకున్న చాలదేమో
అవన్నీ నే రాయాలంటే

4) ఏదో ఏదో ఉంది గుండె లోతుల్లో – ఇష్క్

అడుగడుగున నిన్ను కంటున్నా
అణువణువున నిన్ను వింటున్నా
క్షణమునకొక జన్మ చూస్తున్నా
చివరకి నేనే నువ్వు అవుతున్నా
ఎందుకో… ఈ తీరుగా మారటం
ఏమిటో… అన్నింటికీ కారణం
బదులు తెలిసుంది ప్రశ్న అడిగేందుకే!

5) తాను-నేను.. మొయిలు-మిన్ను – సాహసం శ్వాసగా సాగిపో

దారి నేను.. తీరం తాను..
దారం నేను.. హారం తాను..
దాహం నేను.. నీరం తాను..
కావ్యం నేను.. సారం తాను..

నేను-తాను.. రెప్ప-కన్ను..
వేరైపోనీ, పుడమి-మన్ను..

6) నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా – కొత్తబంగారులోకం

ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం
నా మనస్సుకే ప్రతిక్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోన అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు గడిచిన కాలం ఎంతని నమ్మనుగా….

7) పూలనే కునుకేయమంటా – ఐ/మనోహరుడు

ప్రతి క్షణము క్షణము..
నీ అణువు అణువులను కలగన్నది నా ఐ..
ఇన్ని కలల ఫలితమున..
కలిసినావు నువ్వు తీయటి ఈ నిజమై..
నా చేతిని వీడని గీత నువై ..
నా గొంతుని వీడని పేరు నువై ..
తడి పెదవులు తళుకవనా..
నవ్వునవ్వనా.. ఎంత మధురము…

8) వింటున్నావా..వింటున్నావా.. – ఏమాయ చేసావె

రా ఇలా కౌగిళ్ళల్లో నిన్ను దాచుకుంటా..
నీ దానినై నిన్నే దారిచేసుకుంటా..
ఎవరిని కలువని చోటులలోన..
ఎవరిని తలువని వేళలలోన..
తరిమే వరమా..తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా..

9) అపుడో ఇపుడో – బొమ్మరిల్లు

తీపికన్నా ఇంకా తీయనైన
తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానే
హాయి కన్నా ఎంతో హాయిదైన
చోటే ఏమిటంటే నువ్వు వెళ్ళే దారని అంటానే
నీలాల ఆకాశం నా నీలం ఏదంటే
నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే…

10) పచ్చ బొట్టేసిన – బాహుబలి

మాయగా నీ సోయగాలలు వేసి
నన్నిలా లాగింది నువ్వే కదా
కబురులతో కాలాన్ని
కరిగించే వ్రతమెలా
హత్తుకుపో నన్ను ఊపిరి ఆగేలా

SHARE