ప్రపంచం లో ఉండే ముస్లింలందరికి మక్కా మసీదు అంటే ఎంతో పవిత్రమైనది. తాము చనిపోయేముందు ఒకసారైనా ఆ మసీదును దర్శనం చేసుకోవాలనేది చాల మంది ముస్లింల కోరికగా చెబుతారు. మరి పురావస్తు ఆధారంగా మక్కా మసీదు మొదట ఒక హిందూ దేవాలయం అని అక్కడ అమ్మవారిని పూజించేవారని చెబుతున్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది? పురావస్తు వారికీ లభించిన ఆ ఆధారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మక్కా లేదా మక్కాహ్ ‘మక్కతుల్-ముకర్రమా’ ఇస్లామీయ పవిత్ర నగరం. ఇది సౌదీ అరేబియా మక్కా క్షేత్రంలో, చారిత్రాత్మక హిజాజ్ ప్రాంతంలో గలదు. ఈనగరంలోనే ముస్లింలకు పరమ పవిత్రమైన మస్జిద్-అల్-హరామ్ అనే పవిత్ర మసీదు గలదు. ఇంకా ఈ మసీదులోనే పరమ పవిత్రమైన కాబా గృహం గలదు. హజ్ యాత్రలో ముస్లింలందరూ ఇచటనే చేరి హజ్ సాంప్రదాయం లోని ‘కాబా గృహం చుట్టూ ఏడు తవాఫ్ అంటే ప్రదక్షిణలు’ చేస్తారు.ఇది ఇలా ఉంటె చంద్రగుప్త విక్రమాదిత్యుని పాలనలో అరేబియా ఉన్నప్పుడు అంటే సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం అప్పటికింకా మహ్మదీయ మతం లేదు. ఒకసారి సామ్రాజ్య పర్యటనలో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళాడు. అప్పుడు అక్కడి ప్రజలు తమక్కూడా ఉజ్జయినీ మహాకాళి ఆలయం లాంటిది కావాలని చక్రవర్తిని అభ్యర్థించారు. అప్పటికి అరబ్బీ మాట్లాడే అరేబియన్ లంతా హిందువులే అని చెబుతారు. ఇంకా అక్కడ అరబ్బీ బ్రాహ్మలు కూడా ఉండేవారు. అయితే వారు అడిగిన అభ్యర్థికి చక్రవర్తి సరేనని చెప్పి ఇప్పుడు మక్కా అని పిలుస్తున్న ప్రదేశంలో మహాకాళీ ఆలయాన్ని నిర్మించాడు.అది నిర్మించడానికి చాలా సంవత్సరాలు పట్టింది.
ఇలా కట్టించిన ఆ దేవాలయం అతిత్వరలోనే యావత్తు అరబ్బీ దేశపు హిందువులకీ కేంద్రస్థానంగా, శైవ పీఠాధిపత్యంగా మారింది. ఇప్పుడు మక్కా వెళ్ళే హజ్ యాత్రికులంతా దర్శించేది ఆ మహాకాళీ ఆలయాన్నే. దాన్ని స్వాధీనం చేసుకోవడం కోసమే 6 వ శతాబ్దంలో ప్రవక్త మహ్మదుగారు శైవులతో హోరాహోరీ పోరాడాడు. ఆయన విగ్రహారాధకులతో పోరాడాడని ఖురాన్ లో కూడా వ్రాశారు.
ఇక్కడి ఆలయంలో కాబా అని పిలిచే నల్లరాయిని ముస్లింలు అల్లాహ్ అని అంటారు. శివలింగం లేని పానవట్టాన్ని ఎలా ఉంటుందో అది సరిగ్గా అలా ఉంటుంది. లింగం స్థానంలో లోతుకు పోయిన ఖాళీసొట్ట కూడా ఉంటుంది. పానవట్టం అంటే పార్వతీస్వరూపమని అది హిందూ సంప్రదాయం అని తెలుసు. అయితే హజ్ యాత్రికులు దాన్ని తాకడం కోసం ఎగబడుతూంటారు. అయితే కాబా దగ్గర దాన్ని పూజించే ముస్లిమ్ ఇమామ్ లు అచ్చం మన శైవపూజారుల తరహాలో బోడిగుండ్లు, పంచెలు, ఉత్తరీయాలూ ధరించి ఉంటారు. భక్తులు కూడా అసలు అదే వేషంలో కాబాని దర్శించాలని నియమం ఉందట. ఆ నల్లఱాయి ఇస్లామ్ ఆవిర్భవించక ముందునుంచే అక్కడ ఒక పూజనీయవస్తువుగా ఉండేదని చారిత్రిక ఆధారాల వల్ల తెలుస్తున్నది.
చాలా దశాబ్దాల క్రితం – అంటే అరేబియా పాశ్చాత్యుల అధీనంలో ఉన్నప్పుడు ఒక తెల్లవాడు ఆ ఆలయప్రాంగణంలో ఎల్లప్పుడూ మూసిపెట్టి ఉంచే ఒక గదిని తెఱిపించి చూశాడట. లోపల త్రిశూలాలు, శివలింగాలూ, సర్పాకార శిల్పాలు చాలా చూశానని, అలాంటివి ఇండియాలో తప్ప ఇంకెక్కడా ఉండవని రాశాడు. ఆ గదిని ఎవరూ చూడకూడదనే నియమాన్ని ఇప్పుడు మాత్రం కట్టుదిట్టంగా అమలు జరుపుతున్నారు.
ఇది నిజం అనడానికి సాక్షంగా పురావస్తు శాఖవారు చంద్రగుప్త విక్రమాదిత్యుడు వేయించిన శిలాశాసనాన్ని అక్కడ కనుగొన్నారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.