Home Unknown facts మీనాక్షి అమ్మవారికి తన జన్మరహస్యం తెలిసి శివుడిని వివాహం చేసుకున్న స్థలం

మీనాక్షి అమ్మవారికి తన జన్మరహస్యం తెలిసి శివుడిని వివాహం చేసుకున్న స్థలం

0

మన దేశంలో ఎన్నో పవిత్ర పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అందులో ఒకటిగా చెప్పుకునే ఈ పురాతన ఆలయంలో ఎన్నో విశేషాలు అనేవి ఉన్నాయి. అయితే ఈ ఆలయానికి నాలుగు ముఖద్వారాలు ఉండగా, వాటిని ధర్మ, అర్ద, కామ, మోక్ష ద్వారాలని పురాణాల్లో ఉంది. ఇంకా ఇక్కడ ఆలయంలో పార్వతి దేవి కొలువై ఉన్న ప్రాంతానికి పురుషులకి అసలు ప్రవేశం అనేది లేదు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయానికి సంబంధించి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Meenakshiతమిళనాడు రాష్ట్రంలోని మధురై లో శ్రీ మధుర మీనాక్షి దేవాలయం ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఈ ఆలయాన్ని వేగై నది ఒడ్డున 6 వ శతాబ్దంలో పాండ్య రాజైన కులశేఖరుడు నిర్మించాడు. ఈ మీనాక్షి ఆలయం భారతదేశంలోని అతి ప్రాచీన దేవాలయలో ఒకటి. ఈ ఆలయం 283 గజాల పొడవు, 243 గజాల వెడల్పుతో ఒక పెద్ద కోట లాంటి ఆవరణలో ఉంది. ఈ ఆలయ గోపురం 160 అడుగుల ఎత్తులో ఉంటుంది. తమిళ పురాణాల ప్రకారం శివుడికి, మీనాక్షి దేవికి వివాహం ఇక్కడే జరిగిందని చెబుతారు. ఆ ఆలయంలో ఉన్నంత శిల్ప కళ నైపుణ్యం మరెక్కడా కూడా లేదనే చెప్పవచ్చు. దక్షిణ భారతదేశంలో ఎక్కువమంది దర్శించే ఆలయాల్లో మీనాక్షి దేవి ఆలయం ఒకటి.

ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పూర్వం శివుడు తపస్సుచేసుకోవడానికి ఇంద్ర ప్రేరేపితమై అనుకూల మార్పు చెందింది. కళ్యాణపురి రాజుకు ఒకరోజు రాత్రి కలలో ఈ ప్రదేశంలో శివుడు అమృతం వొలికిస్తున్నట్లుగా కనబడింది. అది మహాప్రసాదంగా భావించి ఆ రాజు ఈ ప్రదేశాన్ని తన రాజధానిగా చేసుకొని మధురాపురం అని పేరుపెట్టుకొని రాజ్యమేలాసాగాడు. రాజుగారి ఏకైక కుమార్తె అందాలరాశి పార్వతీదేవి అవతారం సుందర నయనాక్షి మీనాక్షి. ఈమె రాజు సింహాసనం ఎక్కి రాజ్య పాలనా చేయుచుండగా చుట్టూ పక్కల కోరమీసాలుగల మగటిమ రాజులూ కన్నెర్ర చేసి ఆమె రాజ్యం మీద దండెత్తారు. అయినప్పటికీ ఆమెని ఎవరు ఎదురించలేకపోయారు. ఇలా ఆమె శత్రువులని మట్టుబెడుతూ ఆవేశంగా ఇంకా ఎవరు మిగిలారని అంటుండగా చెరగని చిరునవ్వుతో ఎదురుగా ఒక యువకుడు నిలుచున్నాడు. అతడే ముగ్ద మనోహరుడు సుందరేశ్వరుడు శివుడు. అప్పుడు మీనాక్షి అమ్మవారికి తన జన్మరహస్యం స్మురించగా తానూ పార్వతీదేవి అంశగా గుర్తించి ఆమె స్వామివారిని పరిణయ మాడినది.

ఇక ఈ ఆలయంలో శివాలయం ఉంది. దీనినే సుందరేశ్వరాలయంగా పిలుస్తారు. ఇక్కడ ఉన్న పద్మ సరోవరంలో ఈ నీరు తాగితే సరస్వతీదేవి కటాక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇక ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే, నాలుగు దిక్కుల నాలుగు ఎత్తైన రాజగోపురాలతో గంబీరంగా కనబడుతుంది. ఇక ప్రతి సంవత్సరం చైత్ర పూర్ణిమ నుండి స్వామికి జరిగే వివాహ వేడుకల్లో నిజంగానే ఓ బాలునికి – ఓ బాలికకు పెళ్లి అలంకరణ చేసి కళ్యాణం జరిపిస్తారు. దీనినే చిత్రాయి ఉత్సవంగా 10 రోజుల పాటు నిర్వహిస్తారు.

ఇది ఇలా ఉంటె మీనాక్షి అమ్మవారికి ప్రతి సోమవారం సాయంత్రం ప్రత్యేక అలంకారంతో పాటు ప్రత్యేక పూజ ఉంటుంది. అప్పుడు అమ్మవారికి ఒక వజ్రం పొదిగిన ముక్కు పుడక అలంకరిస్తారు. ఈ వజ్రం ఖరీదు ఎంతనేది ఇంతవరకు ఎవరు కూడా తేల్చలేకపోయారు. జనవరి – ఫిబ్రవరి నెలల్లో జరిగే ఉత్సవం ఇక్కడ బ్రహ్మాండంగా కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

 

Exit mobile version