మహాభారతం గురించి ఎంత తెల్సుకున్న చాలా తక్కువే అనిపిస్తుంటుంది. అయితే ఇందులో కౌరవులకు, పాండవులకు మధ్య జరిగే ఆధిపత్య పోరు ఒక్కటే కాకుండా కొన్ని ప్రేమ కథలు కూడా ఉన్నవి. మరి ఆ ప్రేమ కథలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. గాంధారి మరియు ధృతరాష్ట్రుడు:
గాంధారి మరియు ధృతరాష్ట్రుడు ప్రేమ కథ వారి వివాహం తర్వాత ప్రారంభమయ్యింది. అయితే గాంధారి, అతనిని కలుసుకున్న తరువాతే అతను గుడ్డివాడు అన్న విషయం తెలుసుకున్నది. ఆ తరువాతే ఆమె తన భర్త దృష్టి లేక ఆనందించటం లేదు, కాబట్టి ఆమె కూడా ఆనందాన్నిదూరం చేసుకొని వైవాహిక జీవితం మొత్తం స్వచ్ఛందంగా ఆమె కళ్లకు గంతలు కట్టుకుని గడిపింది.
హిడింబ మరియు భీముడు: వనవాసంలో ఉన్నప్పుడు ఒక రాక్షసుణ్ణి భీముడు చంపుతాడు. అలా చనిపోయిన రాక్షసుని చెల్లెలు హిడింబి. అయితే ఈమె భీముని ధైర్య సాహసాలు చూసి అమితంగా అయన ప్రేమలో పడిపోతుంది. ఆ విషయం తెలిసిన కుంతీదేవి వీరిద్దరికి వివిహం జరిపిస్తుంది. కానీ వివాహం తరువాత, వారు పరిమితమైన కాలం మాత్రమే కలిసి జీవించారు. ఇక వనవాసం తరువాత భీముడు ఆమెను వదిలి వెళ్లాడు. భీముడికి, హిండంబ కి పుట్టిన సంతానమే ఘటోత్కచుడు.
అర్జునుడు, ఉలూపి: ఉలూపి ఒక నాగ యువరాణి మరియు ఆమె అతనితో ప్రేమలో ఉన్నప్పుడు,ఆమె అర్జునుడిని అపహరించింది. బ్రహ్మచర్యం యొక్క నియమాలను మరియు ఇతర మహిళలతో ఉన్న సంబంధం కాకుండా ద్రౌపదితో ఉన్న సంబంధం, వీటన్నిటిని అధిగమించి ఆమె అతనిని ఒప్పించింది. ఆమె తరువాత అతనికి నీటిలో ఉండగా ఎటువంటి హాని జరగదనే ఒక వరం ఇచ్చింది.
శ్రీకృష్ణుడు, రుక్మిణి: శ్రీ కృష్ణుడు, రుక్మిణి కుటుంబం యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఆమెని అపహరించి వివాహం చేసుకున్నాడు.
సత్యవతి మరియు ఋషి పరాశరుడు: పరాశరుడు భక్తి ద్వారా అనేక యోగ శక్తులను పొందిన, ఒక గౌరవనీయుడైన గొప్ప ఋషి అని అందరికి తెలిసిన విషయమే. సత్యవతి, ఒక మత్స్యకారుడి, దాశారాజు, కుమార్తె, ఆమె పడవలో ప్రజలను యమునా నదిని దాటిస్తుండేది. ఒక రోజు ఆమె పడవలో ఋషి పరాశరుడిని దాటిస్తున్నది. ఆ సమయంలో ఋషి ఆమె రూపానికి ఆకర్షితుడై, ఆమెకు కోరికను వ్యక్తం చేశాడు. అతను ఆమెతో సంగమం వలన ఆమె ఒక గొప్ప వ్యక్తి జన్మకు కారణమౌతుందని తెలిపాడు. సత్యవతి అతనికి మూడు షరతులు పెట్టింది
1. ఎవరూ వారు ఏమి చేస్తున్నారో చూడకూడదు, పరాశరుడి వారిద్దరి చుట్టూ ఒక కృత్రిమ పొగమంచు రూపొందించాడు;
2. తన కన్యత్వం చెక్కుచెదరకుండా ఉండాలి – పరాశరుడు ఆమెకు, జన్మనిచ్చిన తర్వాత కూడా ఆమె కన్యగానే ఉంటుందని హామీ ఇచ్చాడు ;
3. ఆమె శరీరం నుండి వచ్చే చేపల వాసన బదులు సుగంధభరిత వాసన రావాలని కోరుకున్నది – పరాశరుడు ఆమె శరీరం నుండి తొమ్మిది మైళ్ళ దూరం వరకు ఒక దివ్య వాసన వొస్తుందని వాగ్దానం చేశాడు.
ఆవిధంగా ఆమె వేద వ్యాసూడికి జన్మనిచ్చింది.
అర్జునుడు, సుభద్ర: అర్జునుడు, సుభద్ర సోదరుడు, గద, ద్రోణుడి వద్ద కలిసి శిక్షణ తీసుకున్నారు. అజ్ఞాతవాసం తరువాత, అర్జునుడు ద్వారకకు చేరుకున్నాడు. ఆ సమయంలో అర్జునుడు సుభద్ర మందిరానికి ఆహ్వానింపబడ్డాడు. ఆ సమయంలో ఇద్దరిమధ్య ప్రేమ చిగురించింది. అప్పుడు అర్జునుడు శ్రీ కృష్ణుడిలో సగభాగం అయిన తన సోదరి అయిన సుభద్రణు వివాహం చేసుకున్నాడు. శ్రీ కృష్ణుడే సుభద్రణు అపహరించమని అర్జునుడికి సలహా ఇచ్చాడు. సుభద్ర ద్రౌపదిని కలిసినప్పుడు ఆమె అర్జునుడితో ఆమె వివాహం గురించి వెంటనే చెప్పలేదు. వారు స్నేహపూర్వకంగా కలిసిన ఒక గంట తర్వాత కానీ, సుభద్ర ద్రౌపదికి వివాహ విషయం గురించి చెప్పింది మరియు ఆమె కూడా అంగీకరించింది.
సత్యవతి మరియు శంతనుడు: సత్యవతి పరిమళం శంతనుడిని ఆకర్షించింది. అతను ఆ పరిమళం వొచ్చే దిశను అనుసరించాడు మరియు సత్యవతి పడవలో కూర్చొని ఉండటం చూశాడు. అతను పడవలోకి ఎక్కి నదిని దాటించమని సత్యవతిని కోరాడు. అతను ఆవలి ఒడ్డుకు చేరుకున్నతరువాత అతను తిరిగి పడవలోకి ఎక్కి అవతలి ఒడ్డుకు చేర్చమని ఆమెణు కోరాడు. ఈ విధంగా ఆ రోజు సంధ్యాసమయం వరకు కొనసాగింది. ఇదేవిధంగా కొంతకాలం రోజువారీ కొనసాగింది. చివరగా, శంతనుడు వివాహం చేసుకోమని సత్యవతిని కోరాడు. సత్యవతి తన అంగీకారం తెలిపింది కానీ ఆమె తండ్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పింది. ఆమె తండ్రి పెట్టిన షరతులు విని శంతనుడు నిరాశ చెందాడు మరియు ఆ షరతులు తీర్చటానికి తను అశక్తుడినని తెలిపాడు.
అర్జునుడు, చిత్రాంగద: చిత్రాంగద, మణిపూర్ యువరాణి. కావేరి నది ఒడ్డున ఉన్న మణిపూర్ కు రాజు చిత్రవాహన ఉండగా, అర్జునుడు దీనిని సందర్శించాడు. అతని కుమార్తె చిత్రాంగద, చాలా అందమైనది మరియు అర్జునుడు ఆమెను చూసిన వెంటనే ఆమెతో ప్రేమలో పడ్డాడు. వెంటనే అర్జునుడు ఆమెకు తెలిపాడు. ఆమెను వివాహం చేసుకుంటానని ఆమె తండ్రిని అడిగినప్పుడు, ఆమె తండ్రి వారి పిల్లలు మణిపూర్ లో పెరగాలని మరియు సింహాసనం అధిష్టించాలని షరతు విధించాడు. అర్జునుడు అంగీకరించాడు. బబ్రువాహనుడు జన్మించిన తరువాత, అర్జునుడు భార్యను, కొడుకును వొదిలి తన సోదరులతో కలిసి ఉన్నాడు.
ఈవిధంగా కొన్ని ప్రేమ కథలు మహాభారతంలో ఉన్నాయని కొన్ని కథల ఆధారంగా తెలుస్తుంది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.