శివుడిని అర్ధనారీశ్వరుడు అని ఎందుకు అంటారు ?

0
2012

త్రిమూర్తులలో చివరివాడైన లయకారుడు శివుడు. మన దేశంలో శివాలయాలే ఎక్కువగా ఉంటాయి. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలానికి వశము కానివాడు అందుకే అయ్యానని సదాశివుడు అని అంటారు. అయితే శివుడిని అర్ధనారీశ్వరుడు అని కూడా అంటారు. మరి అర్థనారీశ్వర రూపం రహస్యం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Ardhanarishvara

శివుడి అర్థనారీశ్వర రూపం గురించి వేదాల్లో పూర్తిగా వివరించబడి ఉంది. అయితే పార్వతీపరమేశ్వరులు ఒకటిగా ఉండటాన్ని అర్ధనారీశ్వరం అని హిందూ పురాణాల్లో చెప్పబడి ఉంది. అయితే తల నుండి కాలి బ్రొటన వేలు వరకు సమానంగా అంటే నిలువగా చెరిసగం ఉన్న ఆడ, మగ రూపాలు ఒకటిగా ఉండును. అర్ద అంటే సగమైనా, నారి అంటే స్త్రీ, ఈశ్వర అంటే సగమైనా పురుషుడి రూపం కలిగి ఉండటం.

Ardhanarishvara

ఇక శివుడు అర్ధనారీశ్వరుడిగా ఎప్పుడు అయ్యాడు, తన దేహంలో అమ్మవారికి సగ భాగాన్ని ఎలా కల్పించాడు, అనే విషయంలోకి వెళితే, శివపురాణం ప్రకారం, పూర్వం బ్రహ్మ దేవుడు మనుషులను వృద్ధి చేయడానికి సృష్టిని చేయసాగాడు. అప్పుడు అనుకున్నంత వృద్ధి జరగకపోవడంతో నిరాశ చెందిన బ్రహ్మదేవుడు శివుడి కోసం ఘోర తపస్సు చేసాడు. బ్రహ్మ చేసిన తపస్సుకు మెచ్చిన శివుడు అర్థనారీశ్వర రూపంలో దర్శనం ఇచ్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు నమస్కరించగా, శివుడూ బ్రహదేవుడితో, బ్రహ్మ సృష్టికి సహకరించడానికి ఈ రూపంలో వచ్చానని చెబుతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడు సగ భాగంగా ఉన్న ఆ దేవిని నమస్కరించి, సృష్టి వృద్ధి కోసం ఒక స్త్రీ రూపాన్ని ధరించమని, స్త్రీ సృష్టించే శక్తిని ప్రసాదించమని, తన కుమారుడైన దక్షుడి కుమార్తెగా జన్మించమని ఆ ఉమాదేవిని ప్రార్థిస్తాడు. ఇలా బ్రహ్మ దేవుడి కోరికతో ఆ దేవి ఆ శక్తిని ప్రసాదించి, దక్షుడి కుమార్తెగా జన్మిస్తుంది.

Ardhanarishvara

ఇలా బ్రహ్మకి శివాజ్ఞతో శక్తిని ప్రసాదించి ఆ తరువాత ఆ మహాదేవుని శరీరంలోకి ప్రవేశించింది. ఈవిధంగా అప్పటినుండి లోకంలో స్త్రీ సృష్టి కొనసాగింది. అప్పుడు బ్రహ్మ దేవుడి కోరిక నెరవేరడంతో నిర్విఘ్నంగా సృష్టిని విస్తరింపజేశాడు. అయితే బ్రహ్మ దేవుడు మొదటగా ఒంటరిగా సృష్టిని విస్తరింపచేయాలని అనుకున్నప్పటికీ ఎక్కువ ఫలితం లేకపోవడంతో, శివుడి అనుగ్రహంతో స్త్రీ తత్వం అవతరించిన తరువాతే సృష్టి విశేషంగా పరివ్యాప్తమైందని పురాణం.

SHARE