ప్రతీ ఏటా భక్తి శ్రద్ధలతో ,నిష్టతో మాల ధారణ చేస్తారు భక్తులు. కాళ్ళకి చెప్పులు కూడా ధరించరు మనసు, తనువు పవిత్రంగా ఉంచుకొని విరమణ సమయం వరకు కఠినమైన మాటలు కూడా నోటినుండి రాకుండా ఎంతో భక్తితో ఉంటారు. కొంతమంది అయ్యప్ప మాల , కొంతమంది హనుమాన్ మాల, భవాని మాల ,శివుడి మాల ఇలా వాళ్ళ వాళ్ళ నమ్మకానికి , ఆచారానికి తగ్గట్టుగా నమ్మిన దేవుడి మాలను ధరిస్తారు. అయితే కొన్ని సందర్బాలలో మాల వేసుకోవడానికి అర్హులు కారని శాస్త్రాలు చెబుతున్నాయి అవేంటో తెలుసుకుందాం.
కుటుంబములో తల్లి, తండ్రి మరణించినప్పుడు ఏడాది వరకు సూతకము పాటించాలి. కాబట్టి ఆ సమయంలో తనయులు మాల దరించకూడదు. భార్య మరణించిన వారు కూడా ఒక ఏడాది,సోదరులు, కుమారులు, అల్లుళ్ళు, మేనత్తలు, మేన మామలు, తాత, బామ్మ లాంటి వారు మరణిస్తే ముపై రోజులు మనుమళ్ళు, మనుమరాళ్ళు, దాయాదులు మరణిస్తే ఇరవైఒక్క రోజులు, ఇంటి పేరు గలవారు, రక్త సంబంధీకులు, వియ్యాల వారు మరణిస్తే పదమూడు రోజులు, ఆత్మీయులు, మిత్రులు మరణిస్తే మూడు రోజులు, దీక్ష తీసుకోకూడదు.
తల్లి, భార్య, కూతురు, కోడలు, మరదలు వీళ్ళలో ఎవరైనా ఐదు నెలల గర్బినిగా ఉంటే మాల ధరించరాదు. దీక్షలో ఉండగా బంధు వర్గాదులలో ఎవ్వరు మరణించిన ఆ వార్త తెలియగానే మాల విసర్జన చేయాలి. అలా కాక మాలో మాకు మాటలు లేవు, కాబట్టి మాకు ఆ మరణంతో ఎలాంటి పట్టింపులు లేవు అనకూడదు. ఏ కారణం చేతనైనా మాల విరమణ జరిగితే మళ్ళీ ఆ ఏడాది మాల ధరించరాదు.