మామిడి నూనె ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుందని తెలుసా?

చూడగానే కళ్ళను ఆకర్షించే రంగు, వెంటనే తినేయాలి అనిపించే వాసన, రుచి అన్నీ కలగలిపితే మామిడి. రంగు, రుచి, వాసన మాత్రమే కాదు మామిడిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి కాబట్టే అన్ని పండ్లలోకి రారాజుగా గుర్తింపు లభించింది. వేసవికాలంలో మాత్రమే లభించే పండ్లలో మామిడి ముఖ్యమైనది. ప్రపంచంలో, ముఖ్యంగా ఉష్ణ మండల దేశాలలో వెయ్యి రకాల మామిడి పండ్లు అందుబాటులో వున్నాయి. వీటిలో కొన్ని మాత్రం వాణిజ్య ప్రమాణాలకు తగ్గట్టు పెంచడం జరుగుతుంది.

mangoesమామిడిలో ఎన్ని రకాలు ఉన్నా.. అది పచ్చిదైనా, పండైనా, చివరికి ఎండిన మామిడైనా సరే.. దానిలోని ఔషద గుణాలు మాత్రం తగ్గవు. మామిడి గుజ్జు, తొక్క, టెంక, ఆఖరికి మామిడితో తయారు చేసే చూర్ణంతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడిచేసి ప్యాక్ చేసి అమ్ముతారు. దీనిని వారు విరివిగా వంటలలో వాడుతుంటారు. దీనిని వారు ఆమ్ చూర్ లేదా మామిడి పొడి అంటారు.

మామిడి టెంకను పొడి చేసుకుని కూరల్లో వాడితే వేసవి తాపంతో ఏర్పడే రుగ్మతల నుంచి తప్పించుకోవచ్చు. వెల్లుల్లి, ఉల్లి, టమోటాను బాగా వేయించుకుని అందులో మామిడి టెంక పొడిని చేసి కూరలా తయారు చేసి.. వేడి వేడి అన్నంలో నాలుగైదు ముద్దలు తీసుకుంటే శరీర వేడిమి తగ్గుతుంది. ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి. ఇంకా మామిడి టెంకను పొడి చేసుకొని జీలకర్ర, మెంతుల పొడితో సమానంగా కలిపి వండి వేడి వేడి అన్నంతో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.

mango oilఉదర సంబంధ వ్యాధులకు మామిడిటెంక మంచి ఔషధం మామిడిటెంక పొడిని మజ్జిగలో కలిపి కాస్త ఉప్పు చేర్చి తాగితే కడుపు ఉబ్బరం, జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి టెంకలోని గింజను చూర్ణం చేసి రోజుకు మూడు గ్రాముల చొప్పున తేనెతో కలిపి సేవిస్తే ఉబ్బసం తగ్గుముఖం పడుతుంది. దగ్గు సమస్యలు తగ్గుతాయి.
మామిడిటెంకలోని జీడిని పొడి చేసి దాన్ని మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

మామిడిటెంకలోని ఫ్యాటీ యాసిడ్స్, మినరల్స్, విటమిన్స్ జుట్టుకు పోషణనిస్తాయి. తెల్లబడే జుట్టుకు చెక్ పెట్టాలంటే మామిడిటెంక పొడిలో కొబ్బరి, ఆలీవ్, ఆవనూనెలు కలిపి వెంట్రుకలకు పట్టించాలి. మామిడి టెంక పొడిలో వెన్న కలిపి ముఖానికి ఐప్లె చేస్తే చర్మం మెరిసిపోతుంది. ఇవే కాదు వ్యర్థం అనుకునే మామిడి టెంక నుండి నూనెను కూడా తయారుచేసుకోవచ్చు. మామిడి టెంకల లోని పిక్కనుండి తీసే నూనెను మామిడి నూనె అంటారు.

mango oilలేత పసుపుపచ్చ వర్ణంలో ఉండే ఈ నూనెలో సంతృప్త కొవ్వు ఆమ్లాలు (స్టియరిక్) ఎక్కువ వుండటం వలన, 38-40°C వద్ద ద్రవీభవిస్తుంది. అందుకే మామిడి పిక్కలనూనెను మామిడి పిక్కలకొవ్వు లేదా మామిడి వెన్న అనికూడా అంటారు. మామిడిపిక్క నూనెలోని కొవ్వు ఆమ్లాల శాతం, కొకో బట్టరును పోలివుండటం వలన కోకో బట్టరుకు ప్రత్యామ్నాయంగా వుపయోగిస్తారు. ఇది సాధారణ ఉష్ణోగ్రత వద్ద గడ్డ కట్టి, కట్టని ద్రవ, ఘనమధ్యస్థితిలో ఉండి చర్మాన్ని తాకిన వెంటనే కరిగిపోతుంది.

ఈ స్వభావం వల్ల దీన్ని పసిపిల్లల క్రీములు, సన్‌కేర్ బాములు, కేశసంరక్షణ ఉత్పత్తులు, ఇతర చర్మపు తేమను కాపాడే ఉత్పత్తులలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. మామిడి టెంకె నూనె అనేక సౌందర్య సాధనాలో విస్తృతంగా ఉపయోగించ బడుతుంది. ఇది సన్‌స్క్రీన్‌ వలె పనిచేయడంతో పాటుగా ఎండకు కాలిన, రంగు మారిన చర్మాన్ని నయం చేసే లక్షణాలను కలిగి ఉంది. మామిడి టెంకె నూనెను ఉపయోగించడం వలన చర్మం పై సాగిన గుర్తు ఏర్పడకుండా చేస్తుంది. చర్మం పైన పగుళ్ళు ఏర్పడితే దానిపై మామిడి టెంకె నూనె వాడటం వలన త్వరగ కోలుకుంటుంది.

mangoesమామిడిలో పలు రకాలుండటం వలన మామిడిపిక్కలోని నూనెలోని కొవ్వు ఆమ్లాల సమ్మేళనశాతం రకాన్నిబట్టి కొంత భిన్నంగా వుంటుంది. ప్రధానంగా మామిడి నూనె స్టీరిక్, ఓలిక్ ఆమ్లాల మిశ్రమం. పామ్ నూనె, వేరుశెనగ నూనె, పత్తి నూనె తదితర వంటనూనెలతో పోల్చుకుంటే మామిడి నూనెలో స్టీరిక్ అమ్లం దాదాపు 20 రెట్లు ఎక్కువ శాతంలో ఉంది. మామిడిపిక్కనూనెను అసిటోనుతో పాక్షీకరణ చేసి SOS వున్న గ్లిసెరైడు భాగాన్ని వేరుచేసి, పామ్‌మిడ్‌ ఫ్రాక్షనులో కలిపి మార్జరిన్‌, సాలడు తయారిలో వాడుతారు.

మామిడి టెంకె నూనెలో ఉన్న యాక్టివ్‌ ఏజెంట్‌ మన శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని వివిధ అధ్యయనాలలో నిరూపించబడింది. ఇది మన రక్త ప్రవాహంలో గ్లూకోజ్‌ స్థాయిని నియంత్రించడానికి చాలా ఉపయోగకరంగా ఉండి తద్వారా డయాబెటిస్‌ను నివారిస్తుంది. ఈ నూనె గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ చాలా తక్కువ, అంటే ఈ నూనెను రోజువారీ ఆహారంలో ఎటువంటి భయం లేకుండా చేర్చుకోవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR