అల్లం నూనెతో అనేక ప్రయోజనాలు!

మనం వివిధ రకాల నూనెలను చూసే ఉన్నాం… వంట నూనెలు, బాడీ ఆయిల్స్ మరియు స్కాల్ప్ ఆయిల్స్ వంటి వివిధ రకాల నూనెలు ఉన్నాయి. కొత్త కొత్త నూనెలు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే అనేక రకాల నూనెలు ఉన్నప్పటికీ, కొన్ని నూనెలు మాత్రమే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందులో అల్లం నూనె ఒకటి. అల్లం వంట‌ల‌కు చ‌క్క‌టి రుచి అందించ‌డంతో పాటుగా ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంద‌న్న విష‌యం దాదాపు అంద‌రికీ తెలుసు.
  • కానీ అల్ల‌మే కాదు దాని నుంచి తీసే నూనె కూడా ఆరోగ్యానికి ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. చెక్క నుండి నూనె తీసినట్లే అల్లం నుండి నూనె తీయబడుతుంది. ఈ నూనె లేత పసుపు రంగులో ఉంటుంది. కానీ అందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అల్లం నూనె అనేక ఔష‌ధ గుణాల‌ను క‌లిగి ఉంటుంది. అందు వ‌ల్ల‌నే ఆరోగ్యానికి అల్లం నూనె అదిరిపోయే బెనిఫిట్స్‌ను అందిస్తుంది.
  • బరువు తగ్గించడంలో అల్లం నూనె  ప్రభావవంతంగా పని చేస్తుంది. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటిలో రెండు లేదా మూడు చుక్కల అల్లం నూనెను యాడ్ చేసుకుని సేవించాలి. ఇలా ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకుంటే గ‌నుక‌. శరీరంలో పేరుకు పోయిన టాక్సిన్స్ మరియు అదనపు కొవ్వు తొలిగి పోతుంది. అతి ఆక‌లి దూరంగా అవుతుంది. త‌ద్వారా క్ర‌మంగా బ‌రువు త‌గ్గుతాయి.
  • ఒక చిన్న చుక్క అల్లం నూనెను వెచ్చని నీటిలో కలిపి తాగితే జీర్ణ రుగ్మతలు మాయం అయిపోతాయి. అలాగే, కడుపులోని ధూళి బయటకు పోతుంది. అలాగే ఒక గిన్నెలో బాగా వేడి నీటిని తీసుకుని. అందులో నాలుగు చుక్క‌లు అల్లం నూనెను వేసి ఆవిరి పట్టాలి. ఇలా చేస్తే జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి, శ్వాస కోశంలో వాపు వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి. శ్వాస ఫ్రీగా ఆడుతుంది. మ‌రియు ఆస్త‌మా ల‌క్ష‌ణాల నుంచి సైతం ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
  • అల్లం సహజంగా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించే శక్తిని కలిగి ఉంటుంది. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్ మరియు చర్మ క్యాన్సర్ యొక్క చెడు ప్రభావాలను ఎదుర్కోవడంలో అల్లం నూనె అదేవిధంగా ప్రభావవంతంగా ఉంటుంది. ప్రాచీన వైద్యంలో అల్లం నూనె ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. ఈ నూనెను పూయడం వల్ల శరీరంలోని అన్ని నొప్పులు నయం అవుతాయి. అలాగే, ఇది కీళ్ల సమస్య, కీళ్ల నొప్పులను నయం చేస్తుంది.
  • ఇక ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీటితో మూడంటే మూడు చుక్క‌లు అల్లం నూనె క‌లిపి సేవిస్తే జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది. గ్యాస్, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ సంబంధిత స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.శ ‌రీరంలో క్యాన్స‌ర్ క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్ క‌రిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది. మ‌రియు రోగ నిరోధ‌క శ‌క్తి కూడా రెట్టింపు అవుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR