Home Unknown facts పవిత్ర క్షేత్రాలను చూడాలనే ఉద్దేశంతో బయలు దేరిన ప్రవరాక్యుడు కథ

పవిత్ర క్షేత్రాలను చూడాలనే ఉద్దేశంతో బయలు దేరిన ప్రవరాక్యుడు కథ

0

పూర్వం ధర్మాన్ని తప్పని ప్రవరాక్యుడు ఉండేవాడు. తన చుట్టూ ఉండే పరిస్థితుల కారణంగా అతడు తన ఉరిని ధాటి ఎటు వెళ్లలేని పరిస్థితి ఆ సమయంలో ఒక సిద్దిడు కారణంగా హిమాలయాలకు వెళ్తాడు. మరి ఆ ప్రవరాక్యుడి కథ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Markandeya Purana

పూర్వం అరుణాస్పదం అనే ప్రవరుడు అనే వాడు ఉండేవాడు. అతడు తన తల్లి తండ్రలకి సేవల చేయడం, భార్య బిడ్డలను ప్రేమతో చూసుకోవడం, అతిదులకి ఆతిధ్యం ఇవ్వడం ఇదే ఎప్పడు దినచర్యగా ఉండేది. అయితే అతడికి తీర్థ యాత్రలు చేయడం చాలా ఇష్టం ఉండేది. కానీ దేవతార్చన, తల్లి తండ్రుల సేవ, అతిధి అభాగ్యత సేవ ఇలా అన్ని నియమాలను ఎంతో శ్రద్దగా చేయడంతో తీర్థ యాత్రలకు వెళ్ళడానికి అసలు సమయం అనేది ఉండేది కాదు. దీంతో తీర్థ యాత్రలకు ఎవరు వెళ్లి వచ్చిన వారు ప్రయాణం గురించి, అక్కడి విశేషాల గురించి ఎంతో శ్రద్దగా అడిగి తెలుసుకునేవాడు.

ఒక రోజు ఒక సిద్ధుడు తీర్థయాత్రలకు వెళ్లి వచ్చాడని తెలుసుకొని అతడి దగ్గరకి వెళ్లి, స్వామి మీరు అతి చిన్న వయసులోనే ఎన్నో తీర్థయాత్రలు చేసారని విన్నాను, నాకూడా పవిత్ర పుణ్యక్షేత్రాలను ప్రత్యేక్షంగా చూడాలని కోరిక ఉంది. దానికి తగిన ఉపాయాన్ని తెలపండి అని ఆ సిద్ధుడిని అడుగగా, అప్పుడు ఆ సిద్ధుడు, మన శాస్రాలలో ఇలాంటి అవసరాల కోసమై సిద్దులు శక్తులు సంపాదించే విధానాలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి నువ్వు సులభముగా తీర్థయాత్రలకు వెళ్లి రావొచ్చు అని చెబుతూ, నా వద్ద ఒక పాద లేహ్యం ఉంది. దానిని నీవు నీ పాదాలకు పూసుకొని మనసులో కోరుకున్న ప్రదేశానికి వెళ్లి రావొచ్చు అని చెబుతాడు.

అప్పుడు ఆ అతడు ఆ పాద లేహ్యం తీసుకొని ఇంటికి వెళ్లి, తన ఇంట్లో పనులన్నీ పూర్తిచేసుకొని కుటుంబ బాధ్యత తన భార్యకి అప్పగించి సూర్యాస్తమయం లోపు ఇంటికి చేరుకోవాలని భావించి, తన పాదాలకు లేపనం రాసుకొని హిమాలయ పర్వతాల్లో ఉన్న పవిత్ర క్షేత్రాలను చూడాలనే ఉద్దేశంతో బయలుదేరుతాడు. ఇక అక్కడికి వెళ్లిన ప్రవరుడు అన్నిటి దర్శించి ఎంతో ఆనందించి తిరిగి ఇంటికి వెళ్లాలని సంకల్పించగా వెళ్లలేకపోతాడు. ఆ మంచు లో తన పాదాలకు ఉన్న లేపనం అనేది కరిగిపోతుంది. ఇక ఇలా జరగడంతో తన ఇంటికి ఎలా వెళ్ళాలి, ఇంటి దగ్గర నాకోసం అందరు ఎదురుచూస్తుంటారు? ఇలాంటి పరిస్థితుల్లో ఎం చేయాలనీ చింతిస్తుంటాడు.

ఆ సమయంలోనే వరూధినీ అనే గంధర్వ కన్య ప్రవరాఖ్యుని చూసి మోహించగా, ఆమెని సహాయం కోరగా, ఆమె తనతో పాటు ఇక్కడే ఉండిపొమ్మని చెప్పగా, అప్పుడు అతడు కోపం, బాధని, భయాన్ని వదిలి తాను అనునిత్యం పూజించే గార్హపత్యాగ్నిని ప్రార్ధించి తనని ఇంటికి చేరవేయాలని వేడుకొనగా, అప్పుడు గార్హపత్యాగ్నిని అతడిని తన ఇంటికి చేరుస్తాడు. కర్మసాక్షి అయినా ఆ భగవంతుడికి నమస్కరించి అనుష్ఠానాలు చేసుకుని ఇంట్లో వాళ్ళందరిని ఆనందపరుస్తాడు.

ఈ కథ ఆధారంగా, నిత్య కర్మలను, కర్తవ్యాలను ఆచరించిన ప్రవరుడిని రక్షించి అతని నిష్ఠకు అంతరాయం కలగకుండా భగవంతుడు కాపాడినాడు. అంతేకాకుండా ఒక సౌదర్యవతికి లొంగకుండా అతని మనోనిగ్రహం అసామాన్యం.

Exit mobile version