కర్ణుడిని సంహరించడం కోసం విష్ణువు చేసిన మాయ

0
76

పూర్వం సూర్యని పుత్రుడు కర్ణుడు, సహస్త్ర కవచాలు ధరించి సమస్త లోకాలను బాధలు పెడుతున్నాడు. అందరు కలిసి ఆ శ్రీహరిని శరణు కోరారు. కర్ణుని తపశ్శక్తి వల్ల అతన్ని చంపటం వీలుకాదని అనుకోని, విష్ణువు, నర, నారాయణుల ఇద్దరి రూపం ధరించాడు.

కర్ణుడుబద్రి ప్రాంతంలో వేయి సంవత్సరాలు తపస్సు చేసాడు. నారాయణరూపంలో, కర్ణునితో వేయి సంవత్సరాలు యుద్ధం చేసి ఒక కవచము దూరం చేసాడు. మరల నరుని రూపంలో యుద్ధం చేసి మరొక కవచము ఊడగొట్టాడు. ఇలా కర్ణుని కవచాలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఊడిపోగా, ఆ ఉన్న ఒక్క దానితో సూర్య మండలములో దాక్కున్నాడు కర్ణుడు. అప్పుడే ద్వాపరయుగము ప్రారంభమైంది. దూర్వాస మహర్షి మంత్ర ఫలితంగా సూర్యని వలన కర్ణుని తిరిగి కుంతి కన్నది. భూలోకానికి వచ్చిన కర్ణుని సంహరించడానికి నర నారాయణులు తిరిగి కిరీటి, కృష్ణులుగా జన్మించారు.

Indhruduఆ తరువాత శ్రీకృష్ణుడు ఇంద్రునిచేత కవచకుండలాలు దూరం చేయించి కర్ణుని సంహరించడం భారతంలో మనకు తెలుసు.

 

Contribute @ wirally

SHARE