నిమ్మకాయలోనే కాదు ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసా

ఇంట్లో పెంచుకునే అత్యుత్తమ ఔషధ మొక్కల్లో నిమ్మచెట్టు ఒకటి. నిమ్మకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అందరికి తెలుసు. నిమ్మకాయలోనే కాదు ఆకుల్లోనూ ఎన్నో ఔషధ గుణాలు వున్నాయి.

Medicinal properties of lemon leavesమానసిక సమస్యలకు గురయ్యేవారు నిమ్మ ఆకులను నలిపి ఆ వాసన పీలిస్తే ఒత్తిడి తగ్గి ఉత్సహాంగా ఉంటారు.

నాలుగు తాజా నిమ్మ ఆకులను గ్లాసు వేడినీటిలో మూడు గంటలు నానాబెట్టి తాగితే.. నిద్రలేమి సమస్య దూరం అవుతుంది.

Medicinal properties of lemon leavesకొన్ని నిమ్మ ఆకులను వేడి నీటిలో వేసి ఒక గంట నానబెట్టి తీసుకుంటే గుండెదడ, నరాల బలహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.

Medicinal properties of lemon leavesఅయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడినీటిలో నానాబెట్టాలి. ఇందులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి. అందుకోసం బ్యూటీ ప్రొడక్ట్స్‏లో కూడా వీటిని వాడుతుంటారు.

Medicinal properties of lemon leavesనీళ్లను వేడిచేసి అందులో గుప్పెడు నిమ్మ ఆకుల్ని వేసి.. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా నెలరోజులు చేస్తే మైగ్రేన్‌ తలనొప్పి, ఆస్మా వంటివి తగ్గిపోతాయి.అయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడినీటిలో నానబెట్టాలి.

Medicinal properties of lemon leavesనిమ్మఆకులను పేస్టుగా చేసి దానికి కాస్తా తేనే కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ముఖం మీద ఉన్న మచ్చలు, మొటిమలను తగ్గిస్తాయి.

వీటిని మెత్తగా నూరి పళ్లకు పట్టిస్తే.. నోటి దుర్వాసన పోతుంది. అంతేకాకుండా పళ్ళలో ఉండే బ్యాక్టీరియా నాశనమయ్యి.. దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.

Medicinal properties of lemon leavesస్నానం చేసే నీటిలో నిమ్మ ఆకులను వేసుకోని స్నానం చేస్తే చర్మ సమస్యలు తగ్గుతాయి.

అయితే వీటిని మరిగించకూడదు. కేవలం వేడినీటిలో నానబెట్టాలి.అంతేకాకుండా వీటిని హ్యాండ్ వాష్ లా కూడా వాడోచ్చు. ఆకుల్ని నలిపి చేతులకు రాస్తే.. బాక్టీరియా నశిస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR