Home Unknown facts ఆశ్చర్యంగా ఒక్క దీపావళి రోజు మాత్రమే ఈ ఆలయాన్ని ఎందుకు తెరుస్తారో తెలుసా?

ఆశ్చర్యంగా ఒక్క దీపావళి రోజు మాత్రమే ఈ ఆలయాన్ని ఎందుకు తెరుస్తారో తెలుసా?

0

మన దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ప్రతి పురాతన ఆలయాలలో ఏదో ఒక మహిమ అనేది ఉంటుందని చెబుతారు. అలానే ఈ ఆలయంలో ఎవరికీ అర్ధం కానీ ఆధ్భూతాలు ఉన్నాయి. అందుకే ఈ ఆలయాన్ని దైవం ఉనికిని చాటే ఆలయమని చెబుతారు. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ ఆలయాన్ని సంవత్సరంలో ఒక దీపావళి రోజున మాత్రమే తెరుస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? దీపావళి రోజున భక్తులకి దర్శనం ఇచ్చే ఆ ఆధ్భూతం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Hasanamba temple

కర్ణాటక రాష్ట్రం, హాసన్ అనే ప్రాంతంలో హాసనంబా ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీ.శ. 12 శతాబ్దంలో నిర్మించబడినదిగా చెబుతారు. ఈ ఆలయంలో హాసనంబా అనే దేవత పూజలను అందుకుంటుంది. అయితే ఈ ఆలయాన్ని దీపావళి రోజున మాత్రమే తెరిచి అమ్మవారికి పూజలు చేసి, దీపావళి అర్ధరాత్రి ఆలయాన్ని మూసివేస్తారు. ఇలా సంవత్సరం పాటు ఆలయాన్ని మూసివేసి మరల దీపావళి రోజు ఉదయాన్ని తెరుస్తారు.

ఇక్కడ ఆశ్చర్యకర విశేషం ఏంటంటే, దీపావళి రోజు అర్ధరాత్రి గర్భగుడిలో అమ్మవారి ముందు వెలిగించిన అమ్మవారి దీపాలు మల్లి సంవత్సరం తరువాత దీపావళి రోజు తెరిచేంతవరకు వెలుగుతూనే ఉంటాయి. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే గర్భగుడిలో వెలిగించిన దీపాలలో పొసే నెయ్యి లేదా నూనె మూడు లేదా నాలుగు రోజులకి వెలగడానికి సహాయపడవచ్చు కానీ సంవత్సరం పాటు ఆ దీపాలు ఎలా వెలుగుతున్నాయనేది ఇప్పటికి ఎవరికీ అంతుపట్టలేదు. ఇది ఆ క్షేత్రం యొక్క మహత్యం అని చెబుతారు.

ఈ అమ్మవారు మంచివారి పట్ల కరుణ చూపిస్తుంది. చెడు స్వభావం ఉన్నవారిని శిక్షిస్తుంది. అయితే తన భక్తురాలైన ఒక అమ్మాయిని పీడిస్తున్న ఆ అమ్మాయి అత్తగారిని ఆ అమ్మవారు శిలగా మాచేసిందని ఈ ఆలయం పురాణం చెబుతుంది. అలాగా శిలగా మారిన ఆ అమ్మాయి అత్తగారి శిలా ఇప్పటికి ఆలయ గర్భగుడిలో ఉంది. ఇక్కడ మరొక అంతుపట్టని విషయం ఏంటంటే ఆ శిలా ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహానికి దగ్గరగా ఒక్కో ఇంచ్ జరుగుతూ వస్తుందట. ఇక కలియుగాంతంలో ఆ శిలా అమ్మవారి పాదాల వద్దకు చేరుతుందని ఒక వృద్ధుడు చెప్పాడట.

ఇది ఇలా ఉంటె హాస్యం అంటే నవ్వు అని అర్ధం. హాసము అంటే కూడా నవ్వు అనే అర్ధం. ఇక్కడ వెలసిన అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ భక్తులకి వరాలని ప్రసాదిస్తుందని ఆ అమ్మవారికి హాసనంబా అనే పేరు వచ్చినది అని చెబుతారు.

Exit mobile version