Home Unknown facts దేశంలోని దేవాలయాలలో అత్యంత శక్తివంతమైన తాంత్రిక ఆలయం ఎక్కడ ఉంది ?

దేశంలోని దేవాలయాలలో అత్యంత శక్తివంతమైన తాంత్రిక ఆలయం ఎక్కడ ఉంది ?

0

మన దేశంలోని దేవాలయాలలో అత్యంత శక్తివంతమైన ఆలయం ఇదేనని చెబుతారు. అమ్మవారి 51 శక్తిపీఠాలలో ఈ ఆలయం ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో సతీదేవి కళ్ళు పడ్డాయని చెబుతారు. మరి ఈ మహిమ గల శక్తివంతమైన ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పశ్చిమబెంగాల్ రాష్ట్రం, తారపిత్ అనే ప్రాంతంలో తారాదేవి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని తాంత్రిక ఆలయంగా పిలుస్తారు. అందుకే ఇది తాంత్రిక ఆలయ పట్టణంగా పిలువబడుతుంది. తారపిత్ సాహిత్యపరంగా దేవత తారస్థానంలో కూర్చోవడం అని అర్ధం. బెంగాలీలో తారా అంటే కన్ను అని అర్ధం. అందుకే ఈ గ్రామానికి తారా అనే పేరు వచ్చింది.

అయితే సతీదేవి శక్తియొక్క సాక్షాత్కారానికి మరొక రూపం అని చెబుతారు. ఈ ఆలయం పాలరాయి గోడలను కలిగి ఉంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద దుర్గ, కాళీ వంటి శక్తి వివిధ అవతారాలు, హిందూమతం పురాణం నుండి కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఈ ఆలయం హిందూమతంలోని శక్తిత్వానికి చెందిన తాంత్రిక ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

మహాకాళియొక్క మరో రూపమే తారాదేవి. ఈమె దశమహావిద్యలలో ఒకరుగా వెలుగొందుచున్నది. గర్భాలయంలో ప్రతిష్టించిన తారాదేవి ఇచట సిల్కు వస్త్రము, పువ్వుల దండ మరియు ఆభరణములు ధరించి దర్శనం ఇస్తుంటుంది. అంతేకాకుండా గర్బాలయంలో తారాదేవి బాలశివునికి స్తన్యమిస్తున్నట్లు ఒక రాతిపై చెక్కిన శిల్పం ఒకటి కనిపిస్తుంది.

భామకేపియా అనే సాధువుకు తారామాత ఇక్కడ దర్శనం ఇచ్చిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారి పాదముద్రలు కూడా మనం చూడవచ్చు. అయితే ఈ పాదముద్రలు ఆలయం పక్కనే ఉన్న స్మశానం లో ఉన్నాయి. భక్తులు పాదముద్రలను కూడా భక్తితో దర్శిస్తారు.

ఇంతటి మహిమ గల ఈ పవిత్ర ప్రదేశాన్ని దర్శించడానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.