Home Health మోదుగ చెట్టు సర్వం మానవ ఉపయోగార్థమే!

మోదుగ చెట్టు సర్వం మానవ ఉపయోగార్థమే!

0

మోదుగ పూలంటే పల్లెటూళ్లలో ఉండే వాళ్ళకే కాదు పట్నం వాసులకీ పరిచయమే. నారింజరంగుతో, ఎర్రని గుత్తుల ఈ పూలు కనువిందుచేస్తాయి. చాలా తమాషాగా వుంటాయి. కొక్కేలలాగా, కొద్దిగా చిలుకముక్కుల్లాగా వుంటాయి పూలు, ఆకులేకనిపించనట్లు నిండుగాపూస్తాయి. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబం లో బుటియా ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా. మోదుగ చెట్టును కింశుక వృక్షము అని కూడ అంటారు. అంతేకాక భారతీయభాషల్లో దీనిపేర్లు ఇలావున్నాయి.

moduga treeమోదుగ ఎత్తుగా పైకి పెరిగే వృక్షం. ఈ చెట్టు దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. మృదువైన కేశరాలతో వుంటాయి. ఈ మోదుగ పూలేకాక చెట్టు కూడా ఎంతగానో ఉపయోగపడి తన త్యాగగుణాన్ని చాటుకుంటుంది. వేసవి ప్రారంభానికి చెట్లు ఆరంజిరంగులో నిండుగా పూలతో కళకళలాడుతూ సూర్యుణ్ణి ఆహ్వానిస్తాయి. మోదుగు ఆకులను, కాడలను, కొమ్మలను కూడా, మోదుగు పువ్వులను హిందువుల పూజల్లో ఉపయోగిస్తాం. ఇంటిలో చెడు పోగొట్టను ఎండిన మోదుగు కొమ్మలను విరిచి కాలుస్తారు. వాటి ద్వారా వచ్చే పొగ ఇంట్లో వుండే చెడుహరిస్తుందని నమ్మకం. ఈ పువ్వులు ఒక రకమైన సువాసతో చూస్తే మనసుకు ఎంతో ఆనందం కకలిగిస్తాయి.

ఈ పువ్వులు పరమశివుడికి అత్యంత ఇష్టం. అందుకే శివాలయాల్లో పూజలు చేసే క్రమంలో పూజారులు మోదుగు పువ్వులను శివుడికి సమర్పిస్తుంటారు. అంతేకాదు మోదుగు పువ్వులో వచ్చే కొద్ది పాటి నీటి బిందువులను సైతం శివుడికి ప్రీతిపాత్రంగా భావిస్తారు.ఇక మోదుగు పువ్వులకు హోలీ పండుగకు విడదీయరాని బంధం ఉంది. కొన్నేళ్ళ క్రితం హోలీ పండుగ వస్తుందంటే, వారం రోజుల ముందుగానే పిల్లలు,యువకులు మోదుగు పువ్వులను తీసుకొచ్చి నీటిలో నానబెట్టేవారు.తర్వాత రేపు హోలీ పండుగ అనగా బాగా ఉడకబెట్టేవారు. ఉడికిన తర్వాత వచ్చే రంగునీళ్లను చల్లారిన తర్వాత సీసాల్లో, డబ్బాల్లో నింపుకునేవారు. హోలీ పండుగకు రసాయన రంగుల కన్నా మోదుగు పువ్వుల ద్వారా వచ్చే రంగునీళ్లను వాడడం వల్ల చర్మరోగాలు రావు.

మోదుగ కాయలను వైద్యంలో వాడుతారు. మోదుగ నూనె, ఆకులు, విత్తనాలు కూడా ఆయుర్వేదంలో అనేక ఔషధాలుగా ఉపయోగిస్తారు. మోదుగ ఆకులలో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబయాల్ లక్షణాల వలన మూత్ర సమస్యలు, ఫైల్స్ , ఇన్ఫెక్షన్స్ చర్మ సమస్యలు నివారించడానికి అద్భుతంగా పని చేస్తాయి. మోదుగ కషాయాలు తాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఉబ్బసానికి ఈ చుట్టు జిగురును ఎండబెట్టి పొడి చేసి రోజుకు రెండు గ్రాములు తీసుకోవడం వలన ఉబ్బసం తగ్గుతుంది. మోదుగ ఆకులను తీసుకొని గ్లాసు నీటిలో వేసి మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న కషాయాన్ని పుక్కిల్లించడం ద్వారా నోటి సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఈ గోరువెచ్చగా ఉన్న కషాయం నోటి లో వేసుకునే ప్రేష్నర్ గా ఉపయోగించుకోవచ్చు. నోటి పూత లను తగ్గిస్తుంది.

మోదుగ జిగురు విరోచనాలలో, డీసెంట్రీ లలో బాగా ఉపయోగపడుతుంది. పిల్లల్లో వచ్చే విరోచనాలలో బాగా ఉపయోగపడినట్టు పరిశోధకులు చెబుతున్నారు.ఇది కడుపులోఉండే ఎలాంటి క్రిమినైనా హరిస్తుంది.
మోదుగ విత్తనాల్ని పొడిగా చేసి దానిలో కొద్దిగ తేనెని కలిపి తిసుకుంటే ఉపయోగకరంగా ఉంటుంది. ముఖంగా ఎన్ని మందులకీ లొంగని ఏలికపాములు, బద్దె పురుగు (టేప్ వార్మ్) లాంటి మొండి ఘటాలకు కూడా మోదుగ చాలా చక్కగా పనిచేస్తుంది. చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది అటువంటివారికి మోదుగ విత్తనాల పొడిని తేనెలో కలిపి ఇవ్వడం ద్వారా వెంటనే ఉపశమనం లభిస్తుంది.

ఇప్పట్లో అందరూ ఎక్కువ ఇబ్బంది పడుతున్న సమస్య మొలలు. దీన్నే ఇంగ్లీష్ వైద్యంలో ఫైల్స్ అంటారు. ఆపరేషన్ తప్ప నివారణ లేదు అని చెప్పే ఈ సమస్యకు మోదుగ మంచి పరిష్కారం.మోదుగ చెట్టు కాడలను తెచ్చి మెత్తగా నూరి మొలల మీద వేసి కట్టు కట్టాలి. ఇలా చేస్తూ ఉంటే మొలలు ఊడిపోతాయి. ​ఇలా వారం రోజుల పాటు చేయడం వలన ఈ సమస్యకు కు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.

మోదుగ గింజలను జిల్లేడు పాలతో కలిపి బాగా నూరి తేలు కుట్టిన చోట రాయాలి. దీనివల్ల తేలు కుట్టినపుడు కలిగే నొప్పి తొందరగా తగ్గిపోతుంది. ఏనుగు గజ్జి అనే చర్మవ్యాధి (ఏక్జిమా) వచ్చినవారికి, మోదుగ విత్తనాల పొడిలో, కొద్దిగా నిమ్మరసాన్ని కలిపి రాస్తే ఉపశమనం కనిపిస్తుంది. డయాబెటిస్ సమస్యకు మోదుగ ఆకులు శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాయి.. మోదుగ ఆకులు ఎండబెట్టి పొడిచేసి ఆ పొడిని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లోకి వస్తాయి.. మూత్రం లో షుగర్ సమస్య ఉన్నవాళ్లకు మోదుగ ఆకుల పొడి చక్కని పరిష్కారం. రక్తంలో కనిపించకుండా కేవలం మూత్రం లోనే చక్కెర ఉండే గ్లైకోజ్ యూరియా లాంటి పరిస్థితుల్లో ఇది బాగా ఉపయోగకరంగా ఉన్నట్లు తెలుస్తుంది.

సాధారణంగా యజ్ఞాలు, యాగాలు జరిగే చోట మోదుగచెట్టును హోమద్రవ్యంగా వాడతారు. మోదుగలో ఔషధ గుణం నెయ్యిలో మండటం వల్ల ద్విగుణీకృతం చెంది యాగాలలో వెలువడే పొగ పీల్చడం వల్ల అనేక జబ్బులు నయమవుతాయి. ఈ మోదుగ చెట్టు బెరడు కారం, చేదు, వగరు రుచులు కలిగి ఉంటుంది. దీన్ని ఔషధంగా తీసుకోవడం వల్ల ప్లీహ రోగాలు, శ్లేష్మ రోగాలు, మూల వ్యాధులు నయమయిపోతాయి.

ఈ మోదుగ చెట్టు కలపను ప్యాకింగ్ పెట్టెలతయారీకి వాడుతారు. తుపాకిమందుకు ఈ కర్ర బొగ్గు ఉపయోగపడుతుంది. ఈ చెట్టు బంక టానింగ్, రంగుల అద్దకంలోనూ వాడుతారు. కాండం యొక్క బెరడును కూడా పరిశ్రమలో ఉపయోగిస్తారు. బెరడునుండి నార తీస్తారు.

Exit mobile version