శివుడు త్రినేత్రుడు అని అందరికి తెలిసిన విషయమే అయితే ఈ ఆలయంలో వెలసిన అమ్మవారు మూడు కన్నులతో దర్శనం ఇస్తూ భక్తులను ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఇక్కడ కొలువై ఉన్న ఆంజనేయుడి విగ్రహానికి కూడా ఒక విశేషం అనేది ఉంది. మరి ఆ అమ్మవారు ఎవరు? ఆ ఆలయం ఎక్కడ ఉందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.పశ్చిమబెంగాల్ రాష్ట్రంరాజకటర లో హౌరా బ్రిడ్జ్ దగ్గర పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం ఉంది. పంచముఖ ఆంజనేయ స్వామిగా పిలువబడే ఈ స్వామి వారి మూడు ముఖములు మాత్రమే మనకి కనిపిస్తాయి. ఈ స్వామివారి ఒక ముఖం ఆకాశం వైపు చూస్తునట్లుగా ఉంటుంది. రెండవ ముఖం విగ్రహానికి వెనుక భాగాన ఉంటుంది.ఇక ఈ ఆలయంలోనే కాళికాదేవి గుడి ఉంది. ఇది సతీదేవి తల వెంట్రుకలు పడిన చోట వెలసిన శక్తి పీఠంగా ఇక్కడి భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలోని కాళీమాతకు మూడు కళ్ళు ఉంటాయి. రౌద్రరూపం, పుర్రెల హారంతో చేతులలో ఆయుధాలు ధరించి, భగీరథి నది తీరములో ఈ ఆలయం ఉంది.ఈ ఆలయంలో శనివారం, మంగళవారం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయ ప్రాగణంలో హజార భుజాకాళి, సర్వమంగళ, తారసుందరి, సింహవాహిని మొదలగు దేవతామూర్తులకు ప్రత్యేకముగా ఉన్న ఆలయాలు కూడా ఉన్నాయి.ఇలా మూడు కన్నులతో దర్శనం ఇచ్చే కాళికామాతని దర్శించుకోవడానికి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.