శాపం కారణంగా మొగలిపూవు పూజకు అర్హత లేకుండా మారిందా ?

పూర్వం బ్రహ్మ విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్పని వాధించుకుంటారు. వాదన ఎంతకీ తేలకపోయేసరికి పరమశివుడు వాళ్ళ కళ్ళు తెరిపించాలనుకుంటాడు. అప్పుడు వారి మధ్య శివుడు శివలింగ రూపంలో పుట్టి బ్రహ్మను, నా శిరస్సు ఎక్కడుందో కనుక్కోమని చెప్తాడు. విష్ణువును నా పాదాలేక్కడున్నాయో కనుక్కోమని ఆదేశిస్తాడు. హంసరూపంలో బ్రహ్మ పైకి, ఆదివరాహరూపంలో విష్ణువు క్రిందికి వెళ్లారు.

Vishnuబ్రహ్మకు లింగంశిరస్సు, విష్ణువునకు లింగపాదాలు కన్పించలేదు. మన్వంతరాలు తిరిగిపోయాయి. ఇద్దరూ తిరిగి తిరిగి పోరాడుకున్న స్థలానికే వచ్చారు. విష్ణువు నాకు లింగంపాదాలు కనిపించాలేదన్నాడు. బ్రహ్మ తానూ ఎలాగైనా గెలవాలి అన్న ఆశతో లింగం శిరస్సు చూసానని మొగిలిపూవును, కామధేనువును వెంటబెట్టుకొని వచ్చాడు. మొగలిపూవుచేత చూసినట్లు సాక్ష్యం చెప్పించాడు. ప్రలోభానికి లోనై మొగలిపూవు అబద్ధం చెబుతుంది. కామధేనువుని అడగ్గా అది తన తోకను అడ్డంగా ఊపి ఇది అబద్ధమని తెలియజేసింది.

మొగలిపూవుఅప్పుడు విష్ణువు మొగలిపూవు అబద్ధం చెప్పింది కనుక అది పూజకర్హం కాదనీ శాపం పెట్టాడు. కామధేనువు వెనుక భాగంతో సత్యం తెలిపింది కనుక ఆవుకు వెనుకభాగం పూజార్హమగుగాక అని వరం ఇస్తాడు.

Kamadenuvuఅందువల్ల మొగలి పూవు పూజకర్హం కాకుండా పోయింది. ఆవు వెనుకభాగమే పూజింపబడుతోంది. మల్లె, గులాబీ మొదలైన పూవులు కూడా పూజకు అర్హత లేనివే. మల్లె కేవలం అలంకారానికి మాత్రమే.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR