తన గ్రామం కోసం ప్రాణ త్యాగం చేసిన ముసలమ్మ..!

భారతావని ఎన్నో సంస్కృతులకు, మతాలకు నిలయం. ఇక్కడ ఎన్నో గొప్ప కట్టడాలున్నాయి. ఈ గడ్డపైనే ఒక మహాత్యం ఉందని ప్రజలు విశ్వసించడానికి పురాతనకాలంలో నిర్మించిన ఆలయాలు కూడా ఒక కారణం. మనదేశంలో ఉన్న దేవాలయాలకు ఎన్నో చరిత్రలు ఉన్నాయి. ఆ దేవాలయాల నిర్మించడం వెనుక ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉంటాయి.
అలాంటి ప్రాచుర్యంలో ఉన్న కథ ముసలమ్మ కథ. ముసలమ్మ అనే మహిళా ఊరి కోసం ప్రాణత్యాగం చేసిన వీర వనితగా చరిత్రలో మిగిలిపోయింది.
ప్రస్తుతం ఈమెను ఒక దేవతగా భావించి పెద్ద ఎత్తున ఆమెకు ఆలయం నిర్మించి ప్రతి రోజూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఊరి కోసం ప్రాణత్యాగం చేసిన వీరనారి కథ ఏమిటి? ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది అనే విషయాలు తెలుసుకుందాం…
పూర్వం అనంతపురం జిల్లా సమీపంలోని బుక్కరాయసముద్రం అనే గ్రామంలో ఒక పెద్ద చెరువు ఉండేది. తీవ్ర వర్షం కారణంగా చెరువు మొత్తం నిండిపోయింది. అయినా కూడా వర్షం ఆగకుండా కుండపోతగా కురుస్తుడడంతో ఆ చెరువు కట్ట తెగిపోయి నీరు మొత్తం ఊరిలోకి ప్రవేశిస్తున్నాయి.
దీంతో ఎంతో భయభ్రాంతులకు గురైన గ్రామ ప్రజలు గ్రామ దేవత అయిన పోలేరమ్మను తమ గ్రామం చల్లగా ఉండాలని ప్రార్థించారు. ఇంతలో చెరువు చుట్టూ చేరిన ప్రజలను ఉద్దేశించి ఆకాశవాణి మాట్లాడుతుంది.
ఈ ప్రమాదం నుంచి గ్రామ ప్రజలను కాపాడాలంటే అదే ఊరిలో నివసిస్తున్న బసిరెడ్డి చిన్న కోడలు ముసలమ్మని చెరువుకట్టకు బలి ఇస్తే చెరువు కట్ట నిలుస్తుందని చెబుతోంది.
ఈ విధంగా ఆకాశవాణి చెప్పడంతో తన గ్రామ ప్రజలను కాపాడటం కోసం ముసలమ్మ ప్రాణత్యాగానికి సిద్ధమైంది. తన ప్రాణ త్యాగం చేయడం కోసం భర్త, అత్తమామల అనుమతి తీసుకోవడమే కాకుండా గ్రామ ప్రజల అనుమతి కూడా తీసుకొని ప్రాణత్యాగానికి సిద్ధపడింది. ముసలమ్మ తన కొడుకును తన భర్త చేతిలో ఉంచి ఆ భగవంతుని ప్రార్థిస్తూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
ఈ విధంగా ముసలమ్మ ఆత్మహత్య చేసుకోవడంతో చెరువు కట్ట నిలిచి ఊరంతా ప్రమాదం నుంచి బయటపడిందని పురాణ కథలు చెబుతున్నాయి. ఇప్పటికీ కూడా అనంతపురం సమీపంలోని చెరువు కట్ట కింద ముసలమ్మ కొలువై ఉండి భక్తులను కోరిన కోరికలను నెరవేరుస్తూ ఎంతో ప్రసిద్ధి చెందిన దేవతగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయాన్ని సందర్శించడం కోసం చుట్టుపక్కల నుంచి భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని అమ్మవారి ప్రత్యేక పూజలలో పాల్గొంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR