Home Health హైబిపిని అదుపులో ఉంచడం కోసం ఇవి తప్పక పాటించండి ?

హైబిపిని అదుపులో ఉంచడం కోసం ఇవి తప్పక పాటించండి ?

0

ప్రస్తుత కాలంలో అధిక రక్తపోటుతో బాధపడే వారి సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఎవరిని పలకరించినా హై బి.పి ఉందని అంటున్నారు. హై బి.పి. నే హైపర్ టెన్షన్ అని కూడా అంటారు. విషయమేమిటంటే మనలో చాలా మంది హై బి.పి. ఉందన్న విషయం తెలియకుండానే గడిపేస్తుంటాం. హై బి.పి. లక్షణాలు అంత తేలిగ్గా తెలియవు. హై బి.పి వల్ల ఆరోగ్యానికి జరిగే నష్టం అంతా ఇంతా కాదు, దాని ప్రభావం శరీరానికి ముఖ్య అవయవాలైన గుండె, కిడ్నీల పైనే మొదట పడుతుంది. అంతే కాదు ఈ హై బి.పి. ఒక లెవెల్ దాటిందంటే హార్ట్ ఎటాక్ వచ్చి ప్రాణాంతకమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.

హైబిపిఅధిక రక్త పోటు లేదా హైపర్టెన్షన్ అనేది ఒక అంటు వ్యాధిలా ప్రపంచం మొత్తం వ్యాపిస్తోంది. మారుతున్న జీవన విధానం, ఫాస్ట్ ఫుడ్ పై ఆధారపడటం, ఒత్తిడి వంటివి భారత దేశం లో ని అధిక రక్తపోటు కి కారణాలు. ప్రతి ముగ్గురు భారతీయులలో ఒకరు అధిక రక్త పోటు సమస్య తో బాధపడుతున్నారు. దీని వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్ మరియు మూత్ర పిండాల సమస్యలు వస్తాయి. ఇలా ఒక్క కారణం చేత వివిధ రకాల ప్రాణాంతక వ్యాధుల భారీన పడకుండా బిపిని కంట్రోల్ చేసుకోవడానికి లేదా పూర్తిగా హైబిపిని తగ్గించుకోవడానికి వంటింట్లో దొరికే ఆహారాలు అద్భుతంగా సహాయపడుతాయి

సాధారణంగా ఆరోగ్యవంతుల రక్త పోటు సిస్టోలిక్ ప్రెషర్ 90 నుండి 120 మి.మీ గాను, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ 60 నుండి 80 మి.మీ గాను నమోదు కావచ్చు. అలాగే సాధారణ వ్యక్తిలో రక్తపోటు ఉదయం నుండి సాయంత్రానికి కొన్ని మార్పులు చెందుతుంటుంది. మానసిక వత్తిడులు కూడా బి.పి ని ప్రభావితం చేస్తాయి.

ఖర్బూజ : హై బిపి నివారణలో ఖర్బూజ చాలా ముఖ్యమైన ఆహారం, ఖర్బూజా గింజలను రోస్ట్ చేసి లేదా ఎండబెట్టి తినడం వల్ల రక్త నాళాల్లో ఉన్న ప్రెజర్ తగ్గి బి.పి. కంట్రోల్ లో ఉంటుంది.

నిమ్మకాయ: నిమ్మకాయ హై బి.పి. ఉన్నవారికి చాలా విలువైన ఔషధం. ఎందుకంటే నిమ్మకాయలో ఉండే విటమిన్ సి , బి. పి. ని కంట్రోల్ చేసి, రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది

వెల్లుల్లి: హై బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో వెల్లుల్లి ఔషధంలా పని చేస్తుంది. అది బి.పి. ని తగ్గించి శరీరంలోని జీవక్రియలను సమతుల్యం చేస్తుంది . పల్స్ రేట్ , గుండె వేగాన్ని అదుపులో ఉంచుతుంది . అంతేకాదు రోజు ఉదయాన్నే పరగడుపున మూడు వెల్లుల్లి రేకులను మింగితే రోజంతా చలాకీగా ఉంచి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా దరి చేరకుండా చూస్తుంది.

బ్రౌన్ రైస్: చాలామంది కాస్త బరువు పెరగానే అన్నం తినడమంటేనే భయపడుతుంటారు , కానీ బ్రౌన్ రైస్ లో ఉండే కాల్షియం, శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అందునా హై బి.పి ఉన్నవారికి ఇది పూర్తిగా సోడియం రహిత ఆహారం, కాబట్టి నిర్భయంగా తినవచ్చు. ఇది నరాలను రిలాక్స్ చేసి రక్తప్రసరణను క్రమబద్ధం చేస్తుంది.

కొత్తిమీర: కొత్తిమీర లో ఉన్న ఔషధ గుణాలు బి.పి. ని అదుపులో ఉంచుతాయి. కొత్తిమీర జ్యూస్ ను రోజుకు ఒకసారి తాగినా చాలు, బి పి కంట్రోల్ లో ఉంటుంది.

కూరగాయలు: కూరగాయల జ్యూస్ ముఖ్యంగా క్యారట్ జ్యూస్ గానీ, పాలకూర జ్యూస్ గానీ కలిపి గానీ విడివిడి గా కానీ తీసుకోవడం వల్ల బి.పి. పేషెంట్స్ కి చాలా రిలీఫ్ గా ఉంటుంది. 300 మీ.లీ. ల క్యారట్ జ్యూస్ మరియు 200 మీ.లీ. పాలకూర జ్యూస్ 500 మి.లీ. లీటర్ నీటిలో కలిపి రోజూ తాగడం వల్ల బి పి లెవెల్ లో ఉంటుంది.

బంగాళాదుంప: బంగాళా దుంపలు బి.పి. ని కంట్రోల్ లో ఉంచడంలో అద్భుతంగా పని చేస్తాయి. బంగాళాదుంపల పొట్టు తీయకుండా ఉడికించడం వల్ల అందులో ఉండే పొటాషియం వల్ల ఉప్పు వేయకపోయినా ఉడికిన బంగాళాదుంపలు ఉప్పగా ఉండి రుచిగా ఉంటాయి. కాబట్టి బంగాళా దుంపలను రోజుకు ఒకసారైనా ఆహారంలో భాగమయ్యేలా చూసుకోవాలి.

ఉసిరికాయ: ఉదయం పూట పరగడుపునే ఒక టేబుల్ స్పూన్ ఉసిరి రసంలో కాస్త తేనె కలుపుకుని తాగితే బి. పి. లెవెల్ కంట్రోల్ అవుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

పైన చెప్పిన డైట్ తో పాటు మరొక సలహా ఏమిటంటే హై బి.పి ఉన్నవారు తినే రొటీన్ ఆహారంలో కాల్షియం , ఉన్న ఆహారాన్ని ఎంచుకోవడంతో పాటు సోడియం ఉన్న ఆహారాన్ని పూర్తిగా వదిలేసినా మంచిదే.

మరొక ముఖ్య గమనిక : హై బి. పి కేవలం మనం తినే ఆహారం వల్లే కాదు, నిద్ర సరిగ్గా లేకపోయినా, స్ట్రెస్ ఎక్కువైనా తిరగబడే అవకాశముంది, కాబట్టి ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.

అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సోయా లేదా మిల్క్ ప్రొటీన్ బాగా ఉపయోగపడుతుందని శాస్త్రవ్తేల తాజా పరిశోధనల్లో వెల్లడయింది.

 

Exit mobile version