Home Unknown facts ముంతాజ్ గురించి తాజమహల్ గోడలపై చెక్కిన విషయాలు ఏంటో తెలుసా

ముంతాజ్ గురించి తాజమహల్ గోడలపై చెక్కిన విషయాలు ఏంటో తెలుసా

0

ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా ఖ్యాతిని సొంతం చేసుకున్న ఆ అందాల కట్టడమే తాజ్ మహల్. అది 17వ శతాబ్దంలో తన ప్రేమకు చిహ్నంగా షాజహాన్ తన ప్రియురాలు ముంతాజ్‌కు కట్టించారని మనం పుస్తకాల్లో చదివాం. దాని గురించి అంతవరకే అందరికీ తెలుసు. అయితే ఆ అందాల కట్టడంలో అబ్బురపరిచే రహస్యాలు కొన్ని ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి.

Mysteries about the Taj Mahalతాజ్ మహల్ కట్టడంలో అణువణువు చేతి వ్రాతలు కనిపిస్తాయి. దాదాపు 99 పేర్లు అల్లా గురించి ఉంటాయి. ఈ ఆర్కిటెక్చర్ ను చూసి చాలామంది ఇప్పటికీ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఇంత అందంగా ఎలా అక్కడ రాసారనేది అబ్బురపరిచే రహస్యంగానే ఉంది. అయితే వాటితో పాటు ముంతాజ్ ఆత్మకు సంబంధించిన కొన్ని వ్యాఖ్యలు కూడా మనం తాజ్ మహల్ గోడలపై చూడొచ్చు.

తాజ్ మహల్ ముంతాజ్ సమాధిపై కట్టబడింది. కాబట్టి ఆమె ఆత్మ తాజ్ మహల్ లోనే ఉంది అని నమ్ముతారు. అందుకే ఆమె ఆత్మను శాసించేలా కొన్ని నగిసి భాషలో కొన్ని వ్యాఖ్యలు చెక్కించారట. వాటి అర్థం ఏమిటంటే… ముంతాజ్ నీ ఆత్మ దేవుడిని చేరుకుంది. ఆ దేవుడు నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి నీవు ప్రశాంతంగా ఉండు. అని నగిసి భాషలో రాసి ఉంటుంది.

ఇవే కాదు తాజ్ మహల్ కి సంబంధించి ఇంకా ఎన్నో రహస్యాలు వెలుగులోకి రాలేదు. తాజ్ మహల్ లో వున్న పలు ఆర్చ్ ల వెనుక చతురస్రాకారంలో సొరంగమార్గాలున్నాయి. వాటి గుండా వెళితే రహస్యగదుల్లోకి కూడా వెళ్ళొచ్చట. అలా వెళితే ఏకంగా 1080గదులు వస్తాయి.అయితే వాటిలోకివెళితే మళ్ళీ తిరిగిరావటం చాలా కష్టతరమవుతుంది. ఎందుకంటే అవన్నీ అంతటి పద్మవ్యూహంలా వుంటాయి. మరి ఆ గదుల్లోకి ఎవ్వరూ వెళ్లకూడదని వాటిని ఇటుకలతో, రాళ్ళతో సీజ్ చేసారంట. అవన్నీ చాలా గాడాంధకారంలోవుంటాయి. వాటిల్లోకి వెళ్లేందుకు ఎవ్వరూ సాహసంకూడా చెయ్యరు.

 

Exit mobile version