Home Unknown facts తిండి, నీరు లేకుండానే గాలిని పిలుస్తూ యోగ చేస్తూ జీవిస్తున్న బాబా

తిండి, నీరు లేకుండానే గాలిని పిలుస్తూ యోగ చేస్తూ జీవిస్తున్న బాబా

0

భారతదేశంలో హిమాలయాపర్వతాల్లో సిద్ద యోగులు ఇప్పటికి నివసిస్తుంటారని చెబుతుంటారు. అయితే చిన్నవయసులోనే ఇంటినుండి వెళ్ళిపోయి యోగిగా మారిన ఈ బాబా తనకి ఊహ తెలిసిన దగ్గరి నుండి ఇప్పటివరకు తిండి, నీరు లేకుండానే గాలిని పిలుస్తూ యోగ చేస్తూ జీవిస్తున్నాడు. మరి ఈ బాబా ఎవరు? ఆయన్ని రెండుసార్లు పరీక్షించిన వైద్యులు ఏమని చెప్పారు? ఆ బాబా గురించి మరిన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mystery Baba Prahlad Jani

గుజరాత్ రాష్ట్రం, మోహసానా జిల్లా, చరోడ్‌ అనే గ్రామంలో ప్రహ్లాద్ జాని జన్మించారు. అయన తనకి 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇల్లు వదిలేసి అడవుల్లోకి వెళ్ళిపోయాడు. ఇలా తనకి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుండి అంబా దేవతని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఈవిధంగా అంబా మాతని విపరీతంగా ఆరాధిస్తూ అమ్మవారిలానే తాను కూడా చీరని ధరించి, జుట్టుకి పూలను పెట్టుకుంటూ పూర్తిగా అమ్మవారి లానే అలంకరణ చేసుకునేవారు. ఇక గుజరాత్ అడవుల్లో అంబాజీ మాత ఆలయం ఉండగా, ఆ ఆలయంలోనే నివసిస్తూ ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉండేవారట. తనకి ఆకలి అయితే స్వయంగా అమ్మేవారు తన ఆకలి తీరుస్తారని, తన నుదుటి పైన ఆ మాత నీటి బిందువు జారవిడిచి తన ఆకలి ని పోగొట్టెదని అయన చెబుతారు.

ఈవిధంగా 1970 తరువాత అడవుల్లో అమ్మవారి ఆలయం దగ్గర నివసిస్తున్న బాబా గురించి తెలియడం మొదలవ్వగా, ఎలాంటి ఆహారం, కనీసం నీరు కూడా తీసుకోకుండా ఒక బాబా జీవిస్తున్నాడనే వార్త అందరికి తెలియడంతో బాబా గారు వెలుగులోకి వచ్చారు. ఇలా ఒక మనిషి ఇన్ని సంవత్సరాలుగా ఎలాంటి ఆహారం, నీరు లేకుండా జీవించడం అసాధ్యమని కొందరు భావించగా 2003 లో ఆయనపై పరిశోధనలు చేసారు. స్టెర్లింగ్ హాస్పిటల్ లో డాక్టర్ సుధీర్ షా బాబాని 10 రోజుల పాటు ఒక గదిలో ఉంచి పరిశోధనలు చేసారు. అయితే ఈ 10 రోజులు ఎలాంటి మలమూత్ర విసర్జన చేయకుండా, కదలకుండా ఉండిపోయారు కానీ కొంచం బరువు తగ్గినట్లుగా వారు భావించారు. దీంతో ఎలాంటి ఆహారం తీసుకోకుండా 10 రోజులు ఉండటం వలనే కొంచం బరువు తగ్గివుండొచ్చని కొందరు అనుమానం వ్యక్తం చేయగా, ఒక మనిషి ఎం తీసుకోకుండా కనీసం నీరు కూడా తాగకుండా 10 రోజులు ఉండగా, రిపోర్ట్స్ కూడా మాములుగా రావడంతో అయనకి ఏదో శక్తి ఉందని నమ్మేవాళ్లు కూడా పెరిగిపోయారు.

ఇలా అప్పటికి ఎన్నో అనుమానాలు ఉన్నాయని భావించి బాబా పై మళ్ళీ 2010 లో పరిశోధనలు చేసారు. ఈసారి డాక్టర్ సుధీర్ షా తో పాటు మరొక 35 మంది డాక్టర్లు, కొన్ని సంస్థలు కలసి 2010 ఏప్రిల్ 22 నుండి మే 6 వరకు ఒక గదిలో సీసీ కెమెరాలు పెట్టి రక్త పరీక్షలు, స్కానింగ్స్ అంటూ కొన్ని పరీక్షలు చేయగా 15 రోజులు చేసిన పరీక్షల్లో రిపోర్ట్స్ మాములుగా రాగ, ఒక్క రోజు కూడా బాబా గారు మూత్ర విసర్జన అనేది చేయలేదు.

ఇక 2006 లో డిస్కవరీ ఛానల్ వారు ఆయన్ని 5 నిముషాలు ఇంటర్వ్యూ చేసి, ది బాయ్ విత్ డివైన్ పవర్స్ అని ఒక డాక్యుమెంటరీ చేయగా, 2010 లో ITN ఛానెల్ వారు ఒక ఆర్టికల్ ఇంకా ఒక వీడియో ని ఆయన గురించి చేసారు. ఇంకా మళ్ళీ అయన పైన చేసే పరీక్షల కోసం ఆస్ట్రియా, జర్మనీ, అమెరికా కి చెందిన శాస్త్రవేత్తలు ఆసక్తిని చూపెట్టగా వారు చేయబోయే పరీక్షలకు బాబా గారు సహకరిస్తానని చెప్పారు.

ఇది ఇలా ఉంటె, పూర్తి అమ్మవారి అలంకరణతో దర్శనం ఇచ్చే ఈ బాబాని భక్తులు మాతాజీ అని చుందాదివాలా మాతాజీ అని పిలుస్తారు. రోజులో 12 గంటలు ధ్యానంలో ఉండే మాతాజీ గారు 90 ఏళ్ళ వయసులో కూడా కొన్ని కిలోమీటర్లు నడిచిన ఆయనకి అలసట అనేది రాదని చెబుతున్నారు.

ఇలా తిండి, నీరు లేకుండా ధ్యానం లో బ్రతుకుతూ అంబా మాతని పూజిస్తున్న ఒక మనిషి ఇన్ని సంవత్సరాలుగా తినకుండా బ్రతకడమే కాదు, అతని జీర్ణక్రియ కూడా మాములు మనిషి వలె అన్ని సరిగ్గా పనిచేస్తున్నాయని వైద్య పరీక్షల్లో కూడా తేలడంతో మాతాజీ అందరివలె మాములు మనిషి కాదని ఆ స్వామికి అమ్మవారి అనుగ్రహం ఉందని కొందరి భక్తుల నమ్మకం.

Exit mobile version