ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తర హిమాలయాల్లో సముద్రమట్టానికి 4778 మీటర్ల ఎత్తులో సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక సరస్సు ఉంది. దీనినే రూప్ కుండ్ సరస్సు, అస్థిపంజరాల సరస్సు, మిస్టరీ సరస్సు అని పిలుస్తుంటారు. ఈ సరస్సు లోని నీరు సంవత్సరంలో 11 నెలలు గడ్డకట్టుకొని ఉంటుంది. వేసవి కాలంలో ఒక నెల మాత్రం సరస్సులోని నీరు కనిపిస్తుంది. మరి కొన్ని సంవత్సరాల నుండి మిస్టరీగా మారిన ఈ రూప్ కుండ్ సరస్సు పైన పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఏమని తేల్చారనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్ లోని చమేలీ జిల్లాలో ఉత్తరహిమాలయాల్లో సముద్రమట్టానికి 4778 మీటర్ల ఎత్తులో రూప్ కుండ్ సరస్సు ఉంది. ఈ సరస్సు అంతకుడా అస్థిపంజరాలతో నిండి ఉంటుంది. అయితే ఇవి 9 వ శతాబ్దానికి చెందినవని దాదాపుగా 1100 సంవత్సరాల క్రితం నాటి అస్థిపంజరాలుగా వీటిని గుర్తించారు. ఇక్కడ మొత్తం 600 అస్థిపంజరాలు ఉండగా అన్ని సంవత్సరాలకి పూర్వం వీరు ఇక్కడకి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఎందుకు చనిపోయారనేది ఎప్పటినుండో మిస్టరీగానే ఉండగా దీనిపైనా భిన్న కథనాలు అనేవి ఉండేవి.
ఈ అస్థిపంజరాల సరస్సు మొదటిసారిగా 1942 లో వెలుగులోకి వచ్చింది. అయితే బ్రిటిన్‌కు చెందిన ఫారెస్ట్ గార్డ్ రేంజర్ మధ్వాల్ అనే వ్యక్తి ఇక్కడి పర్వతం పైకి ట్రెక్కింగ్ కి రాగ వీటిని మొదటిసారిగా గుర్తించాడు. ఇక ఇక్కడ 600 అస్థిపంజరాలు ఉన్నాయని తెలిసాక 1957 నుండి ఈ మిస్టరీని ఛేదించేందుకు పరిశోధనలు జరుగుతుండగా 2003 తరువాత ఇండియా, యూరప్ మరికొన్ని దేశాలు చేసిన పరిశోధనలలో ఇవి ఎవరివి? ఇక్కడ ఎందుకు చనిపోయారనేది పక్కన పెడితే ఈ అస్థిపంజరాలు 8 లేదా 9 శతాబ్దానికి చెందినవిగా వారు గుర్తించారు.
ఇది ఇలా ఉంటె, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం ఈ మిస్టరీని ఛేదించేందుకు 2005 నుండి పరిశోధనలు చేసింది. ఇక్కడ ఉన్న అస్థిపంజరాలు అనేవి మద్యదరా, గ్రీకు, భారతదేశానికి, అగ్నేషియా వారిగా వారు తేల్చారు. వీరందరూ కూడా వ్యాపారం కోసం లేదా ఇక్కడ ఉన్న నందాదేవి దర్శనం కోసం వెళుతూ ప్రమాదానికి గురై ఈ సరస్సులో పడి చనిపోవడం వలన ఈ సరస్సులో అస్థిపంజరాలు అనేవి వచ్చే అవకాశం ఎక్కువ ఉందని వారు చెప్పారు. ఇంకా జన్యు పరిశోధనల ద్వారా వీరు ఈ ప్రాంతాలకి చెందిన వారిగా పరిశోధనలో తేలిందని ఇటీవలే తెలిపారు.