ఈ దర్గాలో 11 మంది కలసి ఒక్క చూపుడువేలితే రాయిని ఎలా ఎత్తగలుగుతున్నారు?

0
1580

మన దేశంలో  ఎన్నో దర్గాలు ఉన్నాయి. కానీ దాదాపుగా 700 సంవత్సరాల క్రితం నాటి ఈ దర్గాలో అందరిని ఆశ్చర్యానికి గురి చేసే ఒక రాయి ఉంది. ఈ దర్గాని చూడటానికి విదేశీయులు కూడా ఎక్కువగా వస్తుంటారు. మరి ఈ దర్గా ఎక్కడ ఉంది? ఈ రాయికి ఉన్న విశేషం ఏంటి? దానికి సంబంధించిన కథ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

index fingerపూణే లోని శివపూర్ అనే ఒక గ్రామంలో హజ్రత్ కమర్ అలీ దర్వేష్ దర్గా ఉంది. కమర్ అలీ దర్వేష్ అనే సూపి మత గురువు సమాధి పొందిన చోటే ప్రస్తుతం  అలీ దర్వేష్ దర్గా ఉంది. అయితే ఈ దర్గాని మక్రానా మరియు నల్లని మార్బల్ తో చాలా అందంగా నిర్మించారు. అయితే ఈ దర్గాలో ఆశ్చర్యకర విషయం ఏంటంటే, ఇక్కడ దాదాపుగా 90 కేజీల బరువు ఉన్న రాయి ఉండగా, ఆ రాయిని పదకొండు మంది కలసి చేతులతో కాకుండా ఒక్క చూపుడు వేలి పెట్టి రాయిని గాల్లోకి లేపుతారు. ఇంకా రాయిని చూపుడు వేలితో లేప్ప్పుడు 11 మంది ఒకేసారి రాయి మీద చూపుడువేలు పెట్టి హజరత్ కుమార్ అలీదర్వేష్ అంటూ ఒకేసారి గాలిలోకి లేపాలి. అప్పుడు అంత బరువు ఉన్న ఆ రాయి 11 మంది చూపుడు వేలు సహాయంతోనే ఒకేసారి గాలిలోకి లేస్తుంది.

index fingerఇక సుమారు 700 సంవత్సరాల క్రితం ఈ ప్రదేశంలో హజరత్ అలీ దర్వేష్ అనే అతను నివసించేవాడట. అతడు చిన్నతనంలోనే సూఫీ తత్వాన్ని అలవాటుచేసుకున్నాడు.  అంటే ఇస్లాంని ప్రచారం చేస్తూ దేవుడికి సేవ చేసుకుంటూ ఉండేవాడు. ఇలా చేసేవారిని సూఫీలు అని పిలిచేవారు. అయన 18 ఏళ్ళ వయసులోనే ఈ లోకాన్ని వదిలేసి ప్రపంచానికి జ్ఞాన మార్గం చూపించాడు. అందుకే ఆయన్ని సెయింట్ గా పిలుస్తారు.

index finger

ఇది ఇలా ఉంటె, ఈ దర్గాలో లోపల రెండు రాళ్ళూ ఉంటాయి. ఒకప్పుడు హజరత్ అలీ దర్వేష్ ఈ రెండు రాళ్ళని ఎత్తడానికి ప్రయత్నించేవాడట. అయితే ఆయనకి వీటి విషయంలో ఆసక్తి లేనప్పటికీ ఎప్పుడు వీటిని పైకి ఎత్తడానికి ప్రయత్నం చేస్తూ విఫలం అవుతూ ఉండేవాడట. ఇక దర్గా నిర్మించిన తరువాత 11 మంది కలసి అయన పేరుని పలుకుతూ చూపుడువేలితో ఎత్తగానే ఆ రాయి గాలి లోకి కొన్ని అడుగుల ఎత్తులోకి లేవడం విశేషం.

index fingerఈ దర్గాలో మరొక విశేషం ఏంటంటే, ఇందులోకి ఆడవారికి ప్రవేశం అనేది లేదు. అందుకు కారణం ఏంటంటే, హజరత్ అలీ దర్వేష్ కి వివాహం అనేది జరగలేదు, ఒక బ్రహ్మచారి. అందుకే ఈ దర్గాలోకి ఆడవారికి ప్రవేశం లేదని చెబుతున్నారు. అయితే ఆడవారు కాకుండా కులమతాలకు సంబంధం లేకుండా మగవారు ఎవరైనా ఈ దర్గాలోకి వెళ్ళడానికి ప్రవేశం ఉంది. ఇక ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఉత్సవానికి కొన్ని వేలమంది వస్తుంటారు.

SHARE