కృష్ణుడి మనసులో రాధకే ప్రత్యేకమైన స్థానం ఎందుకో తెలుసా ?

గోపికల కంటే కృష్ణుడు రాధనే ఎక్కువగా ప్రేమించాడు. మహాభారత కథ ప్రకారం గోకులంలో కన్నయ్య కలిసి ఆడుకున్న వారిలో రాధ కూడా ఒకరు. గోకులంలో ప్రకృతి పరంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. అయితే కన్నయ్యను చంపేందుకు కంసుడు ఎంతో మంది రాక్షసులను పంపేవాడు. వారి నుంచి రక్షణ పొందేందుకు గాను చిన్న కృష్ణుడిని పెంపుడు తండ్రి అయిన నందుడు రేపల్లే బృందావనానికి తీసుకెళ్లాడు. ఈ విధంగా బృందావనానికి వెళ్లడం వల్ల తన స్నేహితురాలైన రాధతో ఎక్కువ సమయాన్ని శ్రీకృష్ణుడు గడపలేదు. అంతేకాకుండా కంసుడిని చంపేందుకు గాను కృష్ణుడు మధురకు వెళ్లాల్సి వచ్చింది.

రాధ-కృష్ణులఆ విధంగా రాధ-కృష్ణుల ప్రేమ ముగుస్తుంది. అనంతరం రాధకు వేరే వివాహం చేస్తారు. అయినప్పటికీ తన మనసులో ఎల్లప్పుడూ రాధనే తలుస్తుంటాడు శ్రీ కృష్ణుడు. ఈ విధంగా రాధ జీవితాన్ని సురత్తరుడు తృణీకరించాడు. ఈ కారణంగానే ప్రాపంచిక జీవితంలో కృష్ణుడి మనసులో రాధనే ప్రత్యేకమైన స్థానం సంపాదించింది.

రాధ-కృష్ణులమహాభారతం, భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడికి 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ 8 మంది భార్యలనే అష్టభార్యలని అంటారు. రుక్మిణి, సత్యభామ, జాంబవతి, నాగ్నజితి, కాళింది, మిత్రవింద, భద్రాదేవి, లక్ష్మణ అనే 8 మంది భార్యలను మాధవుడు వివాహం చేసుకున్నాడు. అయినప్పటికీ కృష్ణుడి మదిలో ఎల్లప్పుడూ రాధ కొలువై ఉంటుంది. ఇందుకు కారణం లేకపోలేదు. పశ్చిమ సముద్రతీరములోని ద్వారక రాధికా క్షేత్రమే. ద్వారకలోని పరాశక్తి అంశ రాధ. దాక్షాయణి హృదయం అక్కడ ఉంది. కృష్ణావతార సమయంలో ఆమె మానవస్త్రీగా జన్మించినప్పుడు ఆమెలో గోలోక జ్ఞానం ఉంది. ఆమె లోకాతీతజ్ఞానంతో పుట్టింది. కృష్ణుడు ఆరాధించినది ఆ పరాశక్తి రూపమైన రాధనే. ఆమె మానవ స్త్రీగావచ్చి ఆయనతో సాహచర్యం చేసింది. ఆమె జ్ఞానాంశ. అందుకే ఆమె అంత ప్రత్యేకం. రాధా కృష్ణుల నిస్వార్ధ ప్రేమ గురించి తెలిపే చిన్న కథ ఇప్పుడు చూద్దాం..

రాధ-కృష్ణులఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మ తీవ్రమైన శిరోభారంతో బాధపడుతున్నాడు. ఆయనకు వచ్చిన తలనొప్పి తగ్గేందుకు తరుణోపాయాలు ఏమిటని ఆయన సతీమణులు గాభరా పడుతున్నారు. ఈ సమయంలో అక్కడికి వేంచేశారు నారద ముని. నారాయణ నారాయణ అంటూ శ్రీకృష్ణుడు ఏదో తీవ్రంగా బాధపడుతున్నారే అంటూ అడిగారు. ఎవరూ నోరు మెదపలేదు. చివరికి కృష్ణుడే నాకు శిరోభారంగా వుంది నారదా అని చెప్పాడు. మరి తగ్గే మార్గమేమిటో మీరే సెలవివ్వండి అని నారదుడు అడిగేసరికి నాకు ప్రియులైన వారు ఎవరైనా తమ అరికాలి మట్టిని తెచ్చి నా నుదుటికి రాస్తే తగ్గిపోతుంది అని చెప్పాడు. అంతేకాదు.. అలా అరికాలి మట్టిని ఇచ్చేవారి ధూళితోపాటు వారి పాపపుణ్యాలు కూడా నాకే చెందుతాయన్నాడు.

రాధ-కృష్ణుల వెంటనే నారదుడు శ్రీకృష్ణుని భార్యలను అడిగాడు. వారంతా అబ్బే, మంచి వైద్యులను పిలుపించుదామని అన్నారు. తమ పాదాల ధూళి ఇస్తే ఎక్కడ తమ పుణ్యం పోతుందోనని. చివరికి నారదుడు రాధ వద్దకెళ్లి విషయాన్ని చెప్పాడు. ఆమె మరో ఆలోచన లేకుండా తన అరికాలి ధూళిని ఇచ్చేసింది. వెంటనే నారదుడు అందుకుని, రాధమ్మా. నీవు నీ అరికాలి ధూళి ఇచ్చేశావు, మరి నీ పుణ్యం అంతా పోతుందే అని ప్రశ్నించాడు.

రాధ-కృష్ణుల అందుకు రాధ సమాధానమిస్తూ నా దేవుడు శ్రీకృష్ణుని శిరోభారం తగ్గడమే నాకు ముఖ్యం. దాని ముందు నేను చేసుకున్న పుణ్యం పెద్దదేమీ కాదు అంటూ సమాధానం చెప్పింది. దానితో నారదుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్లి ఆ రాధ అరికాలి పాద ధూళిని ఇచ్చేందుకు చూడగా, శ్రీకృష్ణుని హృదయంలో రాధ అలా పవళించి కనబడింది. నిజమైన భక్తుడు లేదా శిష్యుడు భగవంతుడి హృదయంలో అలా తిష్ట వేసుకుని వుంటాడనీ, నిజమైన శిష్యుడు ఎలా వుంటాడో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని రామకృష్ణ పరమహంస చెప్పారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR