Home Unknown facts ఖడ్గం ధరించి భక్తులకి దర్శనమిచ్చే చెన్నకేశవ స్వామి అరుదైన ఆలయం

ఖడ్గం ధరించి భక్తులకి దర్శనమిచ్చే చెన్నకేశవ స్వామి అరుదైన ఆలయం

0

ఈ దేవాలయం నక్షత్ర ఆకారంలో ఒక ఎత్తైన వేదికపైన నిర్మించబడింది. ఇక్కడ ఉన్న శిల్పాలు జీవకళ ఉట్టి పడేలా ఉంటాయి. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో వెలసిన స్వామివారు ఎవరు? ఈ ఆలయ శిల్పాలు చెక్కిన ఆ శిల్పి ఎవరనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Nakshatramlo Kanipinche Swamywari

కర్ణాటక రాష్ట్రం, హాసన్ జిలాల్లో యాగచ్చి నది తీరాన బేలూరు అనే గ్రామం లో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం 12 వ శతాబ్దానికి చెందినది. ఈ ఆలయం నక్షత్ర ఆకారంలో ఒక ఎత్తైన వేదికపై నిర్మించబడింది. ఈ దేవాలయానికి మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలు శిల్పకళకు చెందిన ఉత్తమ కళాకండాలుగా చెప్పవచ్చు.

ఈ ఆలయ శిల్పి జక్కనాచార్యుడు. ఈ ఆలయంలోని స్వామివారిని శ్రీ చెన్నకేశవస్వామిగా, కొంతమంది విజయనారాయణస్వామిగా కొలుస్తారు. ఆలయంలోని మూలవిరాట్ నిలబడిన భంగిమలో ఎత్తైన పీఠంపై ఖడ్గం ధరించి భక్తులకి దర్శనమిస్తాడు. ఈ ఆలయంలోనే శ్రీ రంగనాయకి అమ్మవారికి ప్రత్యేక ఆలయం ఉంది. ఇంకా ఈ ఆలయ ప్రాంగణం నందు శ్రీమహావిష్ణువు, శివ, పార్వతి, భైరవ, వీర నారాయణస్వామి మొదలగు ఆలయాలు ఉన్నాయి.

ఈ ఆలయ శిల్పి జక్కనాచార్యుడు 12 వ శతాబ్దంలో కర్ణాటక లోని హొయసల రాజుల కాలం నాటి శిల్పి. కర్ణాటక రాష్ట్రంలోని బేలూరు మరియు హళిబేడులో గల ఆలయాల శిల్పకళ జక్కన్నచే రూపు రూపుదిద్దుకున్నవి. ఇక ప్రధానాలయం తూర్పు ద్వారము మొదలుకొని ఉత్తరద్వారం వరకు శృంగార భంగిమలు, లతలు, పుష్పములు, ఏనుగులు మొదలగునవి కళాత్మకంగా ఉంటాయి. ఇంకా పక్షులు, జంతువుల శిల్పాలు జీవకళ ఉట్టిపడుతూ ఉంటాయి.

ఇలా ఎంతో ప్రత్యేకమైన ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తూ ఆ చెన్నకేశవ స్వామిని దర్శించి తరిస్తారు.

Exit mobile version