నరకాసురుడు సత్యభామ చేతిలోనే ఎందుకు చనిపోయాడా తెలుసా?

0
10760

సత్యభామ నరకాసురుడిని వధించిన రోజు లోకాలన్నీ రాక్షసంహారం ముగిసిందని ఆనందంతో దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. ఆ రోజునే మనం ప్రస్తుతం దీపావళి పండుగగా జరుపుకుంటున్నాము. అందుకే దీనిని నరక చతుర్దశి అని కూడా అంటారు. ఇది ఇలా ఉంటె అసలు నరకాసురుడు ఎవరు? నరకాసురిడితో యుద్ధం జరిగే సమయంలో కృష్ణుడు సత్యభామ పక్కన ఉన్నపటికీ నరకాసురుడిని ఆమె సంహరించడం వెనుక రహస్యం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

narakasuruduహిరణ్యకశకుడు అనే రాక్షసుడు ఉపద్రవంగా భూదేవిని చుట్టుముట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి వరాహావిష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు.

narakasuruduఅలా నరకాసురుడు జననం తరువాత అయన ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందుతాడు. నరకాసుడు తన తల్లి తనని సంహరించదనే నమ్మకముతో, నా మరణం నా తల్లి చేతిలో తప్ప ఎవరి చేతిలోనూ సంభవించకూడదనే వరాన్ని పొందుతాడు. అలా వరాన్ని పొందిన నరకాసుడు వర గర్వముతో అందరిని హింసించడం మొదలుపెడతాడు.

narakasuruduనరకాసురుడు మదపుటేనుగు రూపంలో విశ్వకర్మ పుత్రికను చెరపట్టాడు. వీరూ వారను విచక్షణ లేకుండా గంధర్వ, దేవ, మానవ కన్యలను బలవంతంగా అపహరించి, తన అంతఃపుర పంజరంలో బంధించడం ఇతనికొక వ్యసనం. ఇతని దౌర్జన్యాలు అంతటితో ఆగక చివరకు ఇంద్రుని పైకి కూడా దండెత్తి ఆయన అధికార ముద్రను అపహరించడంతో ఈ అసుర ప్రముఖుని దురంతం పరాకాష్టనందుకుంది.

narakasuruduఆ సమయంలో ఇంద్రుడు ఆపదరక్షకుడైన శ్రీకృష్ణుని శరణువేడగా గోపాలుడు నరుకునిపై దండెత్తాడు. అయితే నరకాసురుని విషపు బాణానికి శ్రీకృష్ణుడు ఒక క్షణంపాటు నిశ్చేష్టుడయ్యాడు. అది గమనించి ఆయనతో కూడానే ఉన్న ఆయన సతీమణి సత్యభామ ఉగ్రురాలై భయంకరమైన తన బాణాన్ని ప్రయోగించి సంహరించింది. ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది.

narakasuruduతన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారిందని పురాణాలూ చెబుతున్నాయి.

narakasurudu