చుట్టూ నీరు నిండి ఉండే జల నరసింహ స్వామి! ఎక్కడంటే…

మనస్సు ప్రశాంతత కోసం మనం విహార యాత్రలను.. చేస్తుంటాము.. కాగా ఈ విహార యాత్రాల్లో ఎక్కువగా ఆలయాలను ఎంచుకుంటాము. అలా తప్పని సరిగా దర్శించుకొనే ఆలయంలో ఒకటి ఝర్ణీ నరసింహక్షేత్రం.. క్రీ.పూ 400 ల ఏళ్ల క్రితం ఈ క్షేత్రం లో స్వామివారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్ర దర్శనం.. మన దేశంలో ఉన్న అన్నీ ఆలయాల కంటే భిన్నమైనది.. ప్రత్యేకత కలిగి ఉన్నది.

JALA NARASIMHA SWAMI BIDARభారతదేశం ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు నిలయం అని చెబుతారు. మన భారతదేశంలో కొలువై ఉన్న ఎన్నో ఆలయాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.

ఈ విధంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఆలయాలను సందర్శించడానికి చాలామంది తీర్థయాత్రలు వెళ్తుంటారు. ఈ విధంగా తీర్థయాత్రలకు  వెళ్లేవారు తప్పకుండా ఝర్ణీ నరసింహ క్షేత్రాన్ని దర్శించుకుంటారు.

ఈ ఆలయంలో దర్శనానికి వెళ్ళే భక్తులు మన దేశంలో ఏ ఆలయంలో కూడా ఉండని విధంగా దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బీదర్ కు దగ్గరలో ఉన్న మంగళ్ పేట్ అనే ప్రాంతంలో ఈ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో కొలువై ఉన్న స్వామివారిని జల నరసింహుడు అనే పేరుతో పిలుస్తారు.

JALA NARASIMHA SWAMI BIDARఈ ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ ఆలయంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవాలంటే ఒకే గుహలో మనిషి లోతుగా ప్రవహించే నీటిలో 600 మీటర్ల దూరం ప్రయాణం చేసి స్వామి వారిని దర్శించుకోవాల్సి ఉంటుంది.

JALA NARASIMHA SWAMI BIDARపురాణాల ప్రకారం పరమశివుడే ఈ కొండ గుహలో తపస్సు చేస్తుండగా జల సుర అనే రాక్షసుడు శివుని తపస్సును భంగం కలిగించడానికి వివిధ రకాల ప్రయత్నాలను చేసేవాడు. అదే సమయంలో నరసింహ స్వామి అవతారంలో ఉన్న విష్ణుమూర్తి హిరణ్యకశిపుని చంపి అరణ్యప్రాంతంలో తిరుగుతుంటాడు.

JALA NARASIMHA SWAMI BIDARజలాసురుడు శివుడి తపస్సు భంగం చేయడం చూసిన నరసింహుడు ఎంతో ఆగ్రహం చెంది తన శిరస్సు ఖండిస్తాడు. అయితే తాను చేసిన కొన్ని మంచి పనుల వల్ల తనకు ఏదైనా వరం కావాలో కోరుకొమ్మని వారు అడగగా అందుకు జలాసురుడు నువ్వు ఇక్కడే కొలువై ఉండాలి.

అదేవిధంగా నా పేరుతో కలిపి నిన్ను భక్తులు పూజించాలి అనే వరం కోరుతాడు. ఆ విధంగా ఆ ప్రాంతంలో వెలసిన నరసింహ స్వామి వారిని జల నరసింహ స్వామి అని, ఈ స్వామి వారి చుట్టూ నీరు నిండి ఉంటాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR