NarasimhaSwamy Shri MahaVishnuvuga Darshanamichhe Adbhutham

శ్రీ నరసింహస్వామి కొలువై ఉన్న ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, స్వయంభువుగా వెలసిన ఈ స్వామివారు శ్రీ మహావిష్ణువుగా దర్శనమిస్తారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. NarasimhaSwamy
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖ జిల్లా, భీమిలి అనే గ్రామంలో సౌమ్యగిరి కొండపైన శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయం ఉంది. ఇది చాలా ప్రాచీన ఆలయం. ఇచట స్వామి స్వయంభువుగా వెలిశాడని ప్రసిద్ధి. ఇక ఈ ఆలయ గర్భాలయంలో శ్రీ నరసింహస్వామి చతుర్భుజుడు. శంఖు, చక్ర, గదలను ధరించి చతుర్భుజ శ్రీ మహావిష్ణువుగా మనకి దర్శనమిస్తాడు.NarasimhaSwamyఇక పురాణానికి వస్తే, కృతయుగంలో ప్రహ్లదుని రక్షణార్థం విష్ణువు ఉగ్రనరసింహునిగా అవతరించగా, ఆ ఉగ్రరూపాన్ని చూసి దేవతలు, మునులు భయభ్రాంతులై నరసింహస్వామిని సకలదేవతలతో కూడిన ప్రహ్లదుడు ప్రార్ధించగా స్వామివారు వారి ప్రార్థనకు శాంతించి తన ఉగ్రనరసింహావతారం చాలించి శంఖు, చక్ర, గద అభయహస్తములతో వారిని కరుణిస్తాడు. ఇలాంటి సుందరమైన రూపం ఇచట మాత్రమే మనం చూడగలము. NarasimhaSwamyఈ ఆలయ విషయానికి వస్తే, ఈ ఆలయాన్ని 12 , 13 వ శతాబ్దాలలో నిర్మించినట్లు తెలియుచున్నది. అయితే సౌమ్యగిరి అని పిలువబడే ఈ పర్వతం ఒకప్పుడు బౌద్దక్షేత్రముగా ఉండేదని తెలియుచున్నది. ఇక 11 , 12 శతాబ్దాలలో వైష్ణవం ఎంతో విజృభించించి. ఆ సమయంలో ఇచట ఈ వైష్ణవాలయం ఏర్పడినట్లు ఆధారాలు ఉన్నవి. ఆ తరువాత ఇది శ్రీ కృష్ణదేవరాయలవారి అభిమానము చూరగొని మరింత వన్నెకెక్కింది. NarasimhaSwamyఈ ఆలయం తూర్పు ముఖంగా ఉండి, గర్భాలయం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలుగా ఉన్నది. గర్భాలయంలో శ్రీ లక్ష్మీనారాయణుడు దర్శనమీయగా, అంతరాలయం, ఎడమభాగాన లక్ష్మి అమ్మవారు, గుడికి ఈశాన్య భాగమున కళ్యణమండపము కలవు. ఇక్కడ ఆలయం ప్రదక్షిణ తరువాత స్వామివారి దర్శనం పొందుట ఇక్కడి ఆచారం. NarasimhaSwamyఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుట ఎంతో పుణ్యప్రదంగా భక్తులు భావిస్తారు.NarasimhaSwamy

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR