ఆకర్షణీయమైన స్థన సంపద అంటే ఓ రకంగా ఆడవారు, మగవారికి ఇద్దరికీ ఇష్టమే. పూర్వకాలంలో ప్రతి ఒక్క స్త్రీకి అందమైన వక్షోజాలు ఉండేవి. కానీ, రాను రాను కావాలనుకుని తగ్గించుకోవడం, తక్కువగానే ఉండడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమందికి పెద్ద సైజ్‌లో ఇష్టం లేకుండా వీటిని కావాలని తగ్గించుకుంటుంటే. మరికొంతమంది మాత్రం. ఈ సైజ్‌ని పెంచుకోవాలని ఆరాటపడుతున్నారు. అందుకోసం సర్జరీలు, మందులు, ఇంజెక్షన్స్‌ని కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే, ఇవన్నీ కాకుండా సహజ పద్ధతిలోనే రొమ్ముల సైజుని పెంచుకోవచ్చు అది ఎలాగో తెలుసుకోండి..
ఫెన్నల్/(సోంపు):
స్తన సంపదను పెంచే ఈస్ట్రోజన్ ను శరీరంలో విడుదల చేయడానికి ఉపయోగపడే అనేథోల్, డైఅనేథల్, ఫోటో అనేథల్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు ఈస్ట్రోజన్ వంటిదే మరో ఫోటోఅనేథోలో ఇందులో ఉండి బ్రెస్ట్ సైజ్ పెరుగుదలకు సహాయపడుతుంది. మరియు పాలిచ్చే తల్లుల్లో పాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది.
చికెన్:
మాంసాహార ఉత్పత్తులలో ప్రధానము, సాధారణంగా బయట తేలికగా లభ్యం అయ్యే చికెన్ లో ఈస్ట్రోజన్ అధికం. చికెన్ రెగ్యులర్ గా తింటే స్తనాలు సహజంగా పెరుగుతాయి.
తాజా పండ్లు:
శరీరంలో టెస్టోస్టిరోన్ తగ్గించాలంటే, తాజా పండ్లు, ఈస్ట్రోజన్ అధికంగా వుండే కూరగాయలు, కాయ ధాన్యాలు, బార్లీ, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తింటే వక్షోజాలు సైజు పెరిగే అవకాశం వుంది.
డైరీప్రొడక్ట్స్ :
పెరుగు వంటి పాల ఉత్పత్తులు కూడా స్తనాల సైజులు సహజంగా పెంచుతాయి.
కిడ్నీ బీన్స్:
ఈస్ట్రోజన్ అధికంగా వుండే ఛిక్ పీస్, కిడ్నీ బీన్స్, రెడ్ బీన్స్, బఠాణీ, మొదలైన కాయ ధాన్యాలు తింటే స్తనాలు పెరిగేలా చేస్తాయి. సాధారణంగా చాలా మందికి బీన్స్ అంటే బాగా తెలుసు. అయితే కిడ్నీ బీన్స్ అంటే కొంత మంది తెలియదు.
గుడ్లు:
గుడ్లు, చేప, మాంసం, పాలు కూడా స్తనాల పెరుగుదలకు సహకరిస్తాయి. మహిళ తాను యుక్త వయసు పొందినప్పటినుండి పాల ఉత్పత్తుల ఆహారాలు అధికంగా తీసుకోవాలి. ఇవి ఆమెలో యుక్తవయసు నుండి వచ్చే శారీరక ఎదుగుదలను పెంచటానికి పనిచేస్తాయి.
గ్రీన్ వెజిటేబుల్స్:
పచ్చని ఆకు కూరలు, ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా వుండే ఆహారాలు స్తనాల కణాలను వృధ్ధి చేస్తాయి. బీట్ రూట్, కేబేజి, కాలీఫ్వర్, కేరట్లు, ఉల్లి, కుకుంబర్, గుమ్మడి మొదలైనవి తినాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో విటమిన్స్, ప్రోటీనులు, మినిరల్స్ మరియు ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.శరీర జీవక్రియలు క్రమంగా పనిచేయడానికి ప్రతి రోజూ తీసుకొనే ఆహారంలో ఆకుకూరలను చేర్చుకోవాలి
స్ట్రాబెర్రీస్:
చెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు లో ఈస్ట్రోజన్ అధికంగా వుంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చండి. కాఫీలు, కూల్ డ్రింక్ లు, ఉప్పు అధికంగా వుండే బేకరీ తిండ్లు అరికట్టాలి. ప్రతిరోజు అధికంగా నీరు త్రాగండి. నువ్వులు కూడా స్తనాల పెరుగుదలకు తోడ్పడతాయి. ప్రతిరోజూ స్తనాలకవసరమైన వ్యాయామం చేయాలి.
లికోరైస్:
లికోరైస్ లో కూడా స్తన సంపదను పెంచే ఈస్ట్రోజన్ ను శరీరంలో విడుదల చేయడానికి ఉపయోగపడే అనేథోల్, డైఅనేథల్, ఫోటో అనేథల్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ కాంపౌండ్స్ ఈస్ట్రోజెన్ మరియు ప్రోలాక్టిన్ హార్మోన్లు పెంచుతాయి.
స్టార్ ఆనీస్(నక్షత్రపు సోంపు):
ఇది చైనీస్ మూలిక. దీన్ని వంటకాలకు, మసాల దినుసులతో పాటు విరివిగా ఉపయోగిస్తుంటారు. అయితే స్తన పరిమాణాన్ని సహజంగా పెంచుకోవడానికి వినియోగించవచ్చు. సోంపు మరియు స్టార్ సోంపు ఈ రెండింటిలో ఈస్ట్రోజెన్ ను ప్రభావితం చేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి.
ఉల్లిపాయ:
ఉల్లిపాయల వల్ల ఇదొక మంచి ప్రయోజనం. ఉల్లిపాయలో అధిక శాతంలో సల్ఫర్ ఉంటుంది. సల్ఫర్ రక్త ప్రసరణను పెంచి స్తన వ్రుద్దిని పెంచుతుంది
క్యారెట్:
క్యారెట్ లోని కెరోటినాయిడ్స్ స్తన సౌందర్యం పెంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. జ్యూస్ కు బదులు క్యారెట్స్ అలాగే తినడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు.