లంబోదరుడికి నైవేద్యంగా నవకాయ పిండివంటలు

దక్షిణ భారత దేశంలో ప్రజలు అప్పుడే వినాయకచవితి పిండివంటలు మొదలెట్టేసుంటారు. వినాయకచవితి సౌత్ స్టేట్స్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మరియు మహారాష్ట్రలలో చాలా పెద్ద పండుగ. ఈ పండుగను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు.
విఘ్నాలు తొలగించే వినాయకుడికి నైవేద్యం పెట్టే సమయం వచ్చేసింది. ప్రాంతాలు, భాషలు వేరైనా- గణనాయకుడికి నైవేద్యంగా పెట్టే భక్ష్యాలు ఒకటే. వినాయక చవితికి చాలా స్పెషల్ డిషెష్ ను వండుతుంటారు.

బొజ్జగణపయ్య భోజన ప్రియుడు. అందుకనే లంబోదరుడికి నైవేద్యంగా నవకాయ పిండివంటలు పెడతారు. ముఖ్యంగా వినాయకచవితికి ఉండ్రాళ్ళు, జిల్లేడుకాయలు, పాలతాళికలు, మోదకాలు తప్పని సరి. నూనె లేకుండా పిండివంటలు చేసి వినాయకుడికి నైవేద్యంగా పెడతారు. వినాయకుడికి నైవేద్యంగా పెట్టే ప్రసాదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

2-Rahasyavaani-1107ముందుగా గణేశుడికి ఎంతో ఇష్టమైన పాలతాళికలు..ముందు పొయ్యిమీద మీద దళసరి గిన్నె పెట్టి.. అందులో పాలు, నీళ్లు కలిపి మరిగించాలి. ఒక పొంగురాగానే అందులో సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. ఇంతలో బియ్యం పిండి, కొంచెం మైదాపిండి, ఒక స్పూను పంచదార వేసి ఉడుకుతున్న నీటి తేటను వేసుకుని పిండిని చపాతీ పిండిలా ముద్దగా కలుపుకోవాలి. ఈ పిండిని చేతితో పొడవుగా చేసుకోవచ్చు.. (లేదా జంతికలు ఒత్తే గిద్దలో ఈ పిండిని వేసుకుని మరుగుతున్న నీటిలో డైరెక్ట్ గా ఒత్తుకోవచ్చు) అలా ఒత్తుకున్న తాళికలను మరుగుతున్న పాల మిశ్రమంలో వేసుకోవాలి. అవి ఉడుకున్న సమయంలో రుచికి సరిపడా బెల్లం తురుము లేదా పంచదార వేసుకుని కొంచెం సేపు ఉడకనివ్వాలి. దింపే ముందు కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసుకోవాలి.

5-Rahasyavaani-1107ఉండ్రాళ్ళు బియ్యపు రవ్వతో తయారు చేస్తారు. ముందుగా శనగపప్పుని నాలుగు గంటల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక దళసరి గిన్నె తీసుకుని అందులో ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల నీరు పోసుకుని.. తగినంత ఉప్పు వేసుకుని నానబెట్టుకున్న శనగపప్పు వేసుకుని నీటిని మరగబెట్టుకోవాలి. తర్వాత బియ్యం రవ్వ వేసి.. కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని సన్నని మంటమీద ఉడికించి.. దింపే ముందు కొంచెం నెయ్యి వేసుకోవాలి. తర్వాత మిశ్రమాన్ని ఉండలు లేకుండా చేసుకుని.. గుండ్రంగా ఉండ్రాళ్ళుగా చుట్టుకోవాలి. వీటిని ఇడ్లి పాత్రలో పెట్టి ఒక 15నిముషాలు ఆవిరిమీద ఉడికించాలి. అంతే ఉండ్రాళ్ళు రెడీ.. కొన్ని ప్రాంతాల్లో ఉండ్రాళ్ళను బియ్యం పిండితో కూడా చేస్తారు.

6-Rahasyavaani-1107బియ్యంపిండి తో బెల్లం కుడుములు తయారు చేస్తారు. ఒక కప్పు బియ్యంపిండి మూడు వంతుల నీరు తీసుకోవాలి. అనంతరం ఆ నీటిని ఒక గిన్నెలో వేసుకుని మరిగించాలి. తర్వాత అందులో బెల్లం తురుము, వేసుకుని కొంచెం సేపు కలపాలి.. తర్వాత అందులో బియ్యం పిండి, యాలకుల పొడి, కొబ్బరి తురుము వేసుకుని ఉండలు ఏర్పరకుండా బియ్యంపిండిని కలపాలి. నీరు లేకుండా మిశ్రమం ఉడికిన తర్వాత ఆ పిండిని అలాగే వదిలేసి.. కొంచెం సేపు వదిలెయ్యాలి. తర్వాత చేతికి నెయ్యి రాసుకుని ఉండలుగా చేయాలి.. కొంచెం బిళ్ళల మాదిరి ఒత్తుకోవాలి. తర్వాత వీటిని ఇడ్లి పాత్రలో పెట్టి.. పది నిముషాలు ఆవిరిమీద ఉడికించాలి.

4-Rahasyavaani-1107చలిమిడి వడప్పపు తయారీకి ముందుగా నానబెట్టిన బియ్యాన్ని నీడలో ఆరబెట్టి.. దానిని మిక్సీలో పిండి పట్టుకోవాలి. అనంతరం ఓ గిన్నెలో బియ్యప్పిండి, బెల్లం పొడి, నెయ్యి, కొబ్బరి తురుము, యాలకులు పొడివేసి కలిపితే చలివిడి రెడీ అవుతుంది. ఈ మిశ్రమాన్ని తరువాత రోట్లో వేసి కొద్దిగా దంచితే మంచి టెస్ట్ వస్తుంది. ఇక పెసరపప్పుని నీటిలో నానబెట్టి నీరు తీసివేసి ఆ పెసర పప్పులో కొంచెం బెల్లం కొబ్బరి కలిపితే వడపప్పు రెడీ అవుతుంది.

3-Rahasyavaani-1107జిల్లేడు కాయలు.. ఇది ఎక్కువగా గోదావరి జిల్లాలో కనిపించే వంటకం.. ముందుగా దళసరి గిన్నె తీసుకుని ఒక కప్పు బియ్యం పిండికి రెండు కప్పుల నీరు పోసుకుని మరిగించాలి. ఆ నీటిలో చీకేడు ఉప్పు వేసుకుని నీరు మరిగిన తర్వాత బియ్యంపిండి వేసి.. కొంచెం సేపు ఉడికించాలి నీరు లేకుండా పిండి ఉడికిన తర్వాత దీనిని స్టౌ మీద నుంచి దింపేసి.. ఒక బాణలి స్టౌ మీద పెట్టాలి. అందులో కొబ్బరి తురుము, బెల్లం కొంచెం నీరు వేసి ఉడికించాలి.. ఈ మిశ్రమం ఉడుకుతూ దగ్గరకు ఉండలా వచ్చే సమయానికి కొంచెం నెయ్యి ఇష్టమైన వారు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. అనంతరం ఈ కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు బియ్యంపిండిని ముద్దగా చేసుకుని.. పూరీలా ఒత్తుకుని.. దాని మధ్యంలో కొబ్బరి ఉండను పెట్టి.. అన్నివైపులా మూసివేయాలి.. వీటిని.. ఇడ్లి పాత్రలో పెట్టి.. ఆవిరి మీద కొంచెం సేపు ఉడికించాలి అంతే ఏంతో టేస్టీ టేస్టీ జిల్లేడు కాయలు రెడీ

1-Rahasyavaani-1107

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR