కరోనా పుణ్యమా అని అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిపోయింది. జబ్బు వచ్చాక మందులు, టాబ్లెట్స్, హాస్పిటల్ అని ఆలోచించే జనాలు ఇప్పుడు జబ్బులు రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నారు. అయితే దానికోసం పెద్దగా కష్టపడక్కర్లేదు… పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు… మనం రోజూ తినే ఆహరం లో ఇవి సరిగ్గా వాడితే సరిపోతుంది.
మనం కూరగాయల కోసం బజారుకు వెళ్ళితే తప్పకుండా తీసుకునేవి నాలుగు రకాల ఆకుకూరలు. వెజ్ అయినా… నాజ్ వెజ్ అయినా ఈ నాలుగు ఉండాల్సిందే. కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మెంతికూర.. పప్పులో అయినా, సాంబర్ లో అయినా కరివేపాకు లేకపోతే రుచి సహించదు. వంకాయ అయినా, ఆలు అయినా మెంతికూర వేస్తేనే రుచి. బిర్యానీ వండిన తర్వాత కాస్త పుదీనా వేయకపోతే ప్లెవరే రాదు. చాట్ అయినా…కట్లెట్ అయినా సన్నగా తరిగిన కొత్తమీర అలా అలా చల్లితేనే టెస్ట్.
అయితే ఈ నాలుగు కేవలం రుచికోసమేనా అంటే కాదు ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంచడానికి ఎంతో అవసరం అంటున్నారు పోషకాహార నిపుణులు. మరి వీటిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకుంటే మీరు తినే ఆహారంలో వీటిని ఎప్పుడు మిస్ చేయరు.
కరివేపాకు:
జీర్ణవ్యవస్థను మెరుగు పరచడంలో, డయేరియాను నివారించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కరివేపాకు చక్కగా పనిచేస్తుంది.
కరివేపాకును ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలిపోకుండా చుసుకోవచ్చు. కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే.. క్రమంగా జుట్టు పెరుగుతుంది.
జ్ఞాపశక్తి తక్కువగా ఉందని భావించేవారు, మతిమరుపు ఉన్నవారు నిత్యం కరివేపాకులను తింటుంటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు.
ఇనుము, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఈ ఆకును రోజూ మనం తినే పదార్థాల్లో ఏదో ఒకదానితో కలిపి తీసుకోగలగాలి. ఇది రక్తహీనతను దూరంగా ఉంచుతుంది.
పుదీనా:
వంటల్లో తరచూ పుదీనాని చేర్చుకోవడం వల్ల నోటిలోని హానికర బాక్టీరియాలను నశింపజేస్తుంది.
వర్షాకాలం, శీతాకాలంలో పుదీనా ఆకుల నూనె వేసి ఆవిరి పట్టినట్లయితే జలుబు, గొంతునొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. శ్వాస సంబంధిత సమస్యలను పుదీనా దరిచేరనివ్వదు.
పుదీనా ఆకుల టీ తాగితే కంఠస్వరం బాగుంటుంది. గాయకులు ,డబ్బింగ్ చెప్పేవారు పుదీనా రసం తాగితే కంఠస్వరం మధురంగా తయారవుతుంది.
కడుపు నొప్పితో బాధపడుతున్నవారు మరగించిన పాలలో పుదీనా ఆకులను వేసి కాస్త పంచదార కలిపి తాగితే ఫలితం లభిస్తుంది.
పుదీనా ఆకులు నమిలితే పళ్లు ,చిగుళ్లు గట్టి పడుతాయి, చిగుళ్లుకు సంబంధించిన వ్యాధులు దూరమవుతాయి.
చిన్న పిల్లలు కు గోరు వెచ్చని నీటిలో 6 చుక్కల పుదీనా రసం కలిపి తాగించడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
కొత్తిమీర:
కొత్తిమీర ఆకులు అన్ని రకాల కూరల్లో వాడతారు.ముఖ్యంగా శాఖాహార కూరల్లో కంటే మాంసాహార కూరల్లో ఎక్కువ వాడతారు. కొత్తిమీరలో యాంటి ఆక్సిడెంట్లు ఎక్కువ గా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దీనిలో ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్,ఆక్సాలిక్ యాసిడ్స్, పొటాషియం, ఐరన్, సోడియం మొదలైనవి ఉన్నాయి.
- కొత్తిమీర రక్తహీనతను తగ్గిస్తుంది
- పొగతాగడం , కేమోతెరఫి వల్ల కలిగే నష్టము తగ్గించడానికి పోరాడుతుంది.
- కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది.
- రక్తనాళాలలో ఆటంకాలను తొలగిస్తుంది.
మెంతికూర:
మెంతి ఆకులను నిత్యం తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే శీతాకాలంలో సహజంగానే ఎదురయ్యే చర్మ సమస్యలు తగ్గుతాయి. చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
డయాబెటిస్ ఉన్నవారు మెంతి ఆకులను తీసుకోవడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు.
జీర్ణ సమస్యలు సమస్యలు ఉన్నవారు మెంతి ఆకులను నిత్యం తీసుకుంటే జీర్ణ సమస్యల నుంచి బయట పడవచ్చు.