వేపాకుతో టీ ఒక్కసారి రుచి చూడండి!

వేపాకు పేరు వినగానే గొంతులో చేదు దిగుతుంది. అలాంటిది వేపాకును తినాలంటే కాస్తంత సాహసమే కావాలి. కానీ వేపాకు మానవ శరీరానికి ఎంతో ప్రయోజనం చేకూరిస్తుంది. యుగ యుగాల నుంచి మ‌న భార‌తీయులు వేప చెట్టు నుంచి వ‌చ్చే ఆకులు, పువ్వులు, గింజలు, కలప, నూనె, బెర‌డు ఇలా అన్నిటినీ అనేక విధాలుగా ఉప‌యోగిస్తున్నారు.

neem leafబోలెడ‌న్ని ఔష‌ధ గుణాలు దాగి ఉండే వేప ఆరోగ్య ప‌రంగానూ, సౌంద‌ర్య ప‌రంగానూ ఎన్నో ప్ర‌యోజ‌నాలు చేకూరుస్తుంది. వేపాకును ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద ఔషధాల్లో వాడుతుంటారు. బ్యాక్టీరియా, వైరస్‌పై వేపాకు చక్కగా పోరాడుతుంది. చర్మ సమస్యలను దూరంచేస్తుంది.

మరి ఆ వేపాకుతో టీ చేసుకుంటే… చేదుగా ఉన్న ఆకును నోట్లో వేసుకోవడమే కష్టమంటే టీ చేసుకోవడమా అనుకుంటారేమో… వేపాకుతో టీ చేదుగా ఉన్నాసరే అది అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది. వేపాకు టీ అనేది ఒక హెర్బల్ టీ. వేపాకు టీ తాగితే నోటి దుర్వాసన వేపాకు టీ దూరం చేస్తుంది.

neem teaమానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎప్పుడైనా ఒత్తిడిగా ఉన్నా, మనసు ప్రశాంతంగా లేకున్నా ఒక కప్పు వేప టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయడంలో వేపాకు టీ చక్కగా పనిచేస్తుంది. శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలను వేపాక్ టీ నిర్మూలిస్తుంది. ఈ వేపాకుల టీ ప్ర‌తి రోజుకు ఒక క‌ప్పు చొ‌ప్పున తీసుకుంటే మ‌లినాల‌ను బ‌య‌ట‌కు పంపి ర‌క్తాన్ని శుద్ధి చేసి కాలేయాన్ని, కిడ్నీల పనితీరు మెరుగ‌య్యేందుకు స‌హాయ‌ప‌డుతుంది.

liver and kidney diseaseఅలాగే ర‌క్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించి గుండె పోటు, ఇత‌ర గుండె జ‌బ్బులు ద‌రి చేర‌కుండా కాపాడుతుంది.గ్యాస్ ట్ర‌బుల్, కడుపులో మంట‌, అల్సర్లు, మలబద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు ఉన్న వారు రోజుకో క‌ప్పు వేపాకుల టీ సేవిస్తే ఈ స‌మ‌స్య‌ల‌న్నీ దూరం అవుతాయి.

పురుషులకు, స్త్రీలకు చుండ్రు సమస్య పెద్ద తలనొప్పి. నీటిలో కొన్ని వేపాకులు వేసి బాగా మరిగించి దాన్ని చల్లారించాలి. ఆ తర్వాత షాంపుతో తలస్నానం చేసి ఈ వేపాకు నీటితో మరోసారి శుభ్రంగా తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది. మరి ఈ వేప టీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం…

dandruff and hairfallవేపాకులను మంచినీళ్లలో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత గిన్నెలో నీళ్లు పోసి వేపాకులు వేసి మరిగించాలి. నీ ళ్లు లైట్ గ్రీన్ కలర్‌‌లోకి వచ్చాక స్టవ్ ఆపాలి. ఈ నీళ్లను వడకట్టి బెల్లం లేదా చక్కెర కలిపి తాగాలి. ఈ టీ వేడి వేడిగ ఉన్నప్పుడు తాగితేనే చేదు తెలియకుండా ఉంటుంది.

stressఅయితే మంచి అందరికి మంచిదైనా.. కొందరికి విషం లాంటిది. అలాగే వేపాకు టీ ఆరోగ్యానికి మంచిదైనా సరే గర్భిణులు డాక్టర్ల సలహా తీసుకున్న తర్వాతే వేపాకు టీ తాగటం మంచింది. పిల్లలకు పాలిచ్చే స్త్రీలు కూడా వేపాకు టీ తాగకూడదు. అవయవ మార్పిడి చేసుకున్నవారు, ఇటీవలే శస్త్రచికిత్స జరిగిన వారు కూడా వేపాకు టీకి దూరంగా ఉండాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR