Home Health పొట్లకాయ తినడమే కాదు… ఒకసారి జ్యూస్ తాగి చూడండి!

పొట్లకాయ తినడమే కాదు… ఒకసారి జ్యూస్ తాగి చూడండి!

0
snake gourd juice for weight loss

మనలో చాలామంది పొట్ల కాయ తినడానికి ఇష్టపడరు. కొంతమందికి అసలు పొట్లకాయ గురించి తెలియదు. పాములా కనిపించే పొట్లకాయకు ఆంగ్లంలో స్నేక్ గార్డ్ అని పేరు. సాధారణంగా మార్కెట్ లో దొరికే కూరగాయలతో పోలిస్తే పొట్లకాయ చాలా తక్కువగా కనిపిస్తుంటుంది. దానివల్ల కూడా కొంతమందికి దీని గురించి తెలిసి ఉండకపోవచ్చు. ఒకప్పుడు పొట్లకాయ సాగు ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుత జనరేషన్ వాళ్ళకి దాని గురించిన అవగాహన లేకపోవడంతో తినే వారి సంఖ్యా తగ్గింది.. పండించేవారు సంఖ్య కూడా తగ్గింది.

అయితే సామాన్యుడికి అందుబాటులో ఉండే కూరగాయలలో పొట్ల కాయ‌లు ఒక‌టి. కొంద‌రు వీటిని ర‌క ర‌కాలుగా కూర‌లు చేసుకుని తింటారు. పొట్ల‌కాయ‌ల‌తో అద్భుత‌మైన ఆరోగ్య‌ ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పొట్ల‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ల‌కాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. క‌ణాలు సుర‌క్షితంగా ఉంటాయి. క్యాన్స‌ర్ వంటి వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఫ్రీ ర్యాడిక‌ల్స్ న‌శిస్తాయి. డ‌యాబెటిస్ ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

పొట్ల‌కాయల్లో యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాలు ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరంలోని వాపులు, నొప్పులు త‌గ్గుతాయి. కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి మేలు జ‌రుగుతుంది. ఆ నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. పొట్ల‌కాయ‌ల్లో విట‌మిన్లు ఎ, బి6, సి, ఇ ల‌తోపాటు అనేక ర‌కాల మిన‌ర‌ల్స్ ఉంటాయి. ఫైబ‌ర్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్, జింక్‌, మాంగ‌నీస్‌, అయోడిన్‌లు.. వీటిల్లో అధికంగా ఉంటాయి. వీటివ‌ల్ల పోష‌ణ ల‌భిస్తుంది. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండ‌వచ్చు. పొట్ల‌కాయ‌ల‌ను తింటే జీర్ణ స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం ఉండ‌వు. జీర్ణ‌వ్య‌వ‌స్థ శుభ్ర‌మ‌వుతుంది. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు రోజూ పొట్ల‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల ఫ‌లితం ఉంటుంది.

అయితే పొట్లకాయను నేరుగా తినలేని వారు జ్యూస్ చేసుకొని తాగొచ్చు. నిజానికి పొట్లకాయ జ్యూస్ తాగడం వలనే ఎక్కువ ప్రయోజనాలు పొందొచ్చట. బరువు తగ్గాలనుకునే వారు రోజూ పొట్ల‌కాయ జ్యూస్‌ను ఒక గ్లాస్ మోతాదులో తాగితే సరిపోతుంది. వీటిలో ఉండే ఫైబ‌ర్ బ‌రువును త‌గ్గిస్తుంది. ఆక‌లిని అదుపులో ఉంచుతుంది. కొవ్వును క‌రిగించేందుకు స‌హాయ ప‌డుతుంది. పొట్ల‌కాయ‌ల జ్యూస్‌ను తాగ‌డం వ‌ల్ల కిడ్నీ స్టోన్లు క‌రిగిపోతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి. హైబీపీ ఉన్న‌వారు రోజూ పొట్ల‌కాయ జ్యూస్‌ను తాగితే ఫ‌లితం ఉంటుంది. అలాగే మ‌హిళలు పీసీవోఎస్ స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

ఇక శరీరానికి ఇతర పోషకాలు మాదిరిగానే ఐరన్ కూడా చాలా అవసరం. ఒకవేళ ఐరన్ లోపం తలెత్తితే శరీరానికి అవసరమయ్యే హిమోగ్లోబిన్ ఉత్పత్తి కాస్తా తగ్గుతుంది. దీని కారణంగా రక్తహీనత, జుట్టు రాలడం, నీరసం, అలసట, నిద్రలేమి, ఒత్తిడి వంటి అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా స్త్రీలు ఐరన్ లోపంతో బాధపడుతుంటారు. అందుకే ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలతో పాటు ఐరన్ స్థాయిలను పెంచే జ్యూస్ లను డైట్‌లో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు.

విటమిన్-సి అధికంగా ఉండే జ్యూస్‌లు రక్తహీనతను తగ్గించేందుకు సహాయపడతాయి. పొట్లకాయతో తయారు చేసిన ఈ జ్యూస్ బరువు తగ్గడానికి దోహదపడుతుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి బయటపడేస్తుంది. పైగా ఇవి అందుబాటు ధరలో దొరుకుతాయి. ఇంకా ఈ జ్యూస్‌లను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.

Exit mobile version