Nune ammukune oka sadharana Sthree devudiki kattinchina adbhutha aalayam

0
2455

పురాతన కాలంలో వెలసిన దేవాలయాలు ఎక్కువగా రాజులూ కట్టించినవే అని చెబుతారు. అయితే ఇక్కడ వెలసిన శ్రీ మహావిష్ణువు ఆలయం మాత్రం నూనె అమ్ముకునే సాధారణ స్త్రీ ఇక్కడ ఆలయాన్ని కట్టించినది ఇంకా ఈ స్త్రీ తక్కువ జాతికి చెందిన స్త్రీ అని స్థల పురాణం ద్వారా తెలియుచున్నది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆమె గుడి ఎలా నిర్మించిందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. aalayamఛత్తీస్ ఘడ్ లోని రాయపూర్ జిల్లా కి కొన్ని కిలోమీటర్ల దూరంలో రాజిమ్ అనే పట్టణంలో రాజీవ్ లోచన అనే దేవాలయం ఉంది. ఇక్కడ కొన్ని దేవాలయాల సమూహం ఉన్నదీ. అందులో రాజీవ్ లోచన దేవాలయం ప్రధానమైనది అని చెబుతారు. ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణవు భక్తులకి దర్శనం ఇస్తున్నాడు. aalayamఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, నూనె అమ్ముకొని జీవితం గడిపే తక్కువ జాతికి చెందిన ఒక సాధారణ స్త్రీ ఆలయం నిర్మాణం చేప్పట్టలనుకుంది, అయితే కులం తక్కువ అయినా ఈమె నిర్మించిన ఆలయానికి ఎవరు రారు ఏమో అని తలచి ఒక రోజు బాధపడుతూ ఉంది. ఆ రోజు ఆమె కలలోకి శ్రీ మహావిష్ణువు కనిపించి, భక్తురాల నీచే నిర్మించిన ఆలయానికి భక్తులు తప్పకుండ వస్తారు, ఈ ఆలయం గొప్ప ఆలయంగా కీర్తి పొందుతుంది అని స్వామి తన కలలో చెప్పాడు.అప్పుడు సంతోషించిన ఆ స్త్రీ ఆలయ నిర్మాణాన్ని కొన్ని రోజుల్లో పూర్తి చేసింది. aalayamఈ ఆలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి, ఈ ఆలయంలో క్షత్రియులు పూజాధికారులుగా వ్యవహరిస్తారు. ఇక దేశంలో ఎక్కడ లేని విషంగా ఈ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహాన్ని గొప్పగా అలంకరిస్తారు. ఈ విగ్రహాం నల్లటి గ్రానైట్ రాతి శిలాతో చేయబడింది.
ఇక్కడ మరో విశేషం ఏంటంటే, స్వామివారి విగ్రహానికి వివిధ రకాలుగా వస్త్రధారణ చేస్తారు. ఉదయం పూట విష్ణుమూర్తిని బాలుని వలె వస్త్రములతో అలంకరింబడగా, మధ్యాహ్నం యువకుని వలె, రాత్రికి వృద్ధిని వలె అలంకరించబడతాడు. ఇంక్కా విష్ణుమూర్తి తల పాగాను అనేక తరాల నుండి ఒక కుటుంబం వారే నేయుట ఒక ప్రత్యేకత. aalayamఇలా ఎన్నో విశేషాలు కలిగిన ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ జరిగే గొప్ప ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు.aalayam